For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రిది పాపం పండింది.. అందుకే కరోనా సోకింది!

Indian Cricket Fans React After Shahid Afridi Was Test Corona Positive

కరాచీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి కరోనా సోకడంతో యావత్ క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్రికెట్ పునరుద్దరణకు పూనుకున్న క్రమంలో స్టార్ మాజీ క్రికెటర్ మహమ్మారి భారిన పడటం ఆందోళన రెకిత్తిస్తోంది. ఇక రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అఫ్రిదికి శనివారం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అఫ్రిదే ట్విటర్ వేదికగా వెల్లడించాడు.

'గురువారం నుంచి నేను కొంచెం అస్వస్థతకు లోనయ్యా. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా దురదృష్టవశాత్తు పాజిటీవ్ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మీరంతా ఇంట్లోనే భద్రంగా ఉండండి' అని అఫ్రిది ట్విట్ చేశాడు.

గెట్ వెల్ సూన్ భాయ్..

ఇక అఫ్రిదికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు అతను త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆటగాళ్లు కమ్రాన్ అక్మల్, హసన్ అలీ, మహ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, అఫ్రిది కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ హెర్చెల్లె గిబ్స్ కూడా అఫ్రిదికి తన సలహాలిచ్చాడు. ‘ఈ కఠిన పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలి మిత్రమా'అని ట్వీట్ చేశాడు. ‘కరోనా విపత్కర పరిస్థితుల్లో నువ్వు చేసిన సాయమే నిన్ను రక్షిస్తుంది. నీ సాయం పొందిన ప్రతీ ఒక్కరు నీ కోసం ప్రార్ధిస్తారు.'అని అహ్మద్ షాజాద్ పేర్కొన్నాడు.

ఆ అల్లా అండగా ఉన్నాడు..

ఇక తన సహచర ఆటగాడు మహ్మద్ యూసఫ్ సైతం అఫ్రిదికి అండగా అల్లా ఉన్నాడని ట్వీట్ చేశాడు. ‘దిగులు చెందకు మిత్రమా.. నీకు తోడుగా అల్లా ఉన్నాడు. ఈ మహమ్మారి నిన్ను ఏం చేయలేదు'అని ట్వీట్ చేశాడు. ‘సహజంగానే నీవో ఫైటర్.. అలాంటిది నీకు ఈ కరోనా ఓ లెక్కనా.. నీ పోరాటంతో త్వరలోనే వైరస్‌ను ఓడిస్తావ్. కోలుకోని ఆరోగ్యం గా తిరిగివస్తావ్'అని మహమ్మద్ హఫీజ్ పేర్కొన్నాడు. ‘త్వరగా కోలుకునేలా ఆ అల్లా నీకు శక్తినిస్తాడు'అని అజార్ అలీ పేర్కొన్నాడు.

సంతోషంలో భారత అభిమానులు..

మరోవైపు భారత్‌కు చెందిన కొంత అభిమానులు అఫ్రిదికి కరోనా రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కశ్మీర్ పట్ల అతను చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ బాగైందంటున్నారు. పాపం పండింది కాబట్టే అఫ్రిదికి ప్రాణాంతక వైరస్ సోకిందని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తెగ సంతోషంగా ఫీలవుతున్నాడనే అర్థంలో మీమ్స్ సృష్టిస్తున్నారు. కర్మ సిద్దాంతాన్ని ప్రస్తావిస్తున్నారు. అన్యాయంగా ఒకరిని ఆడిపోసుకుంటే ఇలానే ఉంటుందని శాపనార్ధలు పెడుతున్నారు. ఇక కరోనా సేవ కార్యక్రమాల్లో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో పర్యటించిన అఫ్రిది.. భారత ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అఫ్రిది ఒక్కడే కాదు..

అఫ్రిది ఒక్కడే కాదు..

కరోనా సోకిన పాక్‌ క్రికెటర్లలో షాహిద్ అఫ్రిదే మొదటి వాడు కాదు . ఆ జట్టు మాజీ ఓపెనర్ తఫీక్ ఉమర్‌, ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ జఫార్ సర్ఫరాజ్ కూడా ఈ మహమ్మారి భారిన పడ్డారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈ ఇద్దరు కోలుకున్నారు. జూన్ మొదటి వారంలోనే తఫీక్‌కు పరీక్షలు నిర్వహింగా నెగటీవ్ వచ్చింది. ఇక స్కాట్లాండ్ మాజిద్ హక్, సౌతాఫ్రికా సొలో ఎంక్వెనీలు కూడా కరోనా బారిన పడ్డారు. మరికొంతమంది ఇతర క్రికెటర్లు కూడా కొవిడ్-19 బాధితులయ్యారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ సాధించిన క్రికెటర్లలో కరోనా సోకిన వ్యక్తి మాత్రం అఫ్రిదినే.

తప్పుగా అర్థం చేసుకోవద్దు.. స్వరాభాస్కర్ ట్వీట్‌కు స్పందించిన సామీ

Story first published: Saturday, June 13, 2020, 17:36 [IST]
Other articles published on Jun 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+