India vs Australia: ఫస్ట్ టెస్ట్‌కు ముందు ఆసీస్‌కు గట్టిషాక్.. ఆ జట్టు ఆల్‌రౌండర్ మూతి పగలకొట్టిన బుమ్రా!

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వీడటం లేదు. ఇప్పటికే గజ్జ గాయంతో ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫస్ట్ టెస్ట్ ఆడటంపై అనుమానాలు నెలకొనగా.. తాజాగా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే డేనైట్ టెస్ట్ కోసం సన్నాహకంగా ఆస్ట్రేలియా-ఏతో భారత జట్టు మూడు రోజుల వామప్ మ్యాచ్ ఆడతుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కొట్టిన షాట్ నేరుగా గ్రీన్ ముఖానికి తగలడంతో మైదానంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఫిజియోలు బయటకు తీసుకెళ్లారు.

ఇంతకేం జరిగిందంటే..
ఈ వామప్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పృథ్వీ షా(40), శుభ్‌మన్ గిల్(43) మినహా అంతా విఫలమయ్యారు. 123 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా(57 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్‌లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. మహ్మద్ సిరాజ్(34 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 22)తో కలిసి ఆఖరి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి నెలకొల్పి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. అయితే గ్రీన్ తన 7వ ఓవర్‌లో వేసిన ఓ బంతిని బుమ్రా స్ట్రైట్‌గా బౌలర్ దిశగా కొట్టాడు. అయితే అది గ్రీన్ వైపు దూసుకురాగా అతను క్యాచ్ పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది మిస్సై గ్రీన్ ముఖానికి బలంగా తాకింది. ఆ దెబ్బకు కుప్పకూలిన గ్రీన్ ఫిజియోల సాయంతో మైదానం వీడాడు.
ఆసీస్.. అయోమయం..
బంతి తలకు తగలడంతో ఈ ఆల్‌రౌండర్ కంకషన్ తీసుకోవడం అనివార్యమైంది. ఫెషియల్ ఫ్రాక్చర్ ఏమైనా అయ్యిందా అని పరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయం తీవ్రమైతే ఆసీస్‌కు కష్టాలు తప్పవు. గ్రీన్ ఇప్పటికే ఫస్ట్ వామప్ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లోనూ వికెట్లు తీశాడు. అలాంటి ఆల్‌రౌండర్ దూరమైతే ఆసీస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. ఇప్పటికే డేవిడ్ వార్నర్ దూరమవ్వడం, జో బర్న్స్ ఇబ్బంది పడుతుండటం.. ఇప్పుడు గ్రీన్ కూడా గాయపడటంతో ఆసీస్ టీమ్‌మేనేజ్‌మెంట్‌కు ఏం చేయాలో కూడా అర్థమవడం లేదు. అయితే కామెరూన్ గ్రీన్ గాయంపై మరికొద్దిసేపట్లోనే స్పష్టత రానుంది.

భారత్ 194 ఆలౌట్..
ఈ వామప్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమవ్వగా.. రహానే సారథ్యంలోని భారత జట్టు బరిలోకి దిగింది. అయితే టాపార్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. మయాంక్ అగర్వాల్(2), హనుమ విహారీ(15), అజింక్యా రహానే(4), రిషభ్ పంత్(5), వృద్దిమాన్ సాహా(0) దారుణంగా విఫలమయ్యారు. బుమ్రా ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ 48.3 ఓవర్లలో 194 పరుగులుకు ఆలౌటైంది. సీన్ అబాట్, జాక్ విల్డెర్‌ముత్ మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. మిచెల్ స్వెప్సన్, కామెరూన్ గ్రీన్, సుతర్లాండ్, హరీ కాన్వే తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications