Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్ శర్మ, 8 నెలలు తర్వాత బరిలోకి పుజారా

Cheteshwar Pujara, Rohit Sharma hit the nets as India gear up for 3-day practice match in Antigua

హైదరాబాద్: విండిస్ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న కోహ్లీ సేన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా టెస్టు సిరిస్ ఆరంభానికి ముందు వెస్టిండిస్ క్రికెట్‌ బోర్డు ఎలెవెన్‌తో మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మూడు రోజుల మ్యాచ్‌ శనివారం ప్రారంభం కానుంది.

వార్మప్ మ్యాచ్‌కి కోహ్లీ దూరమే!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి బొటను వేలికి గాయమైన సంగత తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్మప్ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే వార్మప్ మ్యాచ్‌కి కెప్టెన్‌గా రహానే బాధ్యలు తీసుకుంటాడు. టెస్టు స్పెషలిస్టు పుజారా చాలా రోజుల విరామం తర్వాత బరిలో దిగుతున్నాడు.

హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఎలా సెలక్ట్ అయ్యాడో తెలుసా?: కపిల్ దేవ్ వెల్లడి

ఎనిమిది నెలల తర్వాత బరిలోకి పుజారా

ఎనిమిది నెలల తర్వాత బరిలోకి పుజారా

ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన చటేశ్వర్ పుజారా సుమారు ఎనిమిది నెలల తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌ ఆడనున్నాడు. దేశవాళీ జట్టు సౌరాష్ట్ర తరఫున ఫిబ్రవరి మొదటివారంలో రంజీ ట్రోఫీ ఫైనల్‌ ఆడిన అనంతరం అతడు మార్చిలో ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో పాల్గొన్నాడు.

టెస్టు సిరిస్‌కు అందుబాటులోకి వచ్చిన సాహా

టెస్టు సిరిస్‌కు అందుబాటులోకి వచ్చిన సాహా

ఇక, ఈ టెస్టు సిరిస్‌కు వృద్ధిమాన్ సాహా అందుబాటులోకి వచ్చాడు. దీంతో తొలి టెస్టులో చోటు దక్కాలంటే రిషబ్ పంత్‌ మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది. నెల రోజుల విశ్రాంతి అనంతరం టీమిండియా ప్రధాన పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. ఈ నేపథ్యంలో రహానే, పుజారా, బుమ్రా ఎలా ఆడతారనేది ఆసక్తికరంగా ఉంది,

చివరి అంచె మ్యాచ్‌లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ ఓటమి

రోహిత్ శర్మ ఆటపై ప్రత్యేక దృష్టి

రోహిత్ శర్మ ఆటపై ప్రత్యేక దృష్టి

మరోవైపు ఇటీవలే ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించాడు. దీంతో వెస్టిండిస్‌తో జరగబోయే టెస్టు సిరిస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఈ టెస్టు సిరిస్ రోహిత్ శర్మకు ఓ పరీక్ష కానుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి టెస్టు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Saturday, August 17, 2019, 12:15 [IST]
Other articles published on Aug 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+