న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్కశర్మకు విరాట్ విడాకులివ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Nandkishor Gurjar Says Virat Kohli should divorce Anushka Sharma for making Pataal Lok

లక్నో: దేశ ద్రోహి అయిన బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మకు దేశ భక్తుడైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విడాకులివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే నంద్‌కిశోర్ గుర్జార్ అన్నారు. పాతాళ్ లోక్ సినిమా నిర్మించినందుకుగాను అనుష్క శర్మ‌పై దేశద్రోహం కింద కేసు పెట్టిన ఈ బీజేపీ ఎమ్మెల్యే.. విరాట్ విడాకులిచ్చి దేశ ద్రోహ చర్యలకు పాల్పడేవారికి గట్టి వార్నింగ్ ఇవ్వాలని సూచించారు.

మత విద్వేశాలు రెచ్చగొట్టేలా..

మత విద్వేశాలు రెచ్చగొట్టేలా..

అనుష్క నిర్మించిన ‘పాతాళ్ లోక్' అనే వెబ్‌సిరీస్‌లో తనతో కలిపి.. బీజేపీ నేతల ఫొటోలను ఉపయోగించి తమను అవమానించారని, అంతేకాకుండా పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఉత్తరప్రదేశ్‌లోని లోనీ టౌన్ ఎమ్మెల్యే అయిన గుర్జార్ ఆరోపించారు. ఈ వెబ్‌సిరీస్ నిర్మించిన అనుష్కపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టాలని, ఈ వెబ్‌సిరీస్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు.

ధోనీలో జట్టును గెలిపించే ఉద్దేశమే లేదు.. ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు: బెన్‌స్టోక్స్‌

 బీజేపీ పరువు తీసే ప్రయత్నం..

బీజేపీ పరువు తీసే ప్రయత్నం..

అయితే ఈ సిరీస్‌లో విలన్ పాత్ర పోషించిన బాలకృష్ణ బాజ్‌పేయి నటించిన ఓ సన్నివేశంలో గుర్జార్ ఫొటోని వాడారు. అసలు ఫొటోని మార్ఫ్ చేసినప్పటికీ.. గుర్జార్ ముఖ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సిరీస్‌ ద్వారా బీజేపీ పరువు తీసే ప్రయత్నం జరిగిందన్న గుర్జార్.. పాకిస్థాన్‌ను ఉగ్రవాదరహిత దేశంగా చిత్రీకరించారని మండిపడ్డారు. అంతేకాకుండా.. సనాతన ధర్మం, కొన్ని హిందూ సంస్థలను తప్పుడుకోణంలో చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాన్న గుర్జార్ ఒక దేశ భక్తుడిగా విరాట్.. అనుష్కకు విడాకులు ఇవ్వాలని.. తద్వారా అందరికీ బలమైన సందేశం అందించాలని సూచించారు.

దేశం కంటే ఎవరూ గొప్ప కాదు..

దేశం కంటే ఎవరూ గొప్ప కాదు..

‘దేశానికంటే ఎవరు గొప్ప కాదు. విరాట్ దేశం కోసం ఆడుతాడు.. అతను దేశ భక్తుడు. అందుకు వెంటనే అతను అనుష్కకు విడాకులు ఇవ్వాలి'' అని ఆయన అన్నారు. అంతేకాక.. ఈ సిరీస్‌ను వెంటనే రద్దు చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు లేఖ రాసినట్లు కూడా తెలిపారు. అనుష్కపై ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ట్వీట్ కూడా చేశారు.

తీవ్ర దుమారం..

తీవ్ర దుమారం..

‘అమెజాన్‌ ఒరిజినల్స్‌'లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న ‘పాతాళ్‌ లోక్‌' వెబ్‌ సిరీస్‌ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నా.. అంతే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. అంతేకాకుండా ఈ వెబ్‌సిరీస్‌పై తీవ్ర దుమారం రేగింది. ఈ వెబ్ సిరీస్‌లో గూర్ఖా వాళ్లను అవమానించారంటూ ఈ మేరకు ‘ది ఆల్ అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్' సభ్యులు హెచార్సీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసారు. ఈ సిరీస్‌ రెండో ఎపిసోడ్‌లో ఓ సీన్ గూర్ఖా సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నట్టు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

కరోనా పోరులో మహిళా పుట్‌బాలర్.. ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా!

Story first published: Wednesday, May 27, 2020, 17:31 [IST]
Other articles published on May 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X