న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని ఆటను చూసి అవాక్కయ్యా.. ఔట్ ఆఫ్ సిలబస్‌లా అనిపించింది: రికీ పాంటింగ్

IPL 2020, SRH vs DC: Ricky Ponting says Sunrisers Hyderabad top order batsman Wriddhiman Saha surprised him

దుబాయ్‌: సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ వృద్దిమాన్ సాహా ఆటను చూసి అవాక్కయ్యానని ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆరెంజ్ ఆర్మీ 88 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. బ్యాటింగ్‌లో వృద్దిమాన్ సాహా(45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) పరుగుల విధ్వంసం సృష్టించగా.. బౌలింగ్‌లో రషీద్ ఖాన్ మాయ చేశాడు. దాంతో హైదరాబాద్.. పటిష్ట ఢిల్లీని మట్టికరిపించి ప్లే ఆఫ్ ఆశలను సజీవం చేసుకుంది.

సాహా ఔట్ ఆఫ్ సిలబస్..

సాహా ఔట్ ఆఫ్ సిలబస్..

అయితే సాహా సూపర్ బ్యాటింగ్ కారణంగానే తమకు ఓటమి ఎదురైందని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. అతను ఇలా వచ్చి చెలరేగుతాడని అస్సలు ఊహించలేదన్నాడు. ‘ఈ మ్యాచ్‌లో సాహా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడని ముందే తెలుసు. కానీ ఈ సీజన్‌లో అతను ఎక్కువ ఆడలేదు. జానీ బెయిర్‌స్టో‌ స్థానంలో అతను ఓపెనర్‌గా వచ్చి చెలరేగుతాడని అస్సలు ఊహించలేదు.'అని పాంటింగ్ తెలిపాడు. ఇక ప్రతీ మ్యాచ్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు తగ్గట్లు ప్రణాళికలు రచించే పాంటింగ్.. ఈ మ్యాచ్‌లో సాహా రాకను ఊహించలేదు. దాంతో ఢిల్లీ.. ఔట్ ఆఫ్ సిలబస్‌ నుంచి వచ్చిన ప్రశ్నకు సమాధానం రాయలేక విఫలమైంది.

తుఫాన్ ఇన్నింగ్స్..

తుఫాన్ ఇన్నింగ్స్..

ఇక ఇరు జట్ల మధ్య ఉన్న తేడా సాహా ఇన్నింగ్సేనని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ‘అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్‌స్టో రానున్న మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రావడం కష్టమే.. ఒకవేళ ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో.

శిఖర్ డక్ కొంప ముంచింది..

శిఖర్ డక్ కొంప ముంచింది..

హైదరాబాద్ విధించిన 220 పరుగులు టార్గెట్ కొంచెం కష్టమే. శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానేలు ఓపెనర్లుగా వచ్చినా.. ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ సున్నాకే వెనుదిరగడం.. మిగతావారు పూర్తిగా విఫలం కావడం.. బౌలింగ్‌లో పూర్తిగా తేలిపోవడం జట్టు ఓటమికి కారణాలుగా చెప్పవచ్చు. అయినా సాహా, వార్నర్‌ ధాటికి పవర్‌ప్లేలో ఆ జట్టు ఈ లీగ్‌లోనే అత్యధికంగా 77 పరుగులు చేయడంతో విజయానికి అక్కడే దూరమయ్యామని అనిపించాం. ఆరంభం నుంచి ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సులువుగా ప్లేఆఫ్‌ చేరొచ్చనే విషయంపై స్పష్టంగానే ఉన్నాం.

టాప్ ప్లేసే టార్గెట్

టాప్ ప్లేసే టార్గెట్

ఒక దశలో ఏడు విజయాలు సాధించిన తర్వాత వరుసగా హ్యాట్రిక్‌ ఓటములు నమోదు చేయడంతో టాప్‌ ప్లేస్‌ కోసం మళ్లీ పోటీ ఏర్పడింది. ఇప్పుడు దానిని సరిచేయాల్సిన అవసరం ఉంది. మాకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచ్‌ల్లో కఠినమైన ముంబై, ఆర్‌సీబీని ఎదుర్కోనున్నాం. రెండు మ్యాచ్‌లు గెలవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తాం.. రెండు గెలిస్తే టాప్‌ ప్లేస్‌ మా సొంతం అవుతుంది. ఒకవేళ ఒకటి గెలిస్తే.. రన్‌రేట్‌ కీలకమవుతుంది.. అందుకే రానున్న మ్యాచ్‌ల్లో రన్‌రేట్‌ను కూడా మరింత మెరుగుపరుచుకుంటాం.' అని పాంటింగ్‌ చెప్పుకొచ్చాడు.

#ThankYouMSDhoni: ఆస్ట్రేలియా పర్యటన వేళ.. ధోనీపై గౌరవాన్ని చాటుకున్న బీసీసీఐ!

Story first published: Wednesday, October 28, 2020, 20:39 [IST]
Other articles published on Oct 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X