న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వివాదాలు సృష్టించడం తప్పా.. సంజయ్ మంజ్రేకర్‌కు మరో పనిలేదు: క్రిష్ శ్రీకాంత్

Kris Srikkanth Says Sanjay Manjrekar Doesn’t Have Any Other Job after he questioned KL Rahul’s Test Selection

చెన్నై: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంట్రవర్సీలు క్రియేట్ చేయడం తప్పా సంజయ్‌కు మరో పనిలేదని విమర్శించాడు. కరోనా బ్రేక్‌‌ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్‌‌ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు బీసీసీఐ సోమవారం జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా సాగే ఈ టూర్‌‌లో ఆస్ట్రేలియాతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్‌‌ మ్యాచ్‌‌లు ఆడనుంది. సునీల్‌‌ జోషీ ఆధ్వర్యంలోని కొత్త సెలెక్షన్‌‌ కమిటీ వర్చువల్‌‌గా సమావేశమై.. ఈ సిరీస్‌‌ల కోసం వేర్వేరుగా జట్లను ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో అదరగొడుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మూడు ఫార్మాట్లలో అవకాశం దక్కించుకున్నాడు. పైగా రోహిత్ శర్మ గైర్హాజరీ కారణంగా పరిమిత ఓవర్లలో వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ అందుకున్నాడు.

టెస్ట్‌ల్లో కేఎల్ రాహులా?

టెస్ట్‌ల్లో కేఎల్ రాహులా?

అయితే కేఎల్ రాహుల్‌ను టెస్ట్‌ల్లోకి ఎంపికచేయడాన్ని మంజ్రేకర్ తప్పుబట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనను చూసి టెస్ట్ జట్టులోకి తీసుకోవడం సబబు కాదని, రంజీ ఆటగాళ్లకు అన్యాయం చేసినట్టేనని సెలెక్టర్లను విమర్శించాడు. ‘ఐపీఎల్ ప్రదర్శన‌ను పరిగణలోకి తీసుకోని ఓ ఆటగాడిని టెస్ట్ జట్టులోకి తీసుకొని కొత్త సంప్రదాయానికి తెరదీశారు. ముఖ్యంగా సదరు ఆటగాడు తన గత టెస్ట్ మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. కానీ అవేవి పట్టిచ్చుకోకుండా ఐపీఎల్ ఫామ్ కారణంగా అతనికి అవకాశం ఇచ్చారు. ఈ ఎంపిక రంజీ ఆటగాళ్లను డీమోటివేట్ చేసినట్లే.'అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.

సంజయ్ వాగేదంతా చెత్త..

సంజయ్ వాగేదంతా చెత్త..

అయితే సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలను క్రిష్ శ్రీకాంత్ తప్పుబట్టాడు. అతను వాగిందంతా చెత్తని కొట్టిపారేశాడు. ‘మంజ్రేకర్ మాటలను పట్టించుకోవద్దు. అతన్ని వదిలేయ్యాలి. వివాదాలు సృష్టించడం తప్పా అతనికి మరో పనిలేదు. కేఎల్ రాహుల్‌ను టెస్ట్‌ల్లో ఎంపిక చేయడాన్ని ప్రశ్నిస్తున్నాడు. రాహుల్ టెస్ట్‌ల్లో అద్భుతంగా రాణించాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలతో నేను ఏ మాత్రం ఏకభవించను. ఎందుకంటే అతను ఎప్పుడూ ఏదో ప్రశ్నిస్తూ వివాదాలు సృష్టించాలనుకుంటాడు. ఆల్ ఫార్మాట్లలో రాహుల్ సత్తా చాటగలడు. అతని టెస్ట్ రికార్డులే చెబుతాయి. సంజయ్ మాట్లాడిందంతా చెత్త. నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను'అని క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇక 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలోనే రాహుల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఓ సెంచరీ కూడా సాధించాడు.

టీ20ల్లో జడేజా ఎందుకు దండుగా..

టీ20ల్లో జడేజా ఎందుకు దండుగా..

టీ2 జట్టులోకి యువ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను కాదని రవీంద్ర జడేజాను ఎంపికచేయడం కూడా బాలేదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఓ అభిమాని 'టీ20లకు రవీంద్ర జడేజా పనికిరాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ తీసుకోవాల్సింది. మీరేమంటారు?'అని మంజ్రేకర్‌ను ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. దీనికి మంజ్రేకర్ సదరు అభిమాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపాడు. జడేజాకు బదులు, అక్షర్ పటేల్‌ను తీసుకోవాల్సిందని తన మనసులోని మాటను చెప్పకనే చెప్పాడు. అయితే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరూ జడేజానే సరైనవాడంటే మరికొందరూ అక్షర్‌కు అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.

అతని ఆటను చూసి అవాక్కయ్యా.. ఔట్ ఆఫ్ సిలబస్‌లా అనిపించింది: రికీ పాంటింగ్

Story first published: Wednesday, October 28, 2020, 22:26 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X