IPL 2026: కేకేఆర్‌లోకి వరల్డ్ కప్ బెస్ట్ బౌలర్!
ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ జట్టులోకి జింబాబ్వే పేస్ సెన్సేషన్ బ్లెస్సింగ్ ముజరబానిని తీసుకుంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ స్థానాన్ని ముజరబానితో భర్తీ చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బ్లెస్సింగ్ ముజరబానికి స్వాగతం అంటు ఒక పోస్ట్ చేసిన కేకేఆర్.. మరో పోస్ట్‌లో టీ20 ప్రపంచకప్‌లో అతని సంచలన బౌలింగ్ వీడియోను షేర్ చేసింది.
6 అడుగుల 8 అంగుళాల పొడవున్న ముజరబాని జింబాబ్వే అత్యుత్తమ బౌలరని, తన హైట్ ద్వారా లభించే బౌన్స్‌తో వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉందని కేకేఆర్ తమ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ఫ్రాంచైజీ లీగ్స్‌ల్లోని ఆయన అనుభవం కేకేఆర్ పేస్ విభాగాన్ని బలోపేతం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన దాడుల నేపథ్యంలో భారత్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. బంగ్లాదేశ్ క్రికెటర్లను ఐపీఎల్‌లోకి అనుమతించవద్దంటూ పలువురు రాజకీయ నాయకులు, నెటిజన్లు అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. దాంతో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ టీమ్ నుంచి తొలగించింది.
అతని ఉద్వాసనతో ఖాళీగా ఉండిపోయిన స్థానాన్ని ముజరబానితో కేకేఆర్ భర్తీ చేసింది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ముజరబాని సంచలన ప్రదర్శన కనబర్చాడు. 13 వికెట్లు తీసి జింబాబ్వే సూపర్-8కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఓవరాల్‌గా ఇప్పటి వరకు 80 అంతర్జాతీయ టీ20ల్లో 90 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ఆఫర్‌తో ముజరబాని పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) కాంట్రాక్ట్‌ను వదులుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications