న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అపహాస్యం పాలైన పాక్.. 'పాకియతాన్‌' ఎక్కడుందంటూ పీసీబీని ఆడుకుంటున్న నెటిజన్లు!

PCB gets trolled on Twitter after misspelling Pakistan as Pakiatan


న్యూఢిల్లీ:
తమ ఆటగాళ్లకు కరోనా వైరస్ పాజిటీవ్, నెగటీవ్ అంటూ యావత్ ప్రపంచం ముందు అపహాస్యం పాలైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సోమవారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. పలు నాటకీయ పరిణామాల అనంతరం పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బందితో కూడిన పాక్‌ బృందం ఇంగ్లండ్‌తో సిరీస్‌ కోసం ఆదివారం మాంచెస్టర్‌‌కు బయలుదేరింది.

పాకిస్థాన్ స్పెల్లింగ్ కూడా రాదు..

తమ జట్టు ఇంగ్లండ్‌కు బయలు దేరిందనే విషయాన్ని తెలుపుతూ పీసీబీ చేసిన ట్వీట్‌ ట్రోలింగ్‌కు దారితీసింది. ఇప్పటికే కరోనా పరీక్షల వ్యవహారంలో ఇంట బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బోర్డు.. తన ట్వీట్‌లో దేశం పేరును తప్పుగా రాసి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌కు బదులుగా 'పాకియతాన్‌ జట్టు ఇంగ్లండ్‌కు బయలుదేరింది. ఆల్‌ ది బెస్ట్‌ బాయ్స్‌' అని ట్వీట్‌ చేసింది. దీంతో నెటిజన్లు 'పాకియతాన్' ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. పలు మీమ్స్‌ కూడా సృష్టిస్తున్నారు. పీసీబీకి పాకిస్థాన్ స్పెల్లింగ్ కూడా రాదు.. అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓ గంట తర్వాత తప్పును గుర్తించిన పీసీబీ సరిదిద్దుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇదే మొదటిసారి కాదు..

ఇక పీసీబీ ట్విటర్ హ్యాండిల్‌లో తప్పులు దొర్లడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం ఆసియా కప్ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2017 హైలైట్స్ చూడండి అంటూ పీసీబీ చేసిన ట్వీట్‌లో కూడా స్పెల్లింగ్ మిస్టెక్స్ వచ్చాయి. ‘happened'స్పెల్లింగ్‌ను ‘hapoened'‌గా రాసింది. అప్పట్లో కూడా అభిమానులు పీసీబీని ఏకిపారేసారు. ఇక ఈ తప్పిదం ఇప్పటి ఉండటం గమనార్హం.

పాజిటీవ్.. నెగటీవ్

వాస్తవానికి 29 మంది ప్లేయర్లను పాక్ బోర్డు ఇంగ్లండ్‌కు పంపాలని భావించింది. కానీ ఇందులో 10 మంది క్రికెటర్లకు ముందు కరోనా పాజిటీవ్ రాగా.. అందులో ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ మరోసారి వ్యక్తిగతంగా పరీక్షలు చేసుకోగా నెగటీవ్ వచ్చింది. అతను ఈ రిపోర్టులను సోషల్ మీడియాలో బయటపెట్టడంతో పీసీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో అతనికి మరోసారి పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చింది. ఈ క్రమంలో అతనిపై చర్యలు తీసుకునేందకు బోర్డు సిద్దమైంది. కానీ శనివారం మరోసారి 10 మంది ఆటగాళ్లను మళ్లీ పరీక్షించగా అందులో మహ్మద్ హఫీజ్‌తో ఆరుగురికి నెగెటివ్‌గా వచ్చింది.

3 టెస్ట్‌లు.. 3 టీ20లు..

3 టెస్ట్‌లు.. 3 టీ20లు..

దీంతో మరోమారు పరీక్షించాకే ఈ 10 మందిని ఇంగ్లండ్‌కు పంపిస్తామని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. వారి హెల్త్ క్లియరెన్స్ వచ్చిన వెంటనే కమర్షియల్ ఫ్లైట్‌లో ఇంగ్లండ్ చేరుకొని తమ టీమ్‌తో కలవచ్చని ఈసీబీ పేర్కొంది. ఇక ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆగస్టులో పాక్-ఇంగ్లండ్ జట్ల మధ్య 3 టెస్టులు, 3 టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.

2007 టీ20 ప్రపంచకప్ ఆడకుండా ఆ ఇద్దరిని ద్రవిడ్ ఒప్పించాడు: లాల్‌చంద్ రాజ్‌పుత్

Story first published: Tuesday, June 30, 2020, 12:24 [IST]
Other articles published on Jun 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X