Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2020లో ప్లే ఆఫ్ చేరే జట్లు అవే.. ఆర్‌సీబీ, సీఎస్‌కే‌కు నో చాన్స్: గౌతమ్ గంభీర్

Gautam Gambhir, Aakash Chopra and other experts pick the contenders for IPL 2020 playoffs

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరో 24 గంటల్లో ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవనుంది. డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్, త్రీటైమ్ చాంప్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కరోనా కారణంగా ఈ ధనాధన్ లీగ్ యూఏఈకి తరలినా.. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ గురించి సోషల్ మీడియా కోడై కూస్తుంది.

క్రికెట్ విశ్లేషకులు తమ అంచనాలను, విశ్లేషణలు మొదలుపెట్టారు. యూఏఈ పిచ్‌ల స్వభావం దృష్ట్యా స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, గౌతమ్ గంభీర్, ఇయాన్ బిషప్‌, టామ్ మూడీ, దీప్ దాస్ గుప్తా, సంజయ్ మంజ్రేకర్, అజిత్ అగార్కర్‌లు ఈ సీజన్‌లో ప్లే ఆఫ్ చేరే జట్ల వివరాలను ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో చాట్ షోలో వెల్లడించారు. అయితే వీళ్లంతా ముక్తకంఠంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరుకుంటుందని చెప్పడం విశేషం.

రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగు టైటిళ్లు గెలుచుకుంది. ప్రస్తుత సీజన్‌లో కూడా హాట్ ఫేవరేట్‌గా దిగుతోంది. అయితే ఆ జట్టులో క్వాలిటీ స్పిన్నర్లు లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్‌లు ఉన్నా వారు ఏమేరకు రాణిస్తారో చూడాలి. ఇక టామ్ మూడీ, గౌతమ్ గంభీర్ మినహా మిగతా విశ్లేషకులంతా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ చేరుతుందంటున్నారు.

ఎక్స్‌పర్ట్స్ ప్లే ఆఫ్ అంచనాలు..

గౌతమ్ గంభీర్: 1. ముంబై ఇండియన్స్ 2. సన్‌రైజర్స్ హైదరాబాద్ 3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4. ఢిల్లీ క్యాపిటల్స్/రాజస్థాన్ రాయల్స్

సంజయ్ మంజ్రేకర్ : 1. ముంబై ఇండియన్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్, 3. ఢిల్లీ క్యాపిటల్స్ 4. సన్‌రైజర్స్ హైదరాబాద్

ఇయాన్ బిషప్: 1. ముంబై ఇండియన్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్, 3. ఢిల్లీ క్యాపిటల్స్ 4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

దీప్ దాస్ గుప్తా: 1. ముంబై ఇండియన్స్ 2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 3. చెన్నై సూపర్ కింగ్స్, 4. కోల్‌కతా నైట్ రైడర్స్

టామ్ మూడీ: 1. ఢిల్లీ క్యాపిటల్స్ 2. ముంబై ఇండియన్స్ 3. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4. సన్ రైజర్స్ హైదరాబాద్

అజిత్ అగార్కర్: 1. ముంబై ఇండియన్స్ 2. రాజస్థాన్ రాయల్స్ 3. కోల్‌కతా నైట్ రైడర్స్ 4. చెన్నై సూపర్ కింగ్స్

ఆకాష్ చోప్రా: 1. ఢిల్లీ క్యాపిటల్స్ 2. చెన్నై సూపర్ కింగ్స్ 3. ముంబై ఇండియన్స్ 4. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

Story first published: Friday, September 18, 2020, 12:17 [IST]
Other articles published on Sep 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+