న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

LPL 2020: తమ్ముడూ.. అంత కోపం పనికిరాదు.. నాకెరీర్ అంత లేదు నీ వయసు! (వీడియో)

LPL 2020: Naveen-ul-Haq gets into a heated exchange with Mohammad Amir and Shahid Afridi

కొలంబో: లంకన్ ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) అరంగేట్ర సీజన్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అద్భుత మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజాను అందిస్తోంది. సోమవారం డబుల్ హెడర్ మ్యాచ్‌లో భాగంగా కాండీ టస్కర్స్, గాల్లే గ్లాడియేటర్స్ మధ్య జరిగిన లీగ్ ఆరో మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో టస్కర్స్ 25 రన్స్‌తో గెలిచినప్పటికీ.. ఆటగాళ్ల ఆట కంటే వారి మధ్య జరిగిన వాగ్వాదమే చర్చనీయాంశమైంది. టస్కర్స్ తరఫున బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్, పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే..?

ఏం జరిగిందంటే..?

గాల్లే గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ ఫస్ట్ బాల్‌ను ఆమిర్ సిక్స్ కొట్టాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన నవీన్ ఉల్ హక్ ఏవో అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఆమీర్ కూడా అదే స్థాయిలో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. తీవ్ర పదజాలంతో తిట్టుకున్నట్లు టీవీ కెమెరాల్లో స్పష్టమైంది. అయితే సహచర ఆటగాళ్లు, అంపైర్లు నవీన్‌ను వారించడంతో గొడవ సద్దుమణిగింది. అయినా ఇద్దరూ ఆగ్రహంతో ఊగిపోయారు.

మ్యాచ్ అనంతరం అఫ్రిదితో..

ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం అఫ్రిదితో నవీన్ వాగ్వాదానికి దిగాడు. ఇరు జట్ల ఆటగాళ్లు అభినందనలు తెలుపుకున్న క్రమంలో ఆమీర్ వైపు నవీన్ ఉల్ హక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో మరోసారి వారి మాటల యుద్దం నడించింది. ఈ క్రమంలోనే గ్లాడియేటర్స్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ప్రత్యర్థి ఆటగాళ్లు హ్యాండ్ షేక్ ఇస్తూ నవీన్‌కు ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాడు. కానీ అఫ్రిది సలహాలకు చిర్రెత్తుకుపోయిన నవీన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో అతన్ని సహచర ఆటగాళ్లు పక్కకు తీసుకెళ్లారు.

చెడ్డీలు వేసుకోలేదు..

చెడ్డీలు వేసుకోలేదు..

అయితే ‘తమ్ముడూ.. అంత కోపం పనికిరాదు.. నాకెరీర్ అంత లేదు నీ వయసు.. ప్రశాంతంగా ఉండు'అని అఫ్రిది నవీన్ ఉల్ హక్‌కు చెప్పాడని అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా 20 ఏళ్ల వయసులో అఫ్రిది ఫాస్టెస్ సెంచరీ చేస్తే.. నవీన్ ఉల్ హక్ 21 ఏళ్ల వయసులో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగుతున్నాడని ఎగతాళి చేశారు. ఇక అఫ్రిది అరంగేట్రం చేసినప్పుడు నవీన్ చెడ్డీలు కూడా వేసుకోలేదని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

టస్కర్స్ సూపర్ విక్టరీ..

టస్కర్స్ సూపర్ విక్టరీ..

ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన క్యాండీ టస్కర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్(49), బ్రెండన్ టేలర్( 51 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో ధనంజయ, ఆమిర్, షిరజ్ తలో వికెట్ తీయగా.. సందకన్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. గుణతిలక(82) ఒంటరిగా పోరాడిన ఫలితం లేకపోయింది. టస్కర్స్ బౌలర్లలో భారత మాజీ పేసర్ మునాఫ్ పటేల్, పెరీరా, గుణరత్నే, ప్రసన్న, నవీన్ తలో వికెట్ తీశారు.

ఐపీఎల్ చూసి ఆటగాళ్లను తీసుకుంటున్నప్పుడు.. కెప్టెన్‌‌ను కూడా అలానే ఎంచుకోవాలి!

Story first published: Tuesday, December 1, 2020, 12:27 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X