న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ చూసి ఆటగాళ్లను తీసుకుంటున్నప్పుడు.. కెప్టెన్‌‌ను కూడా అలానే ఎంచుకోవాలి!

Fans slams Kohli-Shastri ‘brand of cricket’, demand Rohit Sharma captaincy after ODI series defeat in Australia

హైదరాబాద్: కరోనా బ్రేక్ అనంతరం ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్ క్రికెట్ జట్టు.. పేలవ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. సూపర్‌ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటికైతే టీమిండియా ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్‌ ఉండ గానే సిరీస్‌ను కోల్పోయింది.

దీనికి ముందు కూడా భారత్‌ ఆట గొప్పగా లేదు. దాంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడికి టీమిండియాలో చోటు కల్పిస్తున్నప్పుడు.. సారథిగా ఐదు టైటిళ్లను గెలిచిన రోహిత్‌ను వన్డే కెప్టెన్‌ చేయడంలో తప్పేముందనే డిమాండ్ వ్యక్తమవుతుంది.

దాదా తర్వాత కోహ్లీనే..

దాదా తర్వాత కోహ్లీనే..

విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలోనే ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో.. రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో కోల్పో యింది. ఇప్పుడు ఆసీస్‌తో రెండింటిని కలిపితే వరుసగా ఏడు ఓట ములు. భారత క్రికెట్‌ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్‌లు ఓడడం ఇది రెండోసారి మాత్రమే. ఇలా 18 ఏళ్లక్రితం గంగూలీ నేతృత్వంలో (10 మ్యాచ్‌లు) జరగడం గమనార్హం. 2019లో ధోనీ సహకారాలతో కెప్టెన్‌గా మెరిసి కోహ్లీ.. ఇప్పుడు అతను లేకపోవడంతో విఫలమవుతున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది. విరాట్ కెప్టెన్ అయినా కీలక సమయా ధోనీనే జట్టును ముందుండి నడిపించేవాడు. ఇప్పుడు ఆ సహకారం కొరవడంతో విరాట్ విఫలమవుతున్నాడు.

కెప్టెన్‌గా విరాట్‌ విఫలం..

కెప్టెన్‌గా విరాట్‌ విఫలం..

తాజా సిరీస్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే విషయంలో కెప్టెన్‌గా కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో అతను బౌలర్లకు తగిన సూచనలిస్తూ, ఫీల్డింగ్‌ను మార్చుతూ తగిన వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన విరాట్‌లోనే నిరాశావాదం కనిపిస్తోంది. ఇక తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ, స్పిన్నర్‌ చాహల్‌ను తప్పిస్తారని అంతా భావించినా అలా జరగలేదు. తిరిగి రెండో మ్యాచ్‌లోనూ ఈ ఇద్దరి బౌలింగ్‌ను ఆసీస్‌ ఆటాడుకుంది. మరో పేసర్‌ నటరాజన్‌కు అవకాశం విషయంలో కెప్టెన్‌గా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అలాగే ఆరంభంలో ఓపెనర్లను అడ్డుకునేందుకు తమ ప్రధాన బౌలర్లను వాడుకునే విషయంలోనూ కోహ్లీకి స్పష్టత లేకుండా పోతోందంటున్నారు.

బుమ్రాకు 2 ఓవర్లా..?

బుమ్రాకు 2 ఓవర్లా..?

ఆస్ట్రేలియాతో రెండు వన్డేల్లోనూ భారత్‌ ఓడడంతో కెప్టెన్‌ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ విరుచుకుపడ్డాడు. అతడి నాయకత్వ లోపంతోనే సిరీస్‌ పోయిందని విమర్శించాడు. అలాగే పేసర్‌ బుమ్రాను వాడుకోవడంలో విఫలమయ్యాడన్నాడు. రెండో మ్యాచ్‌లోని రెండవ, నాల్గవ ఓవర్లు వేశాక బుమ్రాకు తిరిగి తొమ్మిదో ఓవర్‌ వరకు బౌలింగ్‌ ఇవ్వలేదు. ఈ రెండు ఓవర్లలో అతను ఏడు పరుగులే ఇచ్చాడు. ‘కోహ్లీ కెప్టెన్సీ అర్థం కావడం లేదు. వన్డే ఫార్మాట్‌లో బౌలర్లకు 4-3-3 ఓవర్ల చొప్పున స్పెల్‌ ఉంటుంది. కానీ తొలి స్పెల్‌లో బుమ్రాతో రెండు ఓవర్లే వేయించాడు. ఒక ప్రధాన బౌలర్‌ను ఇలాగేనా వాడుకునేది? ఇందులో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన బుమ్రాను ఎదుర్కోవ డంలో ఆసీస్‌ ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. దీన్ని అవకాశంగా తీసుకోవాల్సింది. ఇది టీ20 ఫార్మాట్‌ కాదనే విషయం అతడు గుర్తుంచుకోవాలి' అని గౌతీ హితవు పలికాడు.

రోహిత్‌ బెస్ట్‌..!

రోహిత్‌ బెస్ట్‌..!

పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పించి.. రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్స్‌ కోహ్లీతో పాటు కోచ్‌ రవిశాస్త్రిని కూడా విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో టీమిండియా విజయాలు సాధించలేదని వాదిస్తున్నారు. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ బెస్ట్‌ అంటూ ఇప్పటికే ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ కూడా అభిప్రాయపడ్డాడు. అలాగే రోహిత్‌ నాయకుడిగా భారత్‌ ఆడిన 10 వన్డేల్లో 8 గెలవగా.. 19 టీ20ల్లో 14 నెగ్గడం విశేషం. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడికి టీమిండియాలో చోటు కల్పిస్తున్నప్పుడు.. సారథిగా ఐదు టైటిళ్లను గెలిచిన రోహిత్‌ను వన్డే కెప్టెన్‌ చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు.

యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఏమైంది? బౌలింగ్‌లో ఆ పదునేది?

Story first published: Tuesday, December 1, 2020, 10:18 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X