For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్‌కు యూవీ క్విజ్.. తన హైట్ ఎంతో కూడా చెప్పలేకపోయిన హిట్‌మ్యాన్.!!

Rohit Sharma struggles to answer questions about his own career in Yuvraj Singh’s live quiz

హైదరాబాద్: టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కరోనా కారణంగా ఈ స్టార్ క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా లైవ్ చాట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. క్రికెట్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న ఈ టీమిండియా లెజెండ్స్... అభిమానులకు కావాల్సిన సరదాను కూడా పంచారు.

సొంత విషయాలు కూడా...

ఈ లైవ్ సెషన్‌లో భాగంగా యువరాజ్.. రోహిత్‌ను అతని కెరీర్‌కు సంబంధించి 10 ప్రశ్నలు అడిగాడు. ఆశ్చర్యకరంగా రోహిత్ తన సొంత విషయాలను చెప్పడంలోనూ తడబడ్డాడు. ముఖ్యంగా తన పరుగులు, హైట్‌ ఎంతా? అనే సిల్లీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. పదింటి కేవలం ఐదింటికి మాత్రమే సమాధానం చెప్పి.. లెక్కల విషయంలో తానేంత బలహీనమో తెలియజేశాడు. ఈ క్విజ్ వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.

రోహిత్-యూవీ లైవ్ చాట్ సెషన్..

రోహిత్-యూవీ లైవ్ చాట్ సెషన్..

యూవీ: నీ చివరి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడావ్?

రోహిత్: బంగ్లాదేశ్‌తో ఆడా. కానీ తేదీ గుర్తురావడంలేదు.

యూవీ: నీ 32 ఏళ్ల వయసులో నీవు ఎన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడావు?

రోహిత్: 34 లేదా 35 ఆ.. అయ్యో పాజీ..

యూవీ: నీ 32 ఏళ్ల వయసులో నీవు 32 మ్యాచ్‌లు ఆడావు.

యూవీ: ఇప్పటి వరకు నీవు ఎన్ని టెస్ట్ వికెట్లు పడగొట్టావ్?

రోహిత్: క్యా యార్! నంబర్లు గుర్తుంచుకోవడం‌లో నేను మరీ బ్యాడ్. కానీ ఒకే ఒక వికెట్ తీసాననుకుంటా. కాదు రెండు తీసా.

యూవీ: వన్డే వికెట్లు ఎన్ని పడగొట్టావ్?

రోహిత్: 8

యూవీ: నీకు మూడు ముద్దు పేర్లున్నాయి. అవేంటి?

రోహిత్: అవును నాకు మూడు పెట్ నేమ్స్ ఉన్నాయి. రో, హిట్ మ్యాన్, షానా

యూవీ: ఈ 6 ప్రశ్నల్లో నాలుగింటికి సరైన సమాధానాలు ఇచ్చావ్. జహీర్ ఖాన్ నీకు షానా అనే పేరు పెట్టాడు.

యూవీ: సెంటీమీటర్లలో నీ హైట్ ఎంత?

రోహిత్: 175, 178 సెంటీమీటర్లు?

యూవీ: నీ ఎత్తు 173 సెంటీమీటర్లు

యూవీ: రైనోల రక్షణ కోసం 2015 డిసెంబర్ 7న నిర్వహించిన కాంపైన్‌లో నీవు పాల్గొన్నావు. నీతో పాల్గొన్న మిగతా ఇద్దరు ఇంటర్నేషనల్ యాక్టర్స్ ఎవరు?

రోహిత్: సల్మా హయక్, మ్యాథ్ లే బ్లాంక్

యూవీ: గుడ్ ఆన్సర్ బ్రదర్.. నీ ఐపీఎల్ పరుగులెన్ని?

రోహిత్: నాకు తెలుసు. 4800 పరుగుల పై చిలుకు. సుమారు 4873 అనుకుంటా.

యూవీ: నీవు ఏదైనా క్విజ్ షో‌లో పాల్గొంటే ఇప్పటికే ఎలిమినేట్ అయ్యేవాడివి. నీ ఐపీఎల్ రన్స్ 4898 రన్స్.

యూవీ: నీ డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ అత్యధిక స్కోర్ ఎంత? ఎవరిపైనా?

రోహిత్: 309, గుజరాత్ పై

యూవీ: నీ ఎంగేజ్‌మెంట్ ఎప్పుడైంది

రోహిత్: జూన్ 2 మా నిశ్చితార్థం జరిగింది. కానీ 29నే నేను ప్రపోజ్ చేశా.

యూవీ: నీ ఎంగేజ్‌మెంట్ ఏప్రిల్‌లో జరగలేదా? చలో..10 ప్రశ్నలకు 5 సరైన సమాధానాలు ఇచ్చావ్. నాట్ బ్యాడ్.

యువరాజ్‌ను ఇరుకున పెట్టాలని..

యువరాజ్‌ను ఇరుకున పెట్టాలని..

ఇక యువరాజ్‌ను ఇరుకు పడేయాలని రోహిత్ భావించాడు. హజెల్‌ను తొలిసారి ఎప్పుడు కలిసావని ప్రశ్నించాడు. దీనికి కొంత ఆలోచించిన యూవీ.. 2011 డిసెంబర్ 28 అని సమాధానమిచ్చాడు. అయితే తనకు సరైన సమాధానం ఏంటో తెలియదని రోహిత్ చెప్పగా.. తాను చెప్పింది కరెక్ట్ అని యూవీ విశ్వాసం వ్యక్తం చేశాడు. దీంతో తాను హజల్‌‌ను అడిగి తెలుసుకుంటానని రోహిత్ తెలిపాడు. అలాగే చేయి.. ఆరోజే హజల్‌ను కలిసా అని యూవీ బదులిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Story first published: Thursday, April 9, 2020, 15:15 [IST]
Other articles published on Apr 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+