కరోనా పోరులో మహిళా పుట్‌బాలర్.. ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా!

India senior women football Midfielder Indumathi plays for nation wearing police uniform during pandemic

చెన్నై: కరోనా వైరస్ కారణంగా యావత్ క్రీడాలోకం అతలాకుతమైంది. క్రీడా టోర్నీలన్నీ రద్దవ్వడమో.. వాయిదా పడటమో జరిగాయి. దీంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. తీరిక లేని టోర్నీలతో ఎప్పుడూ బిజీగా ఉండే తమకు ఊహించని విధంగా లభించిన ఈ విశ్రాంతిని తమ కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నారు. కానీ ఓ మహిళా ఫుట్‌బాలర్ మాత్రం తన సహచరుల్లా ఇంట్లోనే ఉండిపోలేదు. వృత్తిరీత్యా పోలీసు అధికారిణైన ఆమె వెంటనే విధుల్లో చేరి కరోనాపై యుద్దం చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే ఆకతాయిల తాట తీస్తోంది. మహమ్మారి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తోంది.

ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా..

ఎస్‌ఐ ఇందుమతి ఇక్కడా..

హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నా.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా పోరులో ముందుండి ప్రజా సేవ చేస్తోంది. ఆమె.. భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టు మిడ్‌ఫీల్డర్‌ ఇందుమతి ఖతిరేసన్‌. తమిళనాడు పోలీసు అధికారిణైన ఇందు.. ఖాకీ దుస్తులు ధరించి, మాస్క్ పెట్టుకొని, చేతికి గ్లవ్స్ వేసుకుని.. చెన్నైలోని అన్నా నగర్ వీధుల్లో విధులు నిర్వర్తిస్తోంది.

డ్యూటీలో భాగంగా ఉదయం 7 గంటలకు వెళితే.. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నట్టు ఎస్‌ఐ ఇందుమతి తెలిపింది. కానీ, క్లిష్ట సమయంలో దేశసేవ చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సాయం అందుకొని భారత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలా? అఫ్రిదిపై కనేరియా ఫైర్

దేశం తరఫున రోజు ఆడుతున్నా..

దేశం తరఫున రోజు ఆడుతున్నా..

‘ప్రతీ ఒక్కరు లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా, అనవసరంగా బయటకు రాకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నాం. ఒక ప్రొఫెషన్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కుటుంబంతో గడపడానికి సమయం ఉండదు. కానీ జనాల్లో ఛైతన్యం తేవడానికి ఇదే సరైన తరుణం. కరోనా పోరులో భాగంగా నేను దేశం తరఫున రోజు ఆడుతూనే ఉన్నా. ఇక మా డ్యూటీ షెడ్యూల్ మారుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వాహనాల తనిఖీతో అర్థరాత్రి వరకు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మా స్టేషన్ల నుంచి చాలా దూరం కూడా ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఇదంతా మా డ్యూటీలో భాగమే. ఇన్ని ఇబ్బందులున్నా.. దేశం తరఫున విజయం సాధించినప్పుడు కలిగిన ఫీలింగే ఇప్పుడు వస్తుంది.

ఆ క్షణాలు మరవలేనివి..

ఆ క్షణాలు మరవలేనివి..

వాస్తవానికి దేశం తరఫున ఆడటమనేది ఎప్పుడూ గౌరవంగా అనిపించేదే. ముఖ్యంగా ఒలింపిక్ క్వాలిఫైయర్స్ రౌండ్ 2 కి అర్హత సాధించినప్పుడు, గతేడాది సాఫ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను. అలాగే ఈ క్లిష్ట సమయంలో పోలీస్‌గా దేశానికి సేవ చేయడం పట్ల నేను గర్వపడుతున్నా. నా దేశానికి నా సేవ అవసరమైనంతవరకు చేస్తూనే ఉంటా. ఈ దేశ ప్రజల కోసం నా సహోద్యోగులు, నేను అహర్నిషులు కష్టపడుతున్నాం. భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవడంతో పాటు మాకు సాయం చేసినవారవుతారు.'అని ఎస్ఐ ఇందుమతి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

పోలీస్‌గా తొలి మహిళా ప్లేయర్

పోలీస్‌గా తొలి మహిళా ప్లేయర్

ఇక క్రీడాకారులు పోలీస్ ఆఫీసర్లుగా కరోనా పోరులో ముందుండటం కొత్త కాకపోయినా.. ఖాకీ దుస్తుల్లో కరోనా పోరు చేస్తున్న తొలి మహిళా క్రీడాకారిణి మాత్రం ఇందుమతినే. ఇప్పటికే హరియాణ డీఎస్పీగా క్రికెటర్ జోగిందర్ శర్మ, కబడ్డీ ప్లేయర్ అజయ్‌ ఠాకూర్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో డీఎస్పీగా కరోనా పోరులు మందుండి ప్రజా సేవ చేస్తున్నారు. కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత అఖిల్‌ కుమార్‌ ..జోగిందర్‌ లాగానే హరియాణాలో ఏసీపీ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు.

యువరాజ్, హర్భజన్ సింగ్ కటీఫ్ కామెంట్స్‌పై స్పందించిన అఫ్రిది

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Wednesday, May 27, 2020, 15:16 [IST]
Other articles published on May 27, 2020
+ మరిన్ని
POLLS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more