
విరాట్ సాధించాల్సింది బోలెడంత..
ప్రపంచకప్ టైటిల్ గెలవకపోతే ఎంతటి అద్భుత ఆటగాడి కెరీర్‌కైనా అర్థం ఉండదన్నాడు. ‘వ్యక్తిగత రికార్డులతో ఒరిగేదేం లేదు. క్రికెట్ అనేది టీమ్ స్పోర్ట్. బ్రియాన్ లారా వ్యక్తిగతంగా చాలా పరుగులు చేశాడు. జాక్వస్ కల్లీస్ ఎలాంటి ఐసీసీ ట్రోఫీలను అందుకోలేదు. వారిలానే మిగిలిపోవాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే విరాట్ కూడా ఇప్పటి వరకు సాధించిందేమీ లేదు. అతను అందుకోవాల్సిన విజయాలు చాలా ఉన్నాయి. 'అని గంభీర్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగా ఎన్ని పరుగులు చేసినా.. తన దృష్టిలో ప్రపంచకప్ గెలవకపోతే ఆ కెరీర్‌కు అర్థమే లేదని ఈ మాజీ ఓపెనర్ తెలిపాడు.
బీసీసీఐ సస్పెన్షన్‌తో స్వార్థంగా ఆలోచించా.. వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడా: కేఎల్ రాహుల్

రెండు ఫైనల్లో కీలక పాత్ర..
ఇక భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వరల్డ్‌కప్‌లలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 75 పరుగులతో టీ20 ప్రపంచకప్, 97 పరుగుల అసాధారణ ఆటతో 2011 ప్రపంచకప్‌లో రాణించాడు. కానీ అతనికి రావాల్సిన గుర్తింపు దక్కలేదు. ఇక కోహ్లీ భారత్ గెలిచిన 2011 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ జట్లలో సభ్యుడు. ఈ రెండు టోర్నీలు ధోనీ సారథ్యంలోనే భారత్ గెలవగా.. కోహ్లీ కెప్టెన్సీలో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమిపాలైంది.

ఒత్తిడి తట్టుకునే శక్తి లేదు.
ఉత్తమ ఆటగాడికి, అత్యుత్తమ క్రికెటర్‌కు మధ్య ఉన్న తేడా క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ఆడుతాడన్నదానిపైనే ఆధారపడి ఉంటుదని గంభీర్ తెలిపాడు. ఒత్తిడిని తట్టుకునే విషయంలో మెరుగవ్వనంత వరకూ టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ చాంపియన్స్ కాలేరన్నాడు.‘కీలకమైన మ్యాచ్‌ల్లో ఎలా ఆడతావన్నదాన్ని బట్టే జట్టులో నువ్వు మంచి ఆటగాడివా? అత్యద్భుతమైన ప్లేయరా? అనేది తెలుస్తుంది. ఇతర జట్లు ఒత్తిడిని అధిగమించిన విధంగా మనోళ్లు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మనం ఆడిన సెమీఫైనల్స్, ఫైనల్స్‌ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

మానసిక దృఢత్వం లేకనే..
లీగ్ స్టేజ్‌లో బాగా ఆడి, నాకౌట్స్‌లో తడబడుతున్నారు. మానసిక దృఢత్వం లేకపోవడమే దానికి కారణం. మన జట్టులో అన్నీ ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. వరల్డ్ చాంపియన్స్ అయ్యే సత్తా ఉందని అంటున్నాం. కానీ మైదానంలో సత్తా చాటనంతవరకూ వరల్డ్ చాంపియన్స్ అనలేరు'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications

ధోనీ బయోపిక్ హీరో ఆత్మహత్య.. శోకసంద్రంలో క్రికెట్ లోకం










