న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: పార్దీవ్ పటేల్

Parthiv Patel feels Virat Kohli is more aggressive while leading India than RCB

న్యూఢిల్లీ: సారథ్య విషయంలో ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ ముగ్గురు ముగ్గురేనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ పార్దీవ్ పటేల్ తెలిపాడు. ప్రస్తుత భారత కెప్టెన్ కోహ్లీ సారథ్యం ప్రత్యేకంగా ఉంటుందని, ఆటగాళ్లను ఎప్పుడూ మునివేళ్లపై నిలబెడతాడన్నాడు. ముందుండి జట్టును నడిపించాలనుకోవడంతో పాటు అతడు దూకుడుగా ఉంటాడని చెప్పాడు. అదే కోహ్లీ నైజమని, అది తనకి సరిగ్గా సరిపోతుందని స్పష్టంచేశాడు.

ఆర్సీబీ కెప్టెన్‌గా..

ఆర్సీబీ కెప్టెన్‌గా..

భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడిన పార్దీవ్.. కోహ్లీ, ధోనీ, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. అయితే కోహ్లీలో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న దూకుడు ఆర్సీబీ తరఫున కనిపించదన్నాడు. ‘భారత కెప్టెన్‌గా కోహ్లీ చాలా ప్రత్యేకం. ఎందుకంటే బుమ్రా, షమీలతో పాటు నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో ఎప్పుడూ వికెట్లు తీయడం గురించే ఆలోచిస్తాడు. కానీ ఆర్సీబీలో పరిస్థితుల తగ్గట్టు అతని దూకుడు ఉంటుంది.

పిచ్ అనుకూలించకపోతే డిఫెన్సివ్ అప్రోచ్ ఉంటుంది. ప్రత్యర్థిని 200లోపు కట్టడి చేస్తే... జట్టుకు గెలిచే అవకాశం ఉంటుంది. అదే 220-230 సమర్పించుకుంటే మాత్రం ఏం చేయలేం. అందుకే భారత జట్టు తరఫున కోహ్లీ కనబర్చే దూకుడు ఆర్సీబీలో ఉండదు'అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు.

ధోనీకి అది బాగా తెలుసు..

ధోనీకి అది బాగా తెలుసు..

‘ధోనీ, రోహిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతారు. కానీ విరాట్‌ ప్రతీ ఆటగాడిని మునివేళ్లపై నిలబెట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఇక ధోనీ విషయానికొస్తే.. ప్రతీ ఆటగాడి సామర్థ్యం, వారి నుంచి ఏం రాబట్టుకోవాలనే విషయాలపై మహీకి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ విధంగానే వారి ప్రతిభను బయటకు తీసుకువస్తాడు. క్రికెటర్లను తమ సహజసిద్ధమైన ఆట ఆడేలా వదిలేస్తాడు. అలా వారికి మంచి వేదిక ఏర్పాటు చేసి తమ ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తాడు.

ఆటగాళ్లను ఉపయోగించుకునే తీరు..

ఆటగాళ్లను ఉపయోగించుకునే తీరు..

అలాగే రోహిత్‌ కెప్టెన్‌గా మంచి ప్రణాళికలు రూపొందిస్తాడు. ప్రత్యర్థుల గురించి తెలిసిన సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని ప్రయత్నిస్తాడు. ఏ ఆటగాడిని ఎలా వినియోగించుకోవాలని ఆలోచిస్తాడు. ఈ విషయంలో కొన్నేళ్లుగా మెరుగయ్యాడు. 2014 నుంచీ ఇప్పటివరకు అతడిని గమనిస్తే ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకుంటున్నాడనే విషయం మీకే తెలుస్తుంది. ఈ అంశంలో ధోనీ, రోహిత్‌ ఎంతో బాగా వ్యవహరిస్తారు' అని పార్థివ్‌ వివరించాడు.

ఏయ్ కోహ్లీ.. నీ బౌలింగ్ చితక్కొడుతా: చహల్

Story first published: Sunday, June 28, 2020, 17:50 [IST]
Other articles published on Jun 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X