న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైజాగ్ నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తోన్న ఇషాంత్ శర్మ

India vs West Indies, 1st ODI: Ishant Sharma Bowls in India Nets, Recovery on Track
Ishant Sharma bowls at India nets, recovery on track

హైదరాబాద్: సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు సందర్భంగా భారత ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో అతను వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ప్రస్తుతానికి అతను తిరిగి గాయం నుంచి కోలుకుంటున్నట్లు బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పేర్కొంది. వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా విశాఖలో టీమిండియాతో కలిసి ఇషాంత్‌ శర్మ కూడా నెట్స్‌లో చెమటోడ్చడం మరో విశేషం. . దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పంచుకుంది.

కొన్ని రంజీ మ్యాచ్‌ల్లోనూ ఆడనున్నట్లు బీసీసీఐ

కొన్ని రంజీ మ్యాచ్‌ల్లోనూ ఆడనున్నట్లు బీసీసీఐ

దీనికితోడు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి అతను త్వరలో కొన్ని రంజీ మ్యాచ్‌ల్లోనూ ఆడనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలిసింది. వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా టీమిండియాతో కలిసి ఇషాంత్‌ కూడా నెట్స్‌లో చెమటోడ్చుతున్న దృశ్యాలకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ట్విటర్‌ ద్వారా షేర్ చేసింది.

వైజాగ్ అంటే చాలా ఇష్టం: కోహ్లీ

ఆస్ట్రేలియా పర్యటనలో 10 మ్యాచ్‌లు

ఆస్ట్రేలియా పర్యటనలో 10 మ్యాచ్‌లు

వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్లు మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లతో పాటు 4 టెస్టు మ్యాచ్‌ల్లో తలపడతాయి. ఈలోగా ఇషాంత్‌ శర్మ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు.

పేస్‌బౌలింగ్‌ దళానికి అదనపు బలం

వచ్చే నెలలోగా ఇషాంత్‌ శర్మ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధిస్తే టెస్టు సిరీస్‌లో టీమిండియా పేస్‌బౌలింగ్‌ దళానికి అదనపు బలం వచ్చి చేరినట్లే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లపై ఇషాంత్‌ తన బౌలింగ్‌తో కచ్చితంగా ప్రభావం చూపుతాడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

వెస్టిండీస్‌తో తలపడనున్న భారత జట్టు ఇదే

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌

1
44267
Story first published: Wednesday, October 24, 2018, 9:06 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X