న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సుశాంత్ హెలికాప్టర్ షాట్ చూసి ధోనీ ఏమన్నాడో తెలుసా?

When MS Dhoni saw Sushant copy the helicopter shot and what he say?

న్యూఢిల్లీ: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ బాలీవుడ్‌ నటుడే అయినా.. క్రికెట్‌ చూసే ప్రతీ ఒక్కరికీ అతనో 'బాలీవుడ్‌ ఎంఎస్‌ ధోనీ'. భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్‌ ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో మహి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అతను క్రికెట్‌ వర్గాలకు సుపరిచితుడయ్యాడు. డిప్రెషన్‌ కారణంగా 34 ఏళ్ల సుశాంత్‌ ముంబైలోని తన ఇంట్లో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో క్రికెట్‌ వర్గాలు విస్తుపోయాయి.

పలువురు క్రికెటర్లు సుశాంత్‌ విషాదాంతంపై విస్మయానికి లోనయ్యారు. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయావు మిత్రమా అంటూనే... ఈ వార్త అబద్ధమైతే బావుండంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు. 'గాన్‌ టూ సూన్‌'..అంటూ ట్వీట్ చేశారు.

రంజీలో ఆడుతాడన్నాడు..v

రంజీలో ఆడుతాడన్నాడు..v

అయితే ధోనీ పాత్రలో అదరగొట్టిన సుశాంత్‌తో గడిపిన క్షణాలను పులువురు క్రికెటర్లు, అభిమానులను నెమరవేసుకుంటున్నారు. ఇక ధోనీ బయోపిక మూవీ ప్రొడ్యూసర్, అతని బిజినెస్ మేనేజర్ అరుణ్ పాండే సైతం సుశాంత్‌తో ఉన్న జ్ఙాపకలును గుర్తు చేసుకున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్ హెలికాప్టర్ షాట్ చూసినప్పుడు ధోనీ ఏమన్నాడనే విషయాన్ని వెల్లడించాడు. అచ్చం తనలానే ఆడిన ఆ షాట్‌ను చూసి ధోనీ ఆశ్చర్యపోయాడని, సుశాంత్ రంజీ క్రికెట్‌లో ఆడగలడని చెప్పాడని పాండే గుర్తు చేసుకున్నాడు.

ఆ చిరునవ్వు ఇంకా గుర్తుంది..

ఆ చిరునవ్వు ఇంకా గుర్తుంది..

‘ధోనీ ప్రశంసలతో సుశాంత్ ముఖంలో వచ్చిన చిరునవ్వు నాకింకా గుర్తుంది. హెలికాప్టర్ షాట్ ట్రైనింగ్ క్లిప్ చూసిన ధోనీ..‘హే అచ్చం నాలానే ఆడావ్.. నువ్వు రంజీ క్రికెట్ కూడా ఆడగలవు'అని సుశాంత్‌ను ప్రశంసించాడు.'అని అరుణ్ పాండే తెలిపాడు. ఇక సుశాంత్ అంకిత భావం కలిగిన నటుడని అరుణ్ పాండే కొనియాడాడు. ధోనీ శైలిని అనుకరించేందుకు అతను చాలా కష్టపడ్డాడని, ఒకరోజు మొత్తం మహీని విసిగించాడని చెప్పాడు.

ధోనీని చికాకు పెట్టాడు..

ధోనీని చికాకు పెట్టాడు..

‘ధోనీతో అతను చాలాసేపు గడిపాడు. అనేక ప్రశ్నలతో విసిగించాడు. అతని సమాధానాలకు సంతృప్తి లేకుంటే మళ్లీ మళ్లీ అడిగాడు. దీంతో చికాకు గురైన ధోనీ..‘అరే భాయ్ అడిగిందే మళ్లీ అడుగుతావేంది'అని మందలించాడు. దీనికి సుశాంత్ ‘బాయ్‌సాబ్.. ప్రతీ ఒక్కరు నాలో నిన్ను చూస్తారు. ప్రతీ విషయంలో నేను నీలానే ఉండాలి'అని బదిలిచ్చాడు. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి'అని పాండే నాటి క్షణాలను నెమరువేసుకున్నాడు.

షాక్‌లో ధోనీ కుటుంబం..

ఇక సుశాంత్ మరణంపై యావత్ క్రికెట్ ప్రపంచం స్పందించినా.. ధోనీ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు. చాలా రోజులుగా అతను సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నా.. ధోనీ సతమణి సాక్షిసింగ్ అతనికి సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తుంది. కానీ సుశాంత్ అకాల మరణంపై ఆమె కూడా స్పందించలేదు. దీంతో అభిమానులు ధోనీ స్పందన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గూగుల్‌లో సెర్చ్ చేస్తూ.. అతిని సోషల్ మీడియా అకౌంట్లను చెక్‌చేస్తున్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్యతో ధోనీ కుటుంబం మొత్తం షాక్‌కు గురైందని, ఈ ఘటనను వారు నమ్మలేకపోతున్నారని తెలిపాడు. ఆ ఆత్మహత్య గురించి ధోనీ చెబితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలిపాడు. వారు తీవ్రంగా బాధపడుతున్నారని చెప్పుకొచ్చాడు.

200 రోజులు ప్రాక్టీస్

200 రోజులు ప్రాక్టీస్

‘ఎం.ఎస్‌. ధోనీ'తో సుశాంత్‌ పాపులార్టీ వచ్చిందనేది వాస్తవం. నిజానికి సుశాంత్‌కి క్రికెట్‌ ఆడటం రాదు. ఈ సినిమా కోసమే నేర్చుకున్నాడు. ఈ సినిమాలో హెలికాప్టర్‌ షాట్‌ కొట్టే సీన్‌ పర్ఫెక్ట్‌గా రావడం కోసం దాదాపు 200 రోజులు సాధన చేశాడు. ధోనీగా మారిపోవడం కోసం దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకుని, ఈ సినిమా చేశాడు, సుశాంత్‌ కేటాయించిన సమయం, పడిన కష్టం వృథా పోలేదు. ‘అద్భుతంగా నటించాడు' అని అందరూ ప్రశంసించారు. యావత్ భారత ప్రజల మన్ననలను అందుకున్నాడు.

కెప్టెన్‌గా కోహ్లీ సాధించిందేమీ లేదు: గంభీర్

Story first published: Monday, June 15, 2020, 14:56 [IST]
Other articles published on Jun 15, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X