న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

New Zealand vs West Indies: క్యాచ్ చేజార్చిన ఫీల్డర్.. అసభ్య పదజాలంతో నోరుపారేసుకున్న బౌలర్ (వీడియో)

New Zealand vs West Indies: Shannon Gabriel shouts after Darren Bravo drops an easy catch at slip

హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై వెస్టిండీస్ జట్టు వైఫల్యం కొనసాగుతుంది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన ఆ జట్టు.. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కూడా తొలి మ్యాచ్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. తాజాగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కూడా విండీస్ వీరుల ఆటతీరు మారలేదు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఆ జట్టు చెత్త ఫీల్డింగ్‌తో అవకాశాలను చేజార్చుకుంది. ప్రత్యర్థికి పదే పదే అవకాశం ఇచ్చి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది.

విండీస్ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యాలను అందిపుచ్చుకున్న కివీస్ బ్యాట్స్‌మన్ హెన్రీ నికోలస్( 207 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 117 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కాడు. దాంతో తొలి రోజు ఆటలో కివీస్ పై చేయి సాధించింది. అయితే తమ ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యంతో సహనం కోల్పోయిన వెస్టిండీస్ బౌలర్ షానెన్ గాబ్రియెల్ సహచర ఆటగాడిపై నోరుపారేసుకున్నాడు.

‘ఫ***’అంటూ ఫైర్..

గాబ్రియెల్ వేసిన 41వ ఓవర్‌లో బంతి హెన్రీ నికోలస్ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని సెకండ్ స్లిప్ వైపు దూసుకెళ్లింది. అయితే చేతులకు వచ్చిన సునాయస క్యాచ్‌ను డారెన్ బ్రావో నేలపాలు చేశాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన గాబ్రియె ఫ** అంటూ నోరుపారేసుకున్నాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో రికార్డవ్వడంతో నెట్టింట వైరల్ అయింది. అప్పటికి నికోలస్ 47 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అతను ఇచ్చిన మూడు క్యాచ్‌లను విండీస్ ఆటగాళ్లు నేలపాలు చేయడం గమానార్హం. ఆ క్యాచ్‌లు కనుక పట్టుంటే తొలి రోజు విండీస్ పై చేయి సాధించేది.

గాబ్రియెల్ తీన్మార్..

గాబ్రియెల్ తీన్మార్..

విండీస్ బౌలర్లలో గాబ్రియెల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ టామ్ బ్లండెల్(14)ను వికెట్ ముందు బోల్తా కొట్టించి విండీస్‌కు శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత విల్ యంగ్(43), రాస్ టేలర్(9)లను ఔట్ చేసి దెబ్బ తీశాడు. కానీ నికోలస్ ఇచ్చిన క్యాచ్‌లను విండీస్ ఆటగాళ్లు నేలపాలు చేయడంతో కివీస్ భారీ స్కోర్ చేయగలిగింది.

న్యూజిలాండ్ 294/6

న్యూజిలాండ్ 294/6

హెన్రీ నికోలస్ సెంచరీకి తోడు విల్ యంగ్(43), డారిల్ మిచెల్(42) రాణించడంతో ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 84 ఓవర్లలో 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. క్రీజులో నికోలస్‌తో పాటు కైల్ జెమీసన్(1) ఉన్నారు. విండీస్ బౌలర్లలో గాబ్రియెల్‌తో మూడు వికెట్లు తీయగా.. చెమర్ హోల్డర్ రెండు, అల్జారీ జోసెఫ్ ఓ వికెట్ తీశారు.

కోహ్లీ బాటలోనే కేన్..

కోహ్లీ బాటలోనే కేన్..

ఇక ఫస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కేన్ విలియమ్సన్ రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే కేన్ పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. కేన్ విలియమ్సన్‌ సతీమణి సారా రహీమ్‌ కొద్దిరోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ క్రమంలోనే అతను విండీస్‌తో సెకండ్ టెస్ట్‌కు దూరమవ్వగా.. అతని స్థానంలో విల్‌ యంగ్‌ బరిలోకి దిగాడు. ఇక విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్ ముగిసిన అనంతరం భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. అతని సతీమణి అనుష్క శర్మ జనవరిలో ఓ బిడ్డకు జన్మనివ్వనుంది.

India vs Australia: ఫస్ట్ టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు గట్టిషాక్.. ఆ జట్టు ఆల్‌రౌండర్ మూతి పగలకొట్టిన బుమ్రా!

Story first published: Friday, December 11, 2020, 16:56 [IST]
Other articles published on Dec 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X