PHOTOS: మరీ ఇంత హాట్‌గానా! కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న అనుష్క

హైదరాబాద్: వోగ్ ఇండియా 2019 ఎడిషన్ కవర్ పేజిపై బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇచ్చిన ఫోజోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017, డిసెంబర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన అనుష్క శర్మ ఆ తర్వాత కూడా తనలో హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది.
బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న అనుష్క శర్మ... విలక్షమైన పాత్రల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. చివరగా అనుష్క శర్మ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో కలిసి "జీరో" సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాకి సైన్ చేయలేదు.
వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు అనుష్క ఫోజులు
అయితే, బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన పీకే, సుల్తాన్, సంజు లాంటి సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. వోగ్ ఇండియా మ్యాగజైన్‌కు ఆమె ఇచ్చిన తాజా ఫోజోలు యువతను తనవైపు తిప్పుకునేలా చేశాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ఇనిస్టాలో అభిమానులతో పంచుకుంది.
కోహ్లీతో కలిసి భూటాన్‌లో
కాగా, ప్రస్తుతం అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి భూటాన్‌లో పర్యటిస్తోంది. ఇద్దరు కూడా వారికి ఎక్కువగా ఇష్టపడేదానినే చేస్తున్నారు. అదేంటంటే జంతువులతో సరదాగా గడపడం, ఆ దేశ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడం. భూటాన్ పర్యటనలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ పర్యటనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
భూటాన్‌లోని ఓ సరస్సు వద్ద
ఆ ఫోటోల్లో భూటాన్‌లోని ఓ సరస్సు మరియు పర్వతాల సుందరమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అనుష్క మరియు విరాట్ కోహ్లీ ఒకరినినొకరు చేతులు పట్టుకొని కనిపించారు. ఈ ఫోటోని తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ "ప్రకృతి సౌందర్యానికి దగ్గరగా రావడానికి మీకు అవకాశం వచ్చినప్పుడు, ఆలోచనలు ఆగిపోతాయి. ఆ మీరు క్షణంతో ఒకటవుతారు. ఆ సమయంలోనే మీరు దైవిక శక్తితో కలిసిపోతారు. సో గ్రేట్‌పుల్" అంటూ కామెంట్ పెట్టాడు.
View this post on InstagramA post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
View this post on InstagramDo NOT stress . My right side hasn't caught fire . @vogueindia
A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications