న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ మధ్యలో వాష్ రూమ్‌కు పరుగు తీసిన బ్యాట్స్‌మన్.. నవ్వు ఆపుకోలేకపోయిన ప్రత్యర్థి ఆటగాళ్లు

PSL 2020: Imam-ul-Haq hilariously trolls Mohammad Hafeez during Eliminator game

కరాచీ: కరోనా కారణంగా నిలిచిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) క్వాలిఫై మ్యాచ్‌లు శనివారం మళ్లీ ప్రారంభమయ్యాయి. మార్చిలో ఆగిపోయిన ఈ లీగ్‌కు ఆ తర్వాత ఐపీఎల్ రూపంలో అడ్డంకి ఎదురైంది. విదేశీ ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో బిజీగా ఉండటంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసేదేంలేక భారత క్యాష్ రిచ్ లీగ్ తర్వాతే లీగ్ రీస్టార్ట్ చేయాలని నిర్ణయించింది. ఇటీవల ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో పీఎస్ఎల్ మళ్లీ పట్టాలెక్కింది. ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగ్గా.. లాహోర్ ఖలాండర్స్, పెష్వార్ జల్మీ మధ్య ఎలిమినేట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ హఫీజ్(74 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో లాహోర్ ఖలాండర్స్ 5 వికెట్లతో గెలుపొంది టోర్నీలో ముందడుగువేసింది. అయితే మ్యాచ్ జరుగుతుండగా మహ్మద్ హఫీజ్ వాష్ రూమ్‌కు పరుగెత్తడం చర్చనీయాంశమైంది.

ఇంతకీ జరిగిందేందంటే..?

ఇంతకీ జరిగిందేందంటే..?

లాహోర్ ఖలాండర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 12 ఓవర్ ఫస్ట్ బాల్‌కు బెన్ డక్ ఔటవ్వగా.. అతనితో పాటు మహ్మద్ హఫీజ్ కూడా మైదానం వీడాడు. దాంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే టీవీ ప్రేక్షకులకు మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ బ్రేక్‌లో పెష్వార్ ఆటగాళ్లు షోయబ్ మాలిక్, వహబ్ రియాజ్, ఇమామ్ ఉల్ హక్ ఒక్కదగ్గరికి చేరి ముచ్చటిస్తుండగా.. వారిని కామెంటేటర్ రమీజ్ రాజా పలకరించాడు. ఇప్పుడేమైనా టైమ్ ఔటా.. హఫీజ్ మైదానం వీడాడెందుకని ప్రశ్నించాడు. దీనికి ఇమామ్ ఉల్ హక్ ఫన్నీగా బదులిచ్చాడు.

2 ఓవర్ల నుంచి ఆపుకుంటున్నాడు..

హఫీజ్ ( ‘2 ఓవర్స్ సే కే రహా హై ముజే సుసు ఆరా హై'') గత రెండు ఓవర్లుగా తనకు అర్జెంట్ అని, వాష్ రూమ్‌కు వెళ్తానని అడుగుతున్నాడని తెలిపాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ఇక హఫీజ్ మైదానంలోకి రావడంతో ఆట ప్రారంభమైంది. ఆటకు అంతరాయం కలిగించినా.. తన బ్యాటింగ్‌కు మాత్రం హఫీజ్ బ్రేక్ ఇవ్వలేదు. అద్భుత బ్యాటింగ్‌తో ఖలాండర్స్ సూపర్ విక్టరీని అందించాడు. క్వాలిఫయర్-2లో ముల్తాన్ సుల్తాన్స్‌తో లాహోర్ ఖలాండర్స్ తలపడనుంది.

మాలిక్ వినహా..

మాలిక్ వినహా..

ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పెష్వార్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 170 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్(39), హర్దస్ విజియోన్(37)టాప్ స్కోరర్లుగా నిలిచారు. లాహోర్ బౌలర్లలో దిల్బార్ హుస్సెన్ మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, హరిస్ రాఫ్, డెవిడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం లాహోర్ ఖలాండర్స్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మహ్మద్ హఫీజ్(74) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

అనుష్క శర్మ ‘కుక్క' విరాట్ కోహ్లీ.. కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్యలు!

Story first published: Sunday, November 15, 2020, 19:33 [IST]
Other articles published on Nov 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X