న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సస్పెన్షన్‌తో స్వార్థంగా ఆలోచించా.. వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడా: కేఎల్ రాహుల్

KL Rahul reveals how BCCI’s suspension changed him

బెంగళూరు: గతేడాది ప్రారంభంలో బీసీసీఐ తనపై విధించిన నిషేధంతో చాలా స్వార్థంగా ఆలోచించానని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడాలనుకున్నానీ, కానీ దారుణంగా విఫలమవడంతో తన తప్పిదం తెలుసుకొని రియలైజ్ అయ్యానన్నాడు. శనివారం ఇండియాటుడేతో మాట్లాడిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

అందుకే నిలకడగా ఆడుతున్నా..

అందుకే నిలకడగా ఆడుతున్నా..

కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న రాహుల్ గతేడాది చివర్లో స్థిరంగా రాణించడం వెనుక ఉన్న కారణాన్ని తెలియజేశాడు.‘నా ఆలోచన విధానం మారడంతోనే నేను నిలకడగా రాణిస్తున్నా. బీసీసీఐ విధించిన సస్పెన్షన్‌తో నేను చాలా స్వార్థంగా ఆలోచించా. వ్యక్తిగత ప్రదర్శనలకే ప్రాధాన్యం ఇచ్చా. కేవలం నా కోసం పరుగులు చేయాలనుకునేవాడిని. కానీ నేనెంత తప్పుగా ఆలోచిస్తున్నానో నా వైఫల్యాలు తెలియజేశాయి. స్వార్థంగా ఆలోచించినన్నాళ్లు దారుణంగా విఫలమయ్యా. అప్పుడే ఈ ఆలోచనల నుంచి బయటపడి జట్టు కోసం ఆడాలని నిర్ణయించుకున్నా.

ఆ ఆలోచనలే ఫలితాలనిచ్చాయి..

ఆ ఆలోచనలే ఫలితాలనిచ్చాయి..

‘కెరీర్ ఎక్కువ రోజులు కొనసాగదని మా అందరికి తెలుసు. గతేడాదే నాకు ఇంకా మహా అయితే 11, 12 ఏళ్ల కెరీర్ ఉంటదని గ్రహించా. ఆడినంత కాలం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నా. దాని కోసం నా శక్తినంత దారపోసి టీమ్ మ్యాన్‌గా ఎదగాలనుకున్నా. ఈ ఆలోచనలు నాకు మంచి ఫలితాలనిచ్చాయి. ముఖ్యంగా అప్పటి వరకు నాపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేశాయి. ఆటపై దృష్టిపెట్టేలా.. విజయాల్లో కీలక పాత్ర పోషించేలా చేశాయి'అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

అఫ్రిది పాపం పండింది.. అందుకే కరోనా సోకింది!

రోహిత్ అండగా నిలిచాడు

రోహిత్ అండగా నిలిచాడు

ఇక అనేక సందర్భాల్లో ఓపెనర్ రోహిత్‌ శర్మ తనకు అండగా నిలిచాడని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ తెలిపాడు. రోహిత్‌ లాంటి స్టార్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అండగా ఉంటే తెలియని శక్తి వస్తుందన్నాడు. ‘గత కొన్ని నెలలుగా రోహిత్‌తో కలిసి క్రికెట్‌ ఆడుతున్నా. సచిన్‌ టెండూల్కర్‌ లాంటి దిగ్గర క్రికెటర్‌ను చూసినప్పుడు ఓ యువ ఆటగాడు ఎలా సంభ్రమాశ్చర్యంతో మూగబోతాడో.. రోహిత్‌ గురించి మాట్లాడలంటే నాకు కూడా అలాగే మాటలు రావు. ఒక సీనియర్‌ ఆటగాడిగా రోహిత్‌ నాకు అనేక సందర్భాల్లో అండగా ఉండేవాడు.

అది నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చేది. ప్రతీ ఆటగాడికి ఇలా ఓ సీనియర్‌ ఆటగాడు అండగా నిలిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ముఖ్యంగా ఓపెనింగ్‌ విషయంలో. అయితే నేను నాలుగో స్థానంలోనైనా బ్యాటింగ్‌ దిగేందుకు సిద్దంగా ఉండటంతో జట్టు కూర్పు సులభతరమవుతుంది'అని రాహుల్‌ తెలిపాడు.

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

మహిళలను కించపరిచే వ్యాఖ్యలు..

గతేడాది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించే 'కాఫీ విత్ కరణ్'షోకు హార్థిక్ పాండ్యాతో కలిసి రాహుల్‌ హాజరైన విషయం తెలిసిందే. ఈ షోలో ఈ ఇద్దరు ఆటగాళ్లు నోరు జారి.. జట్టులో చోటు చేజార్చుకున్నారు. మహిళలను ఉద్ధేశించి వారు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో బీసీసీఐ తాత్కలిక నిషేధం విధించింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా రప్పించింది.

‘కాఫీ విత్ కరణ్' షోలో హార్ధిక్ పాండ్యా లవ్‌స్టోరీ గురించి కరణ్ జోహార్ అడగ్గా.. తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. రాహుల్ కూడా తన జేబులో కండోమ్‌ ప్యాకెట్ గురించి వివరిస్తూ తన తండ్రి ‘ఫర్వాలేదు రక్షణ కవచం వాడుతున్నావు' అంటూ ప్రశంసించాడని వివాదాస్పదరీతిలో చెప్పుకొచ్చాడు.

కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్

Story first published: Sunday, June 14, 2020, 14:47 [IST]
Other articles published on Jun 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X