న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్‌సీబీకి హిందీ సెగ.. ఫ్రాంచైజీపై మండిపడుతున్న కన్నడ ప్రజలు!

Kannada people troll RCB for using Hindi in their new theme song for IPL 2020

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) తీవ్ర ట్రోలింగ్‌కు గురవుతుంది. ఆ జట్టుకు హిందీ సెగ గట్టిగా తగిలింది. అభిమానులను ఆకట్టుకునే క్రమంలో ఆ ఫ్రాంచైజీ విడుదల చేసిన థీమ్ సాంగ్ కన్నడ ప్రజలకు తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. హిందీ భాష తమపై రుద్దవద్దని ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తుండగా.. ఆర్‌సీబీ థీమ్ సాంగ్ హిందీలో ఉండటం వారి కోపానికి మరింత ఆజ్యం పోసినట్లైంది. దీంతో సోషల్ మీడియావేదికగా ఆర్‌సీబీ ఫ్రాంచైజీని కన్నడ ప్రజలు ఏకిపారేస్తున్నారు.

కన్నడ లిరిక్స్ పెట్టాలి..

వెంటనే హిందీ లిరిక్స్ స్థానంలో కన్నడ పదాలు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్లే బోల్డ్.. ఆర్‌సీబీ అంటూ సాగిన ఈ థీమ్ సాంగ్‌లో కన్నడకు బదులు హిందీ లిరిక్స్ ఉపయోగించారు. దీనిపై ఇప్పుడు కన్నడ ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యావత్ రాష్ట్రం హిందీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే.. కన్నడ రాష్ట్రానికి చెందిన ఆర్‌సీబీ మాత్రం తమ థీమ్ సాంగ్‌లో హిందీని ఉపయోగించడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. కన్నడ లిరిక్స్ చేర్చాలని, స్పానిష్, జెర్మన్, ఫ్రెంచ్ టీమ్స్ కూడా ఇంగ్లీష్ వాడటం లేదని, అలాంటప్పుడు ఆర్‌సీబీ హిందీని ఎందుకు వాడుతుందని మరొక నెటిజన్ ప్రశ్నించాడు.

చెన్నైని చూసి నేర్చుకోండి..

‘తమిళనాడుకు చెన్నై సూపర్ కింగ్స్ థీమ్ సాంగ్ తమిళంలోనే ఉంటుంది. కింగ్స్ పంజాబ్.. పంజాబినే వాడుతుంది. కర్ణాటకకు చెందిన ఆర్‌సీబీ మాత్రం హిందీ ఉపయోగిస్తుంది. అది కూడా హిందీ తమపై రుద్దవద్దని పోరాడుతున్న సమయంలో.#StopHindiImposition' అనే హ్యాష్ ట్యాగ్‌తో మరొక నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నై జట్టును చూసి నేర్చుకొండని కూడా సలహా ఇస్తున్నారు.

 ఆర్‌సీబీకి సిగ్గుండాలి..

ఆర్‌సీబీకి సిగ్గుండాలి..

‘లోకల్ భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం బాధించింది. ఇంగ్లీష్, కన్నడను ఉపయోగించండి. హిందీ మాత్రం వద్దు.'అని ఇంకొకరు విజ్ఞప్తి చేశారు. ఆర్‌సీబీకి మద్దతునిచ్చే వారిలో 80 శాతం కర్ణాటక వాళ్లేనని, అలాంటిది హిందీ లిరిక్స్ ఎలా వాడుతారని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. వెంటనే కన్నడలో సాంగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హిందీ లిరిక్స్ పెట్టినందుకు ఆర్‌సీబీకి సిగ్గుండాలని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

టైటిలే లక్ష్యంగా..

టైటిలే లక్ష్యంగా..

ఇక ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆర్‌సీబీ అన్ని విధాల సిద్దమైంది. గతంలో కంటే ఈసారి జట్టు సమతూకంగా కనిపిస్తోంది. గత 12 సీజన్లుగా దక్కని టైటిల్‌ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. సెప్టెంబర్ 21న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2020 సీజన్ జర్నీని ప్రారంభించనుంది. మొయిన్ అలీ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి లాంటి స్టార్ ఆల్‌రౌండర్‌లు కూడా ఆర్‌సీబీ జట్టులో ఉన్నారు.

పేస్‌ విభాగంలో క్రిస్ మోరిస్‌, ఉరుసు ఉడాన, డేల్ స్టెయిన్‌లతో పాటు భారత పేసర్లు ఉమేష్ యాదవ్, నవ్‌దీప్‌ సైనీ, మహ్మద్ సిరాజ్‌ అందుబాటులో ఉన్నారు. యూఏఈ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలమన్న అంచనాల నేపథ్యంలో యుజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్ సుందర్‌, ఆడమ్ జంపా, మొయిన్‌ అలీ, పవన్‌ నేగిలతో కూడిన స్పిన్‌ బలగం పటిష్ఠంగా కనిపిస్తోంది. వీళ్లంతా అంచనాలు అందుకుంటే ఆర్‌సీబీ తిరుగులేదు.

ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్ చేరే జట్లు అవే.. ఆర్‌సీబీ, సీఎస్‌కే‌కు నో చాన్స్: గౌతం గంభీర్

Story first published: Friday, September 18, 2020, 13:19 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X