For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్వ‌యం కృతాప‌రాధ‌ం.. దొంగ‌గా మారిన స్టార్ క్రికెటర్

 Luke Pomersbach currently living in his car and facing theft charges

సిడ్నీ : చెడు వ్యసనాలకు బానిసై బంగారంలాంటి కెరీర్‌ను నాశనం చేసుకున్న ఓ స్టార్ క్రికెటర్ చివరకు దొంగగా మారాడు. ఒకప్పుడు కోట్లు సంపాదించిన అతను ఇప్పుడు కూటికి గతి లేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు.. వరల్డ్ క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్, ఆ త‌ర్వాతి స్థాయి లీగ్ అయిన బిగ్ బాష్ లీగ్‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలుగొందిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్స్‌బ్యాక్.

నాలుగేళ్ల పాటు ఐపీఎల్..

నాలుగేళ్ల పాటు ఐపీఎల్..

ఐపీఎల్‌లో అతను ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా నాలుగేళ్ల‌పాటు ఆడాడు. అయితే చెడు వ్య‌స‌నాలు, తాగుడుకు బానిసైన అతను తన బంగారంలాంటి కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. తాజాగా ఓ దొంగ‌త‌నం కేసులో అరెస్ట్ అయ్యాడు. త్వ‌ర‌లోనే కోర్టులో అతనిపై కేసు విచార‌ణ‌కు రానుంది. ఒక‌ప్పుడు ఐపీఎల్లో ల‌క్ష‌ల డాల‌ర్ల ధ‌ర ప‌లికిన ల్యూక్‌.. తాజా ప‌త‌నం అత‌ని స్వ‌యం కృతాప‌రాధ‌మ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

రూ. 3లక్షల డాలర్లు..

రూ. 3లక్షల డాలర్లు..

ఒకప్పుడు తారాజువ్వలాగా దూసుకొచ్చిన ల్యూక్ .. 2007లో ఆస్ట్రేలియా త‌ర‌పున ఏకైక టీ20 ఆడాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో 7 బంతుల్లోనే 15 ప‌రుగులు చేశాడు. ఆ మరుసటి ఏడాది జ‌రిగిన ఐపీఎల్లో సెల‌క్ట‌య్యాడు. 3 ల‌క్ష‌ల డాల‌ర్ల ధ‌ర‌కు ఐపీఎల్ జ‌ట్టు కింగ్స్ లెవ‌న్ పంజాబ్ అత‌నిని కొనుగోలు చేసింది. 2011 వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ల్యూక్‌ను దక్కించుకుంది. ఇక 2013లో మరోసారి పంజాబ్ తరఫున బరిలోకి దిగిన ల్యూక్.. ఆ తరువాత ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్ 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఆడాడు. 2014‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. దీంతో అతన్ని కెరీర్ ఇక్కడితోనే ముగిసింది.

2008 నుంచి 2013 మధ్య వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అతను మొత్తం 17 మ్యాచ్‌ల్లో 122 ప్లస్ స్ట్రైక్ రేట్‌లో 302 పరుగులు చేశాడు.

తొలి టెస్ట్ ప్రివ్యూ: ఓపెనర్లుగా మయాంక్-పృథ్వీషా.. పంత్‌కు నోచాన్స్.. తుది జట్టు ఇదే!!

అమ్మాయిని వేధించాడని..

అమ్మాయిని వేధించాడని..

2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న సమయంలో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్బంగా ఒక అమెరిక‌న్ యువ‌తిని వేధించాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ల్యూక్‌ను ఆ సీజన్ ఐపీఎల్ నుంచి తొల‌గించారు. ఇక అదే ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచిన ల్యూక్.. తాను ప్రాతినిధ్యం వహించిన బ్రిస్బెన్ హీట్ జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.

అనేక కేసులు.. ఇల్లు కూడా లేని స్థితి..

అనేక కేసులు.. ఇల్లు కూడా లేని స్థితి..

ఇక 2014లో అతను క్రికెట్ నుంచి వైదొలిగాడు. అప్ప‌టి నుంచి పోమ‌ర్స్‌బ్యాచ్‌ ప‌త‌నం వేగంగా సాగింది. ఒక సారి బైకు దొంగ‌త‌నం చేసి క‌ట‌క‌టాల‌పాల‌య్యాడు. ఫుల్లుగా మద్యం సేవించి, డ్రంక్ డ్రైవ్ చేసి పోలీసులకు దొరికిపోయాడు. మ‌రోసారి లిక్క‌ర్ షాప్ నుంచి మ‌ద్యం దొంగిలించి అరెస్ట‌య్యాడు.

ఈక్ర‌మంలో క‌నీసం ఉండ‌టానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఒక కారులో త‌ల దాచుకున్నాడు. తాజాగా దొంగ‌త‌నంలో మ‌రోసారి ల్యూక్ అరెస్ట‌య్యాడు. బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా ప్రాతినిథ్యం వ‌హించిన ల్యూక్ గురించిన తెలిసిన అభిమానులు షాక్‌కు గుర‌య్యారు. ఒక వ్య‌క్తిలో నైతిక విలువలు దిగ‌జారితే ఎంత‌గా ప‌త‌న‌మ‌వుతాడో దానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ పోమర్స్‌బ్యాక్ నిలిచాడని వాపోతున్నారు.

Story first published: Thursday, February 20, 2020, 20:43 [IST]
Other articles published on Feb 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+