న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌కు ఆ డబ్బు అవసరం లేదు .. అక్తర్ ప్రతిపాదనపై కపిల్ ఫైర్

Kapil Dev not in favour of Indo-Pak cricket match to raise funds

న్యూఢిల్లీ: కరోనా విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించాలని షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. డబ్బుల కోసం క్రికెటర్ల‌తో రిస్క్ చేయాలా? అని ప్రశ్నించాడు.

అక్తర్ ప్రతిపాదన..

అక్తర్ ప్రతిపాదన..

ఇక కరోనాతో ఇరు దేశాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ వన్డే సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తద్వారా వచ్చే విరాళాలను ఇరు దేశాలు సమంగా పంచుకోవాలని ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సూచించాడు. అంతేకాకుండా ఈ సిరీస్ ద్వారా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, ప్రేక్షకాదరణ కూడా గణనీయంగానే ఉంటుదన్నాడు.

రిస్క్ అవసరమా..?

రిస్క్ అవసరమా..?

అయితే ఈ ప్రతిపాదనపై ఇప్పటివరకూ భారత్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కానీ అక్తర్ అభిప్రాయాన్ని భారత వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ మాత్రం వ్యతిరేకించాడు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్‌ చేయాల్సిన అవసరం లేదంటూ చురకలంటించాడు.

‘భారత్‌-పాక్‌ల మధ్య సిరీస్‌ జరగాలని కోరడం అక్తర్ అభిప్రాయం. కానీ ఈ సిరీస్‌ల ద్వారా వచ్చే డబ్బులు భారత్‌కు అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభం నుంచి గట్టెక్కడమే ముఖ్యం. ఇప్పటికే కరోనా కట్టడికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. క్రికెటర్లతో ఎలా రిస్క్‌ చేస్తాం.

రోహిత్‌కు యూవీ క్విజ్.. తన హైట్ ఎంతో కూడా చెప్పలేకపోయిన హిట్‌మ్యాన్.!!

మరో ఐదు-ఆరు నెలల వరకూ..

మరో ఐదు-ఆరు నెలల వరకూ..

అసలు మూడు మ్యాచ్‌లతో ఎంత డబ్బు సంపాదిస్తాం. అయిన మాట్లాడినంత సులువు కాదు.. ఓ టోర్నీని నిర్వంచడం. నాకు తెలిసినంత వరకూ ఐదు-ఆరు నెలల పాటు క్రికెట్‌ గురించి ఆలోచించాల్సిన అవసరంలేదు. సింపుల్‌గా ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం. అలాగే ప్రజల ప్రాణాలను కాపాడటంపైనే దృష్టి పెట్టాలి. అదే సమయంలో పేద వారి ఆకలి బాధను తీర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వైరస్‌పై ఎవరూ రాజకీయాలు చేయొద్దు. నేను ఇప్పటికే టీవీల్లో చూశా. ఈ వైరస్‌ నియంత్రణలో కూడా రాజకీయ కోణాలు కనబడుతున్నాయి. ఇది సరైనది కాదు.'అని కపిల్‌ పేర్కొన్నాడు.

భారత్‌ సాయం కోరిన అక్తర్‌

భారత్‌ సాయం కోరిన అక్తర్‌

తమ దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి భారత్‌ సాయం చేయాలని షోయబ్‌ అక్తర్‌ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటుందని, కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవన్నాడు. ఈ విషయంలో తమను భారత్‌ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

‘మాకు ప్రస్తుతం 10వేలకు పైగా వెంటిలేటర్లు అవసరం. వెంటిలేటర్లు లేక మా దేశం మరణాల రేటు ఎక్కువగా ఉంది. ఈ విషయంలో సాయం చేయడానికి భారత్‌ ముందుకు రావాలి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయండి.

మిగతా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ చొరవచూపాలి. ఈ విషయంలో ఇరు దేశాలు ఏకం కావాలి' అని అక్తర్‌ కోరాడు. ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో 4,263 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో సుమారు 60 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Story first published: Thursday, April 9, 2020, 16:36 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X