యువీ రక్తపు వాంతుల సెంచరీ గుర్తుందా?

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ పోరాటయోధుడు.! చావునైనా లెక్కచేయని ఫైటర్.! అవును ప్రపంచకప్‌లో భారత్ విజయాల బాటలో ఉన్న సమయంలోనే తనకు క్యాన్సర్ వచ్చిందనే సంగతి యువరాజ్‌కు తెలుసు. కానీ తాను చనిపోయినా సరే, టోర్నీ మధ్యలో మాత్రం వెళ్లిపోనని అతను గట్టిగా చెప్పుకున్నాడు. మరణించాల్సి వస్తే మైదానంలోనే చనిపోతానని నిర్ణయించుకుని టోర్నీ మొత్తం ఆడాడు. కేవలం ఆడడం మాత్రమే కాదు... నాలుగు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' లు, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'తో భారత్ 28 ఏళ్ల కలను సాకారం చేశాడు.!

9 ఏళ్ల క్రితం ఇదే రోజు..
అయితే సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే రోజు (మార్చి 20) ప్రపంచకప్ టోర్నీలోనే యువరాజ్ ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు, మూడు సార్లు అతను గ్రౌండ్‌లోనే వాంతి చేసుకున్నాడు. రక్తపు వాంతులు చేసుకున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. ఇంత జరిగినా అతను రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగేందుకు ఒప్పుకోలేదు.

విరాట్‌తో కలిసి..
51/2 రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును అప్పటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి 122 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. కోహ్లీ(59) ఔటైనా తన అద్భుత ఆటతీరుతో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 113 పరుగులతో జట్టుకు 268 పరుగుల పోరాడే స్కోర్‌ను అందించాడు. అనంతరం బౌలింగ్‌లో డెవన్ థామన్, ఆండ్రూ రస్సెల్‌ను ఔట్ చేసి భారత్ 80 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చచ్చినా పర్లేదు కానీ వరల్డ్ కప్ గెలవనివ్వూ..
ఈ మ్యాచ్‌పై 2014లో ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చెన్నైలోని వేడి వల్ల వాంతులవుతున్నాయనుకున్నా. ప్రపంచకప్ సెంచరీ సాధించాలని ఎప్పుడూ అనుకునే వాడిని. కానీ 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల ఆ అవకాశం రాలేదు. ఏం జరిగినా.. నేను చనిపోయినా సరే కానీ, ప్రపంచ కప్ మాత్రం గెలవనివ్వమని ఆ దేవుడిని ప్రార్థించాను'అని యువీ చెప్పుకొచ్చాడు.

చెరపలేని చరిత్ర..... చెరిగిపోని యాత్ర..
యావత్ క్రికెట్ ప్రపంచం మరిచిపోలేని ఈ అద్భుత పోరాటాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా నెమరవేసుకుంటున్నారు. 2011 ప్రపంచకప్‌లో 362 పరుగులు, 15 వికెట్లతో యువీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న విషయం తెలిసిందే. అనంతరం కేన్సర్ కి చికిత్స చేయించుకొని జట్టులోకి వచ్చిన యువీ కెరీర్ అంత సాఫీగా సాగలేదు. దీంతో గతేడాది ఈ సిక్సర్ల సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఏదీ ఏమైనా యువీ ..భారత క్రికెట్ లో నీది చెరపలేని చరిత్ర..... చెరిగిపోని యాత్ర.....మరెవరిని ఊహించలేని పాత్ర..!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications