న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సాయాన్ని కూడా ప్రశ్నించడం దారుణం: మాజీ క్రికెటర్

Pragyan Ojha Slams People For Questioning Those Making Donations To Fight Coronavirus

హైదరాబాద్: కరోనా వైరస్‌ కట్టడికి తమ వంతు సాయం చేస్తున్న వారిని నువ్వెంత ఇచ్చావ్? అంటూ ప్రశ్నించడం దారుణమని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా దేశం మొత్తం 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎందరో అభాగ్యులకు పనిలేక పస్తులుంటున్నారు. అలాంటి వారిని ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సంపన్నవర్గాలకు పిలుపునిచ్చారు.

తోచిన సాయం..

తోచిన సాయం..

ఈ నేపథ్యంలో చాలా మంది తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలందరూ విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇది ప్రపంచ సమస్య కాబట్టి ఏ దేశంలోని ప్రముఖులు వారికి దేశాలకే సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.

విరుష్క విరాళం ఎంతో తెలుసా?

అక్షయ్ రూ. 25 కోట్లు.. సచిన్ రూ.50 లక్షలే?

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ రూ. 25 కోట్లు సాయం చేస్తే, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చాడు. దీనిపైనే సోషల్‌ మీడియాలో ప్రధానంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఒక ఫిల్మ్‌ స్టార్‌ 25 కోట్ల విరాళంగా ఇవ్వడానికి ముందుకొస్తే, దిగ్గజ క్రీడాకారుడు సచిన్‌ రూ. 50 లక్షలు ఇవ్వడం ఏంటని అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరొకవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చాడు. ఇక బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు రూ. 10 లక్షలు సాయం చేసింది. ధోనీ లక్ష రూపాయలపై కూడా తీవ్ర దుమారం రేగింది.

ఇది చాలా తప్పు..

ఇది చాలా తప్పు..

ఇలా ప్రతీ ఒక్కరు చేసిన సహాయాల్ని జనం నిశితంగా పరిశీలించడమే కాకుండా విమర్శలకు దిగడంపై ప్రజ్ఞాన్ ఓజా ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ కష్ట సమయంలో ఎవరికి తోచింది వారు సాయం చేస్తారని, అది వారి అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఆధారపడుతుందని ఈ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ స్పష్టం చేశాడు.అసలు సాయానికి కొలమానం ఉంటుందా? అని ప్రశ్నించాడు.

సాయం సాయమే...

సాయం సాయమే...

ఎవరు ఎంత సాయం చేసినా వారికి ధన్యవాదాలు చెప్పాలని, అంతేకానీ ‘నువ్వు తక్కువ సాయం చేశావ్‌.. అతను ఎక్కువ సాయం చేశాడు'అంటూ విమర్శలకు దిగడం ఏమాత్రం మంచిది కాదన్నాడు. ‘ఇది చాలా కొత్తగా అనిపిస్తోంది. ప్రతీ ఒక్కరికీ సాయం చేసే గుణం ఉండాలి. అంతే కానీ ఇంతే ఇచ్చావ్‌ అని ప్రశ్నించడం కరెక్ట్‌ కాదు. సాయం సాయమే. దీనికి వేరే కొలమానాలు లేవు. ఎవరు సాయం చేసినా అందుకు ధన్యవాదాలు తెలిపాల్సిందే'అని ఓజా స్పష్టం చేశాడు.

Story first published: Monday, March 30, 2020, 18:12 [IST]
Other articles published on Mar 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X