న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2003 ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓటమికి అదే కారణం: మాజీ పేసర్

Javagal Srinath recalls India’s 2003 World Cup final loss

న్యూఢిల్లీ: 2003 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనా విషయం తెలిసిందే. ఆ ఓటమి ఇప్పటికి భారత అభిమానులు వేధిస్తుంటోంది. ఓడినా ఆ టోర్నీ అసాంతరం సచిన్ ఆడిన తీరు మాత్రం అభిమానులను ఆకట్టుకుంది. లిటిల్‌మాస్టర్‌ అత్యధిక పరుగులు సాధించడమే కాకుండా 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా ఎంపికయ్యాడు. కానీ కీలక ఫైనల్లో తొలి ఓవర్‌లోనే ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు.

మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఓ మైలురాయిలా ఉండేది..

మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఓ మైలురాయిలా ఉండేది..

ఒకవేళ భారత్ ఆ మ్యాచ్‌లో గెలుచుంటే.. నాటి పేసర్‌ జవగళ్‌ శ్రీనాథ్‌ కెరీర్‌కు ఘన వీడ్కోలు దక్కేది. జోహెనస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఆ టైటిల్ ఫైట్‌లో దుర్భేద్యమైన ఆసీస్ ముందు భారత్‌ చేతులెత్తేసింది. దీంతో మైసూర్ ఎక్స్‌ప్రెస్‌కు ఓ సువర్ణ అవకాశం చేజారింది. తాజాగా శ్రీనాధ్ ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. స్పోర్ట్స్ కీదా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాటి తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించాడు.

కెప్టెన్‌గా కోహ్లీ సాధించిందేమీ లేదు: గంభీర్

రెండింతలు కష్టపడాల్సి ఉండేది..

రెండింతలు కష్టపడాల్సి ఉండేది..

నాటి ఫైనల్లో భారత్‌ గెలవాలని భావిస్తే ప్రతి ఆటగాడు రెండింతలు శ్రమపడాల్సి ఉండేదని శ్రీనాధ్ అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియా 2003 ప్రపంచకప్‌లో గెలిచేది. కానీ.. మేం ఢీకొట్టింది ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టును. అది అప్పటికే వరుస విజయాలతో దూసుకెళుతోంది. దీంతో ఏ జట్టూ దాని దరిదాపుల్లోకి వెళ్లలేకపోయింది. చివరికి మేం ఓడిపోయాం. నేను కూడా ఆ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యా. మేం గనుక ఆ మ్యాచ్‌ గెలుచుంటే నా కెరీర్‌లో అదొక అద్బుత క్షణంగా మిగిలేది. అయితే, మనం అనుకునేవన్నీ జీవితంలో జరుగుతాయని ఆశించలేం. టీమిండియా ఆ మ్యాచ్‌లో గెలవాలని భావిస్తే కొన్ని విషయాలను ప్రత్యేకంగా చేయాల్సి ఉండేది. అత్యుత్తమ జట్టును ఆరోజు ఓడించాలనుకుంటే ప్రతి ఆటగాడూ రెండింతలు కష్టపడాల్సిన అవసరం ఉండేది.'అని శ్రీనాథ్ తెలిపాడు.

తొలుత బ్యాటింగ్ చేస్తే..

తొలుత బ్యాటింగ్ చేస్తే..

ఇక మ్యాచ్‌ అనంతరం ఎక్కడ పొరపాటు చేశామని విశ్లేషించుకున్నామని కూడా తెలిపాడు.‘తొలుత బ్యాటింగ్‌ చేస్తే బాగుండేదా ? అని కూడా అనుకున్నాం. కానీ, అవన్నీ మ్యాచ్‌ తర్వాత వచ్చే ఊహాగానాలే. నేను మాత్రం ఒకటే అనుకుంటా. ఆస్ట్రేలియా బాగా ఆడే జట్టు. అంతకుముందు కూడా అదే జట్టు ప్రపంచకప్‌ గెలిచింది. మేమంతా మా శక్తిసామర్థ్యాలకు రెండింతలు కష్టపడాల్సిందని అనుకుంటా. అలా అయినా మేం గెలిచేవాళ్లమేమో' అని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు.

చిత్తుగా ఓడిన భారత్..

చిత్తుగా ఓడిన భారత్..

నాటి ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 50 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. రీకీ పాంటింగ్‌(140), మార్టిన్(88) చెలరేగడంతో ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది. వారి ధాటికి జహీర్‌ ఖాన్(0/67), శ్రీనాథ్‌(0/87), నెహ్రా (0/57) దారుణంగా విఫలమయ్యారు. భజ్జీ మాత్రం (2/49) ఫర్వాలేదనిపించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. సచిన్‌(4) తొలి ఓవర్‌లోనే విఫలమయ్యాడు. సెహ్వాగ్‌(82) ఒంటరి పోరాటం చేసినా మరోవైపు నుంచి అతడికి సహకారం లభించలేదు. దీంతో భారత్‌ 125 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.

సుశాంత్ హెలికాప్టర్ షాట్ చూసి ధోనీ ఏమన్నాడో తెలుసా?

Story first published: Monday, June 15, 2020, 18:31 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X