న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్

Gautam Gambhir explains why Virat Kohli and Co Have Not Been Able To Handle Pressure In Crucial Games

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఇప్పట్లో వరల్డ్ చాంపియన్ కాలేదని మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ప్రస్తుత భారత జట్టుకు ఒత్తిడిని తట్టుకొని మ్యాచ్‌లు గెలిచే సామర్థ్యం లేదన్నాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో వరుసగా నాకౌట్ దశలోనే నిష్క్రమిస్తుండటానికి అదే కారణమని తెలిపాడు.స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో 'ఇండియా చాంపియన్స్ కావడం ఎలా'అనే అంశంపై శనివారం నిర్వహించిన చర్చలో మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి పాల్గొన్న గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

అందుకే చాంపియన్స్ కాలేరు..

అందుకే చాంపియన్స్ కాలేరు..

ఉత్తమ ఆటగాడికి, అత్యుత్తమ క్రికెటర్‌కు మధ్య ఉన్న తేడా క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడుతాడన్నదానిపైనే ఆధారపడి ఉంటుదన్నాడు. ఒత్తిడిని తట్టుకునే విషయంలో మెరుగవ్వనంత వరకూ టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ చాంపియన్స్ కాలేరన్నాడు.

‘కీలకమైన మ్యాచ్‌ల్లో ఎలా ఆడతావన్నదాన్ని బట్టే జట్టులో నువ్వు మంచి ఆటగాడివా? అత్యద్భుతమైన ప్లేయరా? అనేది తెలుస్తుంది. ఇతర జట్లు ఒత్తిడిని అధిగమించిన విధంగా మనోళ్లు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మనం ఆడిన సెమీఫైనల్స్, ఫైనల్స్‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

మానసిక దృఢత్వం లేకనే..

లీగ్ స్టేజ్‌లో బాగా ఆడి, నాకౌట్స్‌లో తడబడుతున్నారు. మానసిక దృఢత్వం లేకపోవడమే దానికి కారణం. మన జట్టులో అన్నీ ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. వరల్డ్ చాంపియన్స్ అయ్యే సత్తా ఉందని అంటున్నాం. కానీ మైదానంలో సత్తా చాటనంతవరకూ వరల్డ్ చాంపియన్స్ అనలేరు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

తప్పుగా అర్థం చేసుకోవద్దు.. స్వరాభాస్కర్ ట్వీట్‌కు స్పందించిన సామీ

2013 తర్వాత ఒక్కటి గెలవలేదు..

2013 తర్వాత ఒక్కటి గెలవలేదు..

2013 చాంపియన్స్ ట్రోపీ తర్వాత భారత్ ఒక్క టోర్నీ కూడా గెలవలేదనే అంశాన్ని గంభీర్ నొక్కి చెప్పాడు. ధోనీ సారథ్యంలో 2013 చాంపియన్స్ ట్రోఫీ తర్వాత 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో, 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓటమిపాలైంది. ఈ నాలుగు టోర్నీల్లో లీగ్ దశల్లో అదరగొట్టిన భారత్ కీలక మ్యాచ్‌ల్లో మాత్రం ఒత్తిడికి చిత్తయింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. ద్వైపాక్షిక సిరీస్, మెగాటోర్నీ లీగ్ స్టేజీల్లో తప్పు చేసినా సరిదిద్దుకునేందుకు అవశాం ఉంటుందని, కానీ నాకౌట్ స్టేజ్‌లో ఆ చాన్స్ ఉండదని గంభీర్ తెలిపాడు. భారత జట్టు కూడా ఇదే తప్పు చేస్తుందన్నాడు.

అఫ్రిది కోలుకోవాలి..

అఫ్రిది కోలుకోవాలి..

కరోనా వైరస్ బారిన పడిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది త్వరగా కోలుకోవాలని గంభీర్ ఆకాంక్షించాడు. తనకు అఫ్రిదితో రాజకీయ విభేదాలు ఉన్నాయని కానీ, అది వ్యక్తిగత వైరం కాదని చెప్పాడు. ఏ ఒక్కరూ వైరస్ బారిన పడవద్దనేది తన అభిమతమని తెలిపాడు. త్వరలోనే అఫ్రిది సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఇండియా టుడే సలామ్ క్రికెట్‌ 2020 కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం అఫ్రిదికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే.

అఫ్రిది పాపం పండింది.. అందుకే కరోనా సోకింది!

Story first published: Sunday, June 14, 2020, 8:37 [IST]
Other articles published on Jun 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X