న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ, పాంటింగ్, రోహిత్ సక్సెస్ సీక్రెట్ అదే: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

Mike Hussey Says MS Dhoni whether won 4 matches or lost 4, had the same expression

సిడ్నీ: మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, రికీ పాంటింగ్, మైకెల్ క్లార్క్‌ కెప్టెన్సీ సక్సెస్‌కు మైదానంలో ప్రశాంతంగా ఉండటమే కారణమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ తెలిపాడు. ఈ నలుగురి సారథ్యంలో ఆడిన హస్సీ.. వారి కెప్టెన్సీ తీరును విశ్లేషించాడు.

ఆస్ట్రేలియా జట్టులో రికీ పాంటింగ్, మైకెల్ క్లార్క్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ, ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ సారథ్యంలో మైక్ హస్సీ ఆడిన విషయం తెలిసిందే. సారథ్యం విషయంలో వీళ్లంతా ఎవరికివారే సాటని, కానీ వీరందరి విజయకాంక్ష మాత్రం ఒకటేనని తెలిపాడు.

జట్టును పరుగెత్తిస్తాడు..

జట్టును పరుగెత్తిస్తాడు..

రికీపాంటింగ్ సారథ్యంలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన హస్సీ.. పాంటింగ్ తనతో పాటు జట్టు మొత్తాన్ని విజయం కోసం పరుగెత్తిస్తాడన్నాడు. ‘వాళ్లంతా విభిన్నమైన వ్యక్తులు. రికీపాంటింగ్ గట్టి పోటీనిచ్చే సారథి. ఆటగాళ్లకు 100 శాతం అండగా ఉంటూ జట్టును ముందుకు నడిపించే వ్యక్తి. విజయం కోసం తనతో జట్టు మొత్తాన్ని పరుగెత్తిస్తాడు'అని పొడ్‌కాస్ట్ వేదికగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

తెలివైన ఆటగాడు..

తెలివైన ఆటగాడు..

ఇక 2015 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ గురించి మాట్లాడుతూ.. అతనో మంచి వ్యూహకర్తని తెలిపాడు. ‘మైకెల్ క్లార్క్ మంచి వ్యూహకర్త, తెలివైన ఆటగాడు. మైదానంలో వ్యూహాలు రచించడంలో దిట్ట. ఏ సమయంలో ఏ బౌలర్‌తో బౌలింగ్ చేయించాలో అతనికి బాగా తెలుసు.'అని క్లార్క్ సారథ్యంలో 21 టెస్ట్‌లు, 33 వన్డేలు,11 టీ20లు ఆడిన హస్సీ చెప్పుకొచ్చాడు.

ధోనీ అంతర్‌దృష్టి గొప్పది..

ధోనీ అంతర్‌దృష్టి గొప్పది..

ఆరు ఐపీఎల్ సీజన్లలో ధోనీ సారథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన హస్సీ.. మహీ సారథ్యాన్ని కొనియాడాడు. ‘ఎంఎస్‌డీ ఆటపై గొప్ప అంతర్‌దృష్టి కలిగిన ఆటగాడు. ఎంతో ప్రశాంతమైన కెప్టెన్. ఆటగాళ్లకు అండగా ఉండటంతో పాటు వారిపై పూర్తి నమ్మకంతో ఉంటాడు'అని తెలిపాడు.

ఇక రోహిత్ శర్మ కూడా ధోనీలాగానే ప్రశాంతమైన సారథని తెలిపాడు. ఆటగాళ్లపై ఎలాంటి ఒత్తిడి పడకుండా వ్యూహాలు రచిస్తాడని తెలిపాడు.

కెప్టెన్ ప్రశాంతంగా ఉండాలి..

కెప్టెన్ ప్రశాంతంగా ఉండాలి..

‘ఇక జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా వీళ్లంతా ఒకేలా ఉంటారు. అదే వీరి విజయ రహస్యం. ఉదహారణకు పాంటింగ్ సెంచరీ చేసినా.. డకౌట్ అయినా అతను ఒకేలా ఉంటాడు. అలాగే ధోనీ వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచినా.. అదే నాలుగు ఓడినా అతని ఎక్స్‌ప్రెషన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. నాకు తెలిసి సారథిలో ఉండాల్సి అద్భుత లక్షణం ఇది. అదే ఉట్టిగనే భావోద్వేగాలను ప్రదర్శించే సారథులు ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. కెప్టెన్‌లానే టీమ్ కూడా ఏమోషన్ అవుతుంటుంది. అదే కెప్టెన్ స్థిత ప్రజ్ఞుడిగా ఉంటే జట్టుకు ఎంతో మేలు కలుగుతుంది'అని హస్సీ చెప్పుకొచ్చాడు.

మరోసారి తండ్రి కాబోతున్న డివిలియర్స్.. విష్ చేసిన అనుష్క!

Story first published: Wednesday, July 15, 2020, 15:23 [IST]
Other articles published on Jul 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X