న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs CSK match 1: వారెవ్వా డూప్లెసిస్ వాటే ఫీల్డింగ్.. నీ రెండు క్యాచ్‌లతో కళ్లు చెదిరిపాయే!

MI vs CSK match 1: Faf du Plessis brilliance helps CSK get rid of Saurabh Tiwary, Hardik Pandya

అబుదాబి: అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ తొలి రోజే అందిస్తుంది. అదిరే సిక్స్‌లు.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫస్ట్ మ్యాచ్‌లోనే అభిమానులకు పసందైన విందు లభించింది. ఇన్నాళ్లు క్రికెట్ మ్యాచ్‌ల్లేక తీవ్ర ఆకలితో ఉన్న అభిమానులకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తర ఆటతీరుతో కడుపు నింపుతోంది.

టాస్ ఓడి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ దిగగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అద్భుత షాట్లతో అలరించారు. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్‌మన్ సౌరబ్ తివారీ భారీ షాట్‌తో ఈ సీజన్ సిక్సర్ల ఖాతా తెరవగా.. చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ పియూష్ చావ్లా తొలి వికెట్ అందుకున్నాడు.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఫాఫ్ డూప్లెస్ పట్టిన రెండు క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్ అయ్యాయి. దాదాపు సిక్స్‌గా వెళ్లిన రెండు బంతులను డూప్లెసిస్ సూపర్ ఫీల్డింగ్‌తో అందుకున్నాడు. రవీంద్ర జడేజా వేసిన 15వ ఓవర్ తొలి బంతిని సౌరభ్ తివారీ( 42)భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డూప్లెసిస్ గాల్లోకి అమాంతం ఎగిరి అందుకున్నాడు. అనంతరం సమన్వయం కోల్పోతున్నట్లు భావించి బంతిని గాల్లోకి ఎగిరేసి వచ్చి అందుకున్నాడు.

దీంతో సౌరభ్ తివారీ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక ఇదే ఓవర్ ఐదో బంతిని హార్దిక్ పాండ్యా లాంగాఫ్ దిశగా భారీ షాట్ ఆడగా ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తు డూప్లెసిస్ మళ్లీ అద్భుతంగా గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. దీంతో హార్దిక్(14) భారంగా పెవిలియన్ చేరాడు. ఈ సూపర్ ఫీల్డింగ్‌తో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేసింది.

భౌతిక దూరం రూల్ నేపథ్యంలో ఫస్ట్ స్లిప్ పెట్టుకోవచ్చా..? జోక్ చేసిన ధోనీ!భౌతిక దూరం రూల్ నేపథ్యంలో ఫస్ట్ స్లిప్ పెట్టుకోవచ్చా..? జోక్ చేసిన ధోనీ!

Story first published: Saturday, September 19, 2020, 21:47 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X