అనుష్క శర్మ పెంపుడు కుక్క ‘విరాట్ కోహ్లీ’.. కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కాంగ్రెస్ అధికారప్రతినిధి ఉదిత్ రాజ్ కుక్కతో పోల్చాడు. దీపావళి విషెస్ విషయంలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన కోహ్లీని వెనుకెసుకొస్తూనే ఈ సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందీలో వరుసగా ట్వీట్‌లు చేసిన ఆయన ఈ భూమి మీద కుక్క కన్నా విశ్వాసమైన జీవి మరేది లేదని, కొంత మంది దాని స్థాయిని తగ్గించారన్నాడు. అయితే ఉదిత్ రాజ్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్న కోహ్లీ అభిమానులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఉదిత్ రాజ్ ట్వీట్స్ వివాదాస్పదమయ్యాయి.
ఇంతకీ విషయం ఏంటంటే..?
దీపావళీ పర్వదినాన తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన కోహ్లీ.. పర్యావరణానికి హానీ కలిగించే టపాసులు కాల్చవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. ‘పర్యవరణానికి హానీ కలిగించే క్రాకర్స్ కాల్చవద్దు. ఈ దీవాళి సింపుల్‌గా దీపాలు, స్వీట్లతో మనకు నచ్చినవాళ్లతో సరదాగా జరుపుకుందాం'అని వీడియో ద్వారా పిలుపునిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ సూచనలపై నెటిజన్లు భగ్గుమన్నారు. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది చెత్త పనులు? అంటూ .. 'నవంబరు 5న నీ పుట్టినరోజు నాడు అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటి..?'అని ప్రశ్నించారు.
‘కోహ్లీ.. నువ్వు కుక్కవి.. అందుకే దీపావళి రోజున టపాసులు పేల్చవద్దంటున్నావ్' అని ఘాటుగా కూడా వ్యాఖ్యానించారు.

కుక్క కన్నా విశ్వాసమైనది..
ఇక విరాట్ కోహ్లీపై జరిగిన ట్రోలింగ్‌పై కాంగ్రెస లీడర్ ఉదిత్ రాజ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. విరాట్‌పై విమర్శలు చేసిన వారిని దోపిడీదారులు, దొంగలు, మానవత్వంలేని మూర్ఖులుగా అభివర్ణిస్తూ మండిపడ్డాడు. అయితే ఈ కమ్రంలో విరాట్‌ను అనుష్క శర్మ కుక్కగా పేర్కొని విమర్శలపాలయ్యాడు. ‘అవును కోహ్లీ కుక్కే. అనుష్క పెంపుడు కుక్క. కుక్కకంటే విశ్వాసమైన జంతువు ఏముంటుంది..? అందుకే అనుష్కకు తన కుక్కను కట్టి ఉంచాల్సిన అవసరం లేదు. టపాసులు పేల్చి కాలుష్యం పెంచవద్దని, కాలుష్యం వల్ల మానవ మనుగడే దెబ్బతింటుందని కోహ్లీ మీకు చెప్పాడు. కానీ మీలాంటి వెధవలు, మూర్ఖులకు అర్థం కాలేదు. మీ డీఎన్‌ఏని ఒకసారి చెక్ చేయించుకోండి. మీరు ఇక్కడి మూలవాసులా.. కాదా తెలుస్తుంది' అంటూ ఉదిత్ రాజ్ ట్విటర్‌లో నిప్పులు చెరిగారు.

కుక్కను నీచం చేశారు..
కోహ్లీని కుక్కతో పోల్చడాన్ని సహించని అభిమానులు ఉదిత్ రాజ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని గ్రహించిన ఉదిత్ రాజ్ తన ఉద్దేశాన్ని మరో ట్వీట్ ద్వారా వివరించే ప్రయత్నం చేశాడు. ‘దీపావళి సందర్భంగా అభిమానులకు విరాట్ కోహ్లీ చేసిన సూచన ఆహ్వానించదగినది. కానీ కొంతమంది దుర్మార్గులు ట్విటర్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. నిశబ్ద ఏకాభిప్రాయంతో ప్రభుత్వం కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది. విరాట్‌ను విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు వారు మనుషులే కాదు. ఆ నీచులు కుక్క స్థాయిని తగ్గించారు. కానీ కుక్క కంటే విశ్వాసమైన జీవి ఈ భూమి మీదనే లేదు'అని ఉదిత్ రాజ్ స్పష్టం చేశాడు.

ఆసీస్‌లో విరాట్..
ఇక ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో కోహ్లీ నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పాటిస్తుంది. అయితే జట్టుకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. రెండు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది. కరోనా అనంతరం ఇదే తొలి అంతర్జాతీయ టూర్ కావడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
క్రికెట్ గాడ్ అరంగేట్రానికి 31 ఏళ్లు.. ఓ పిల్లవాడా ఇంటికి వెళ్లి పాలు తాగిరా..!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications