న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ లెటర్‌లో తప్పుగా హెసన్ పేరు: ట్విట్టర్‌లో పేలుతోన్న జోకులు

Kapil Dev led CAC trolled for misspelling Mike Hesson’s name in official BCCI letter

హైదరాబాద్: కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. టీమిండియా కొత్త కోచ్‌ను ఎంపిక చేసేందుకు గాను కపిల్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి

హెడ్ కోచ్‌ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత క్రికెట్‌ సలహా కమిటీ రవిశాస్త్రికే తిరిగి పట్టం కట్టింది. 2017 నుంచి జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్న శాస్త్రి మరో రెండేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అయితే, హెడ్ కోచ్‌ నియామక ప్రక్రియ పూర్తైన తర్వాత క్రికెట్ సలహా కమిటీ ప్రెస్ మీట్ పెట్టి రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపిక చేశామో వెల్లడించింది.

ఈ సందర్భంగా బీసీసీఐ ఒక లెటర్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఆ లెటర్‌లో న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్ పేరుని తప్పుగా రాయడంపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు. "కోచ్‌ పదవి కోసం పోటీపడ్డ అభ్యర్థి పేరును కూడా సరిగా రాయకపోవడమే, ఎంపిక అనేది ఎంత పారదర్శంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్ శర్మ, 8 నెలలు తర్వాత బరిలోకి పుజారా

మరొక నెటిజన్ అయితే "కనీసం హెసన్‌ స్పెల్లింగ్‌ను గూగుల్‌లో వెతకాల్సింది" అంటూ ఛలోక్తి విసిరాడు. ఇక, టీమిండియా హెడ్ కోచ్ ఎంపికపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌లో టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీ మరింత బలవంతుడయ్యాడని... అతడి మాటను జవదాటి పోలేని పరిస్థితికి బోర్డు చేరుకుందని తెలిపారు.

Story first published: Saturday, August 17, 2019, 12:41 [IST]
Other articles published on Aug 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X