Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏయ్ కోహ్లీ.. నీ బౌలింగ్ చితక్కొడుతా: చహల్

Yuzvendra Chahal with the bat vs Virat Kohli with the ball: Leg-spinner picks winner

న్యూఢిల్లీ: టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఎంత సరదా వ్యక్తో అందరికి తెలిసిందే. మైదానంలో అతను చేసే అల్లరి పనులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. అతని చిలిపి చేష్టలకు ముగ్దుడైన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏకంగా చహల్ ఓ టీమిండియా కమెడియన్ అని బిరుదే ఇచ్చాడు. మాములుగానే కోతిపనులు చేసే చహల్‌కు లాక్‌డౌన్‌తో మరింత స్వేచ్చ దొరికింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రతీ క్రికెటర్‌ను గెలుకుతూ.. వారితో చివాట్లు తింటూ.. మందలింపుకు గురవుతున్నాడు.

ఎవరెన్నీ తిట్టినా ఏ మాత్రం పట్టించుకొని ఈ స్పిన్నర్.. తన పంథానైతే మార్చుకోవడం లేదు. ఆ మధ్య విండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గేల్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా వార్నింగ్ ఇచ్చినా.. తన కోతి వేశాలు మాత్రం ఆపడం లేదు. ఇక యువరాజ్-రోహిత్ లైవ్ సెషన్‌లో దూరి సిక్సర్లసింగ్‌ను ఇరకాటంలో పడేశాడు. పోలీస్ కేసులు.. క్షమాపణలు చెప్పెంత వరకు కొనసాగిన దుమారానికి కారణమయ్యాడు. ఇక జెండర్ స్వాప్ యాప్‌తో రోహిత్‌ను అమ్మాయిగా మార్చి ట్రోల్ చేశాడు. రోహిత్‌తో మొదలైన ఈ జెండర్ స్వాప్, టీమిండియా మీదుగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పాకింది.

ఇక తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకే సవాల్ విసిరాడు. స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఓ పోల్‌కు తనదైన శైలిలో బదులిచ్చాడు. కోహ్లీ బౌలింగ్, చహల్ బ్యాటింగ్ చేస్తున్న ఫొటోలను పక్కపక్కన పెట్టి షేర్ చేసిన స్టార్ స్పోర్ట్స్..'చహల్ బ్యాటింగ్.. కోహ్లీ బౌలింగ్ యుద్దంలో ఎవరు గెలుస్తారు'అని ప్రశ్నించింది. దీనికి చహల్ 'ఇంకెవరు చహలే గెలుస్తాడు'అని సమాధానమిచ్చాడు. పరోక్షంగా కోహ్లీ బౌలింగ్‌ను చితక్కొడుతానని హెచ్చరించాడు. ఈ సమాధానానికి అభిమానులు చాలా ఫన్నీగా స్పందిస్తున్నారు. కోహ్లీ ఎక్స్‌ప్రెషన్ మీమ్స్ షేర్ చేస్తున్నారు. 'ఇవే నక్రాలు చేస్తే జట్టులో ఉండవ్ బిడ్డా'అని కోహ్లీ అన్నట్లు.. ఓరి నీ ఏషాలో అన్నట్లు ఉన్న మీమ్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Sunday, June 28, 2020, 13:53 [IST]
Other articles published on Jun 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+