న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

25 ఏళ్లు దేశానికి ఆడా!: కెప్టెన్సీ తొలగింపు, పాక్‌తో డేవిస్ కప్‌ పోరుపై మహేశ్ భూపతి ఆవేదన

Played for country for 25 years: Mahesh Bhupathi unhappy with AITA after being stripped of Davis Cup captaincy

హైదరాబాద్: 25 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి 12 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన తనని... జాతీయ జట్టు బాధ్యతలు నిర్వర్తించనందుకు విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంపై మహేశ్‌ భూపతి అభ్యంతరం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌తో డేవిస్‌ కప్‌ మ్యాచ్‌కు తన స్థానంలో రోహిత్‌ రాజ్‌పాల్‌ను భారత జట్టు నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

భారత్-పాక్ జట్ల మధ్య జరగాల్సిన డేవిస్ కప్ పోరుని తటస్థ వేదికకు మారుస్తున్నట్టు అంతర్జాతీయ టెన్నిస్‌ సంఘం (ఐటీఎఫ్‌) సోమవారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో తలపడే భారత డేవిస్‌కప్‌ జట్టుకు మాజీ ఆటగాడు, జాతీయ టెన్నిస్‌ సమాఖ్య సెలక్షన్‌ ప్యానెల్‌ ఛైర్మన్‌ రోహిత్‌ రాజ్‌పాల్‌ నాన్‌ప్లేయింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది.

PHOTOS: మరీ ఇంత హాట్‌గానా! కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న అనుష్కPHOTOS: మరీ ఇంత హాట్‌గానా! కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోన్న అనుష్క

కెప్టెన్‌ను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న విషయంపై ఆలోచిస్తే.... వాస్తవానికి భారత్-పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదికకు మార్చడానికి ముందు భారత జట్టును పాక్‌కు పంపేందుకు ఏఐటీఏ సిద్ధమైంది. దీనికి కొందరు ఆటగాళ్లతో పాటు నాన్‌-ప్లేయింగ్‌ కెప్టెన్‌ భూపతి అంగీకరించకపోవడంతో అతడి స్థానంలో వేరొకరిని నియమించాలన్న నిర్ణయానికి ఏఐటీఏ వచ్చింది.

ఆ తర్వాత భారత ఒత్తిడికి తలొగ్గి తటస్థ వేదికలో మ్యాచ్‌లు నిర్వహించడానికి ఐటీఎఫ్‌ అంగీకరించినప్పటికీ ఇప్పుడు కెప్టెన్‌ను మార్చడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డేవిస్‌ కప్‌ పోరుకు కెప్టెన్ మార్పుపై సీనియర్ ఆటగాడు రోహన్‌ బోపన్న మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కెప్టెన్ మార్పుపై మహేశ్ భూపతి స్పందించాడు.

మహేశ్ భూపతి మాట్లాడుతూ "'25 ఏళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించి 12 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నేను జాతీయ జట్టు బాధ్యతలు నిర్వర్తించనన్నందుకు విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడం ఆమోదయోగ్యం కాదు. నన్ను కెప్టెన్‌గా తొలగించలేరు. కొత్త కెప్టెన్ కోసం ఇదే సరైన సమయం అని వారు చెప్పగలరు. కానీ నేను జాతీయ విధిని తిరస్కరించానని ఎవరూ చెప్పలేరు" అని అన్నాడు.

"పాక్‌లో పర్యటించడం మంచిది కాదని ఐటీఎఫ్‌ కూడా ధ్రువీకరించింది. దీనిని నేను నిజమేనని నమ్మాను. దీనికి నన్ను, ఆటగాళ్లను శిక్షిస్తామంటే ఎలా? అది పని చేయదు" అని మహేశ్ భూపతి చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన పట్ల ఏఐటీఏ అమర్యాదకరంగా వ్యవహరించిందని మహేశ్ భూపతి వాపోయాడు.

