న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంత ఘోరంగా అవమానిస్తారా? కేకేఆర్‌పై మనోజ్ తివారీ ఫైర్

Manoj Tiwary after KKR didn’t tag him and Shakib Al Hasan in IPL 2012 throwback post

కోల్‌కతా: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు (2012, మే 27) కోల్‌కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్‌ను తొలిసారి ముద్దాడింది.గౌతం గంభీర్ సారథ్యంలోని నాటి కేకేఆర్ జట్టు సమష్టి ప్రదర్శనతో నాలుగేళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత టైటిల్ ఫైట్‌లో నెగ్గి చాంపియన్‌గా నిలిచింది.

మధురానుభూతులు..

ఇక ఈ మధుర క్షణాన్ని గుర్తు చేసుకుంటూ కేకేఆర్ ఫ్రాంచైజీ తన అధికారిక ట్విటర్ వేదికగా ప్రతీ నైటరైడర్స్ మనసును తాకిన రాత్రి అంటూ ట్వీట్ చేసింది. తొలిసారి అందుకున్న కప్ ఎన్నో భావోద్వేగాలు, మరెన్నో మధురానుభూతులను మిగిల్చింది. మరీ మీ జ్ఞాపకాలేంటి? అని ప్రశ్నిస్తూ... మన్వీందర్ బిస్లా, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్, సునీల్ నరైన్, బ్రెట్‌లీలను ట్యాగ్ చేసింది.

కరోనా పోరులో మహిళా పుట్‌బాలర్.. ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా!

మమ్మల్ని ఎందుకు ట్యాగ్ చేయలేదు..

అయితే ఈ ట్వీట్‌పై ఆ జట్టుకే చెందిన మనోజ్ తివారీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సీజన్‌లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తనను, షకీబ్ అల్ హసన్‌‌ను ట్యాగ్ చేయకపోవడం తమను అవమానించినట్లే అవుతుందన్నా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘అందరితో పాటు.. ఆ రోజుతో నాకు ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ, ఈ ట్వీట్‌లో నన్ను, షకీబ్‌ని ట్యాగ్ చేయకపోవడం నిజంగా నాకు అవమానకరం. మా పేర్లను మీరు మరిచిపోవడం నాకు బాధను కలిగించింది'' అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశాడు.

నువ్వే మా హీరో..

నువ్వే మా హీరో..

అయితే దీనిపై వెంటనే స్పందించిన కేకేఆర్.. వీళ్లిద్దరినీ ఆ ట్వీట్‌లో ట్యాగ్ చేసింది. ‘‌నో వే మనోజ్.. నీలాంటి ప్రత్యేకమైన ఆటగాడిని ట్యాగ్ చేయడం మర్చిపోం. 2012 విజయంలో నువ్వే మా హీరోవి.'అని కేకేఆర్ బదులిచ్చింది. ఇక ఆ సీజన్‌లో మనోజ్ తివారీ 15 ఇన్నింగ్స్‌ల్లో 260 పరుగులతో ఆకట్టుకున్నాడు. షకీబ్ అల్ హసన్ 12 వికెట్లతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అనుష్కశర్మకు విరాట్ విడాకులివ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

కోల్‌కతా అద్భుత విజయం..

కోల్‌కతా అద్భుత విజయం..

నాటి ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతా 5 వికెట్లు కోల్పోయి 2 బంతులు మిగిలుండగానే 192 పరుగులతో విజయాన్నందుకుంది. చివరి ఓవర్లలో కోల్‌కతా విజయానికి 9 పరగులు చేయాల్సి ఉండగా మనోజ్ తివారీ వరుస ఫోర్లతో మ్యాచ్‌ను పూర్తి చేశాడు. అనంతరం మరో రెండేళ్లకే 2014లో గంభీర్ సారథ్యంలోనే కేకేఆర్ మరో టైటిల్ అందుకుంది. అప్పటి నుంచి ఇంకో టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం జరిగిన వేలంలో మనోజ్ తివారీ ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. రూ.50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చినా ఎవరూ ఆసక్తికనబర్చలేదు.

Story first published: Wednesday, May 27, 2020, 20:04 [IST]
Other articles published on May 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X