న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాకు కోహ్లీ అంటే ఇష్టం.. అతనిలో నచ్చేది అదే : పాక్ మాజీ క్రికెటర్

Pakistan legend Javed Miandad reveals what he loves about Virat Kohli

కరాచీ: న్యూజిలాండ్ గడ్డపై దారుణంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఓవైపు విమర్శలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు అంతే స్థాయిలో మాజీ క్రికెటర్ల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీని వెనుకేసుకరాగా.. తాజాగా పాకిస్తాన్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ జావేద్‌ మియాందాద్‌ కూడా కోహ్లి ఆటంటే తనకు ఇష్టమని వెల్లడించాడు.

 అతని రికార్డులే చెబుతాయి..

అతని రికార్డులే చెబుతాయి..

విరాట్‌ గొప్పతనం ఏమిటో అతని ఘనతలే చెబుతాయని ఈ లెజండరీ క్రికెటర్ తెలిపాడు. ‘భారత జట్టులో అత్యుత్తమ ఆటగాడు ఎవరని నన్ను కొందరు ప్రశ్నించారు. అప్పుడు నేను కోహ్లీ పేరే చెప్పాను. నేను కొత్తగా అతని గురించి వివరించాల్సిందేమీ లేదు. అతని ప్రదర్శన, గణాంకాలు చూస్తే ఎవరైనా అంగీకరించాల్సిందే. 'అని తెలిపాడు.

ఏ ఒక్కరూ అనలేదు..

ఏ ఒక్కరూ అనలేదు..

విరాట్ పేసర్లకు భయపడతాడని, స్పిన్‌ను ఎదుర్కోలేదని ఇంతవరకు ఎవరూ అనలేదని మియాందాద్ గుర్తు చేశాడు. ‘దక్షిణాఫ్రికాలో అనూహ్యంగా స్పందించిన పిచ్‌పై కూడా అతను సెంచరీ చేశాడు. ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే భయపడతాడని, బౌన్సీ పిచ్‌లపై ఆడలేడని, స్పిన్‌ను ఎదుర్కోలేడని... ఇలా ఏ విషయంలోనైనా కోహ్లీ గురించి ఎవరూ ప్రశ్నించలేదు. అతని సత్తా ఏమిటో అందరికీ తెలుసు. కోహ్లి చూడచక్కగా ఆడతాడు. అతని బ్యాటింగ్‌ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది' అని మియాందాద్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

యువీ రక్తపు వాంతుల సెంచరీ గుర్తుందా?

రోహిత్, కోహ్లీ..

రోహిత్, కోహ్లీ..

ఇక కోహ్లీ విషయంతో తనకు బాగా నచ్చేది మైదానంలో విరాట్ వినయపూర్వకమైన తీరు, ఆటపై అతనికి ఉన్న పిచ్చి.. ఇతర క్రికెటర్లను గౌరవించే విధానమని ఈ లెజండరీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. విరాట్, రోహిత్.. బ్యాటింగ్‌ను చాలా సులువుగా మార్చేశారని కూడా మియాందాద్ తెలిపాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 124 టెస్టులు ఆడిన మియాందాద్‌ 52.57 సగటుతో 8832 పరుగులు చేసి పాక్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

Story first published: Sunday, March 22, 2020, 12:06 [IST]
Other articles published on Mar 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X