"పాక్‌కు వెళ్లేందుకు నేను అసౌకర్యంగా ఉన్నందుకు నా స్థానంలో రోహిత్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఏఐటీఏ అధ్యక్షుడు ఛటర్జీ ఫోన్‌ చేసి చెప్పారు. గతంలో పాక్‌కు వెళ్లాను. అయితే, ఈసారి అభ్యంతరం వ్యక్తం చేసిన మాట నిజమే. ఆటగాళ్ల అభ్యంతరాల్ని విన్న ఐటీఎఫ్‌ తటస్థ వేదికలో మ్యాచ్‌ నిర్వహించేందుకు అనుమతించింది" అని భూపతి తెలిపాడు.

ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు: ఒకరి చేతిని మరొకరు, భూటాన్ ట్రిప్‌లో విరుష్క జోడీప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు: ఒకరి చేతిని మరొకరు, భూటాన్ ట్రిప్‌లో విరుష్క జోడీ

"నేను వ్యక్తిగతంగా భారత్‌లో కిందిస్థాయి నుంచి ఈ క్రీడతో పాలుపంచుకున్నాను. అది మిట్టల్ ఛాంపియన్స్ ట్రస్ట్ లేదా JSW యొక్క IIS కావచ్చు. నేను కర్మన్ కౌర్ (తండ్రి), సుమిత్ (నాగల్) కోసం డబ్బును సేకరించాను. 'ఈ కుర్రాళ్ళు (AITA) నన్ను కోరుకోకపోతే, నేను ఆడొద్దని చెప్పగలను, కానీ నేను జాతీయ జట్టుకు బాధ్యతలు నిర్వర్తించలేదని చెప్పడం తప్పు. అది ఆమోదయోగ్యం కాదు" అని మహేశ్ భూపతి వాపోయాడు.

"నన్ను తొలగించడం గురించి ఆందోళన చెందడం లేదు. నేను ఉద్యోగానికి సరైన వ్యక్తి కాకపోతే, అలానే ఉండండి. కానీ నా పేరుపై బురద చల్లే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే టెన్నిస్‌లో ఈ స్థాయికి వచ్చేందుకు నా జీవితమంతా పనిచేశాను. నేను అందుబాటులో లేనని చెప్పలేదు, ఎవరూ పాకిస్తాన్‌కు వెళ్లడం సౌకర్యంగా లేదని మాత్రమే చెప్పాను" అని అన్నాడు.

బర్త్ డే రోజు అతియా శెట్టితో కేఎల్ రాహుల్.. ప్రేమాయ‌ణం నిజమేనా?!!బర్త్ డే రోజు అతియా శెట్టితో కేఎల్ రాహుల్.. ప్రేమాయ‌ణం నిజమేనా?!!

"ఇటలీ టై తర్వాత నా పదవీకాలం ముగిస్తే, వారు నన్ను సమావేశాలకు ఎందుకు పిలిచారు. పాకిస్తాన్ టైకు నన్ను కెప్టెన్‌గా ఎందుకు ప్రకటించారు. ఫ్లైట్ తీసుకోకుండా పాకిస్థాన్‌కు వెళ్లడానికి జెట్ ఏర్పాటు చేయమని AITAని ఒప్పించాను. ఈ రోజు నా పదం ముగిసిందని మీకు చెప్పడం వారికి సౌకర్యంగా ఉంటుంది. ఇప్పటికీ నేను పాక్‌తో టైకి సిద్ధంగానే ఉన్నా. కాబట్టి ఇప్పటికీ నేనే కెప్టెన్‌ అని అనుకుంటున్నా" అని భూపతి తెలిపాడు.

తాను పాకిస్థాన్‌కు వెళ్లను అన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఏఐటీఏ) చెబుతోందని, కానీ పాక్‌ నుంచి తటస్థ వేదికకు మ్యాచ్‌ను మారుస్తున్న నేపథ్యంలో ఆ పోరుకు తాను సిద్ధంగా ఉన్నానని, కాబట్టి ఇప్పటికీ తానే కెప్టెన్‌ అనుకుంటున్నానని భూపతి అన్నాడు.

Story first published: Thursday, November 7, 2019, 16:26 [IST]
Other articles published on Nov 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X