న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం మురళీ విజయ్.. అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి!

Murali Vijay given wrong LBW decision by umpire in IPL 2020
IPL 2020,CSK vs MI : Ambati Rayudu & Faf Du Plessis Help Chennai Super Kings Win Over Mumbai Indians

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌ ఫస్ట్ మ్యాచ్‌లోనే అంపైర్ల అలసత్వం బయటపడింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ మురళీ విజయ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో చెన్నైకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికే ఆ జట్టు ఓపెనర్ షేన్ వాట్సన్ (4)వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం పాటిన్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌ ఆఖరి బంతికి మురళీ విజయ్(1) కూడా ఎల్బీగా వెనుదిరిగాడు.

రిప్లేలో క్లారిటీ..

రిప్లేలో క్లారిటీ..

అయితే టీవీ రీప్లేలో బంతి వికెట్‌కు తాకలేదని స్పష్టమైంది. కానీ మురళీ విజయ్ మాత్రం రివ్యూ తీసుకోలేదు. అదే ఓవర్ నాలుగో బంతికే పాటిన్సన్ ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్ చేయగా అంపైర్ నిరాకరించాడు. దీంతో మరోసారి అప్పీల్ చేయడంతో అయోమయానికి గురైన అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. అయితే నాన్ స్ట్రైకర్‌గా ఉన్న ఫాఫ్ డూప్లెసిస్ రివ్యూ తీసుకోవాలని సూచించినా విజయ్ పట్టించుకోలేదు. ఇక అంపైర్ నిర్ణయంపై కామెంటేటర్లు కూడా సందేహం వ్యక్తం చేశారు. ఏదేమైనా అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఎంతో ఆశగా బరిలోకి దిగిన మురళీ విజయ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.

అంపైర్ నిద్రపోతున్నావా..?

ఇక అంపైర్ తప్పుడు నిర్ణయంపై చెన్నై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైరింగ్ చేయకుండా నిద్రపోతున్నారా? అని మండిపడుతున్నారు. ఓ తప్పుడు నిర్ణయం వల్ల మ్యాచ్ ఫలితమే తారుమారయ్యే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. అలాగే మురళీ విజయ్‌పై కూడా విమర్శలు కురిపిస్తున్నారు. మ్యాచ్‌లో విజయ్ నిద్రమబ్బులో ఉన్నట్లు కనిపించాడని, ఫీల్డింగ్‌లో అలసత్వం.. బ్యాటింగ్‌లో తడబడడ్డాడని ట్రోల్ చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌కు తప్పించాలని, రివ్యూ తీసుకోమని డూప్లెసిస్ చెప్పినా వినిపించుకోకపోవడం అతని అలసత్వాన్ని తెలియజేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

రాయుడు సూపర్ ఫిఫ్టీ..

ఇక 6 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సీఎస్‌కేను తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు, ఫాఫ్ డూప్లెసిస్ గట్టెక్కించారు. ప్రారంభంలో మొత్తం డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ..నిదానంగా స్కోరు బోర్డు వేగం పెంచింది. బుమ్రా వేసిన నోబాల్‌ను ఫోర్ కొట్టిన రాయుడు.. ఫ్రీహిట్‌ను సిక్స్ కొట్టి గాడిలో పడ్డాడు. అనంతరం రాహుల్ చాహర్ వేసిన 10వ ఓవర్ 3, 4 బంతులను వరుసగా బౌండరీలు తరలించాడు.

ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన రాయుడు.. బుమ్రా వేసిన 12 ఓవర్ 5వ బంతిని స్ట్రైట్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు ఔటైనా డూప్లెసిస్ అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. అతనికి తోడుగా సామ్ కరన్ మెరుపులు మెరిపించడంతో చెన్నై సునాయస విజయాన్నందుకుంది.

ముంబై 162/9

ముంబై 162/9

అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు చెలరేగడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆ జట్టులో సౌరభ్ తివారీ(31 బంతుల్లో 3 ఫోర్లు, 1 సి‌క్స్‌తో 42), క్వింటన్ డికాక్(20 బంతుల్లో 5 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ శర్మ(12), హార్దిక్ పాండ్యా(14), కృనాల్ పాండ్యా(3), కీరన్ పొలార్డ్(18) దారుణంగా విఫలమయ్యారు. ప్రత్యర్థి బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా.. చాహర్, జేడేజా రెండేసి వికెట్ల పడగొట్టారు. చావ్లా, సామ కరన్ చెరొక వికెట్ లభించింది. ఫాఫ్ డూప్లెసిస్ సూపర్ డూపర్ క్యాచ్‌లతో ముంబై స్కోర్‌కు అడ్డుకట్ట వేసాడు. అనంతరం చెన్నై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి 5 వికెట్లతో గెలుపొందింది.

MI vs CSK match 1: వారెవ్వా డూప్లెసిస్ వాటే ఫీల్డింగ్.. నీ రెండు క్యాచ్‌లతో కళ్లు చెదిరిపాయే!

Story first published: Saturday, September 19, 2020, 23:57 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X