న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌కి ముందు జనగణమన: బీసీసీఐకి నెస్ వాడియా లేఖ

IPL 2020 : KXIP's Proposal To BCCI, About The National Anthem In IPL ! || Oneindia Telugu
National anthem should be played before start of every IPL game: KXIPs proposal to BCCI

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియిర్ లీగ్(ఐపీఎల్)లో ప్రతి మ్యాచ్‌కి ముందు జాతీయగీతం పాడించాలని కోరుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా బీసీసీఐకి లేఖ రాశారు. ఐపీఎల్ 2020 సీజన్ నుంచే దీనిని అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఐపీఎల్‌ ఆరంభ వేడుకల రద్దు చేయడం సరైన చర్యగానే ఆయన అభివర్ణించారు.

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ "ఐపీఎల్ ఆరంభ వేడుకలు రద్దు మంచి నిర్ణయం. ఆరంభ వేడుకలు అవసరం లేదు. ఐపీఎల్ ఆరంభ వేడుకల అవసరం, దాని విలువ గురించి ఆలోచిస్తుంటాను. బీసీసీఐ మరో పని చేయాలి. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ ముందు జాతీయగీతం ఆలపించేలా చేయించాలి" అని అన్నారు.

<strong>2nd T20I: రోహిత్ శర్మ అరుదైన ఘనత, ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా</strong>2nd T20I: రోహిత్ శర్మ అరుదైన ఘనత, ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

బీసీసీఐకి లేఖ రాశాను

బీసీసీఐకి లేఖ రాశాను

"దీనిపై గతంలో నేను బీసీసీఐకి లేఖ రాశాను. ఇప్పుడు సౌరవ్‌ గంగూలీ(బీసీసీఐ అధ్యక్షుడు)కి రాశాను. సినిమా హాళ్లలో ఇప్పటికీ జాతీయగీతం ప్రదర్శిస్తున్నారనే అనుకుంటున్నా. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌, ప్రొ కబడ్డీ లీగ్‌లో మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాన్ని పాడతారు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంతు వచ్చింది" అని నెస్ వాడియా అన్నారు.

25 ఏళ్లు దేశానికి ఆడా!: కెప్టెన్సీ తొలగింపు, పాక్‌తో డేవిస్ కప్‌ పోరుపై మహేశ్ భూపతి ఆవేదన

జాతీయ గీతాన్ని చూసి మనం గర్వించాలి

జాతీయ గీతాన్ని చూసి మనం గర్వించాలి

"మన జాతీయ గీతాన్ని చూసి మనం గర్వించాలి. ఇదొక అద్భుతమైన జాతీయ గీతం మరియు అద్భుతమైన లీగ్. NBA లీగ్‌లో కూడా ప్రతి ఆటకు ముందు జాతీయ గీతం ఆలపిస్తారు" అని వాడియా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంలో విదేశాల్లో ఐపీఎల్‌ జట్ల స్నేహపూర్వక మ్యాచ్‌లపై కూడా నెస్‌వాడియా స్పందించారు.

ఐపీఎల్‌ అనేది భారతదేశ లీగ్‌

ఐపీఎల్‌ అనేది భారతదేశ లీగ్‌

"ఐపీఎల్‌ అనేది భారతదేశ లీగ్‌. విదేశాలకు దానిని విస్తరిస్తే మంచిదే. దీని ద్వారా బీసీసీఐకీ ఎంతో లాభం చేకూరుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్‌ లీగ్‌లను పరిశీలిస్తే సీజన్‌కు ముందు వారు విదేశాల్లో స్నేహపూర్వక మ్యాచ్‌లు ఆడతారు. దీనివల్ల చూసేవారి సంఖ్య, ఐపీఎల్‌ విలువ పెరుగుతుంది. దీనిని బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటే మంచిది" అని నెస్ వాడియా అన్నారు.

PHOTOS: మరీ ఇంత హాట్‌గానా! కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న అనుష్క

ఇతర క్రీడా లీగ్‌లను అనుకరించడం

ఇతర క్రీడా లీగ్‌లను అనుకరించడం

"ప్రపంచంలోని నంబర్ వన్ క్రికెట్ లీగ్ ఇతర క్రీడా లీగ్‌లు చేసిన వాటిని అనుకరించడం ఆనందంగా ఉంటుంది. ఎన్‌బీఏ సైతం భారత్‌, చైనాకు వచ్చాయి. ఇక్కడ ఉన్న సమస్యల్లా ప్రణాళిక రూపొందించడం, అందుబాటులో ఆటగాళ్లను ఉంచుకోవడం. అక్కడే బీసీసీఐ పాత్ర అవసరం"అని నెస్‌ వాడియా అన్నారు.

Story first published: Thursday, November 7, 2019, 19:26 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X