న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ చాంపియన్‌షిప్‌లో గిదేం లెక్క? అంతా తొండి: విలియమ్సన్

Kane Williamson Says World Test Championship points system unfair

వెల్లింగ్టన్: ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా కేటాయిస్తున్న పాయింట్ల లెక్కపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ పాయింట్ల కేటాయింపు ఏ మాత్రం అమోదయోగ్యంగా లేవని అభిప్రాయపడ్డాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో న్యూజిలాండ్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన విలియమ్సన్ ఈ టెస్ట్ చాంపియన్‌షిప్‌పై పెదవి విరిచాడు.

ఇది అన్యాయం..

ఇది అన్యాయం..

రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 60 పాయింట్ల చొప్పున కేటాయిస్తుంటే, అదే ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాచ్‌ గెలిచిన జట్టుకు 24 పాయింట్ల చొప్పున ఇస్తున్నారు. అంటే టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఒక సిరీస్‌ను ఒక జట్టు క్లీన్‌స్వీప్‌ చేస్తే గరిష్టంగా 120 పాయింట్లు సాధిస్తుంది. దీన్నే విలియమ్సన్‌ తప్పుబట్టాడు.

‘టెస్టు చాంపియన్‌షిప్‌ అనేది సరికొత్త ప్రయోగం. అంతవరకూ బాగానే ఉంది. పాయింట్ల పద్ధతి సరిగా లేదు. ఈ చాంపియన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ విధానం సరైనది కాదు. రాబోవు కాలంలో ఒక సవ్యమైన మార్గంలో చాంపియన్‌షిప్‌ నిర్వహించాలంటే మార్గాలను వెతకాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పాయింట్ల విధానమైతే నా దృష్టిలో సరైనది కాదు' అని విలియమ్సన్‌ తెలిపాడు.

స్వ‌యం కృతాప‌రాధ‌ం.. దొంగ‌గా మారిన స్టార్ క్రికెటర్

టెస్టు ఛాంపియన్‌షిప్ అంటే ..?

టెస్టు ఛాంపియన్‌షిప్ అంటే ..?

2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. రెండేళ్ల ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరిగా టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్‌ నెలలో ఫైనల్ జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టెస్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది. ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లని ఐసీసీ కేటాయిస్తుండగా.. మ్యాచ్ సంఖ్య ఆధారంగా వాటిని విభజిస్తారు.

360 పాయింట్లతో రారాజుగా..

360 పాయింట్లతో రారాజుగా..

గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకూ ఏడు టెస్టులాడిన భారత్ జట్టు.. ఏడింటిలోనూ గెలిచి ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ టీమ్.. ఐదు మ్యాచ్‌లాడి ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 60 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే.. భారత్ జట్టు తక్కువ మ్యాచ్‌లు ఉండే సిరీస్‌లని ఆడటం ద్వారా ఎక్కువ పాయింట్లని సాధించగలిగిందనే విమర్శలు ఎదుర్కొంటుంది.

Story first published: Thursday, February 20, 2020, 20:45 [IST]
Other articles published on Feb 20, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X