న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతన్ని చూసి గజ్జున వణికేవాడిని.. దాక్కొని తినేవాడిని: కపిల్ దేవ్

Kapil Dev Says S Venkataraghavan gave him a hard time when he was the Indian captain

న్యూఢిల్లీ: 1983 ప్రపంచకప్ విజయంతో భారత్‌లో క్రికెట్ విప్లవాన్ని తీసుకొచ్చిన బౌలింగ్ ఆల్‌రౌండర్, దిగ్గజ సారథి కపిల్ దేవ్ కెరీర్ ప్రారంభంలో మాజీ కెప్టెన్ వెంకటరాఘవన్‌ను చూసి చాలా భయపడేవాడినని తెలిపాడు. బిషన్ బేడీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కపిల్.. ఎక్కువగా సునీల్ గావస్కర్ కెప్టెన్సీలో ఆడాడు.

ఇక వెంకటరాఘవన్ కెప్టెన్‌గా ఉన్న సమయం తనకు చాలా కష్టంగా గడిచిందని గుర్తు చేసుకున్నాడు. భారత మాజీ ఓపెనర్ వీవీరామన్‌తో ఓ ఇంటర్వ్యూలో చిట్‌చాట్ చేసిన కపిల్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ఎప్పుడూ కోపంగా ఉండేవాడు..

ఎప్పుడూ కోపంగా ఉండేవాడు..

‘ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ సందర్బంగా ఈవ్‌నింగ్ బ్రేక్‌ను టీవిరామం అనేవారు. కానీ వెంకటరాఘవన్ మాత్రం అది టీ బ్రేక్ ఒక్కటే ఎందుకైతది. కాఫీ బ్రేక్ కాదా? అని వాదించేవాడు. అతని మనస్థత్వం అలా ఉండేది. అతన్ని చూసి నేను చాలా భయపడేవాడిని. ఎందుకంటే అతనెప్పుడు ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడు. అలాగే వెంకటరాఘవన్ కోపం గురించి మాకు బాగా తెలుసు. చివరకు అతను అంపైర్‌గా ఉన్నప్పుడు నాటౌట్ ఇచ్చే విధానం బౌలర్‌ను తిడుతున్నట్లు ఉండేది.

నాపై అరిచేవాడు..

నాపై అరిచేవాడు..

1979లో నేను ఇంగ్లండ్ వెళ్లినప్పుడు అతనే కెప్టెన్. ఎప్పుడూ అతని కంటబడని సీటును వెతుక్కునేవాడిని. నాతో బేడీ, ప్రసన్న, చంద్ర శేఖర్ బాగుండేవారు. వారు కూడా అతనితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. మాములుగానే నన్ను చూసినప్పుడల్లా ఆగ్రహం వ్యక్తం చేసేవాడు. ఇక బ్రేక్ ఫాస్ట్ సమయంలో వెంకటరాఘవన్ కనబడకుండా ఓ మూలన కూర్చొని తినేవాడిని. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగా తినేవాడిని. అతను చూస్తే ఎప్పుడూ తినడమేనా అని తిడుతాడని అలా చేసేవాడిని.'అని కపిల్ గుర్తు చేసుకున్నాడు.

కెప్టెన్ నేనా? అతనా?

కెప్టెన్ నేనా? అతనా?

ఇక 1983 వెస్టిండీస్ పర్యటనలో తన సారథ్యంలో వెంకటరాఘవన్ ఆడాడని కపిల్ తెలిపాడు. ఇక ఆ టూర్‌లో బార్బాడోస్ వేదికగా జరిగిన టెస్ట్‌లో అతని తీరు చూసి కెప్టెన్ ఎవరనే సందేహం కలిగిందన్నాడు.

‘బార్బాడస్ వేదికగా జరిగిన టెస్ట్‌లో వెంకటరాఘవనతో జరిగిన సంఘటన నాకింకా గుర్తుంది. ఆ వికెట్ కొంచెం బౌన్సీకి సహకరిస్తుండటంతో పేసర్లను ఎక్కువగా ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను మొదట స్పిన్నర్లను బరిలోకి దింపాను. అయితే ఆఫ్ స్పిన్నర్ అయిన వెంకటరాఘవన్‌ను కాకుండా రవిశాస్త్రికి బంతినిచ్చాను. దీంతో స్లిప్‌లో ఉన్న వెంకటరాఘవన్ నా దగ్గరకు వచ్చి.. కపిల్ అని పిలిచాడు. నేను చెప్పు వెంకీ అన్నా.( అప్పటికీ వెంకీ అని సంభోదించే చనువు ఏర్పడింది. కానీ అంతకుముందు సర్ అనే పిలిచేవాడిని.)

నేనమన్నా బౌలింగ్ చేయనన్నానా? అని ప్రశ్నించాడు. దాంతో అసలు కెప్టెన్ అతనా? లేక నేనా? అనే విషయం అర్థం కాలేదు. ‘వెంకీ నీవు బౌలింగ్ చేసే టైమ్ కూడా వస్తుంది.'అని చెప్పా. అయినా అతను నాపై నోరుపారేసుకున్నాడు. నేను కెప్టెన్ అయినా తిట్టేవాడు.'అని కపిల్ గుర్తు చేసుకున్నాుడు.

అంపైర్‌గా కూడా..

అంపైర్‌గా కూడా..

ఎప్పుడు కోపంగా ఉన్నట్లు కనిపించే వెంకట రాఘవన్ సారథ్యంలో కపిల్ నాలుగు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత వెంకట రాఘవన్ అంపైర్‌గా కూడా సేవలందించాడు. 1983లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెంకటరాఘవన్ భారత్ తరఫున 57 టెస్ట్‌లు, 15 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 156, వన్డేల్లో 5 వికెట్లు పడగొట్టాడు.

ధోనీ, పాంటింగ్, రోహిత్ సక్సెస్ సీక్రెట్ అదే: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

Story first published: Wednesday, July 15, 2020, 16:23 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X