For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Vanshika Chadha: రేపే కుల్దీప్ యాదవ్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే?

టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశిక చద్దాను శనివారం పెళ్లి చేసుకోనున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో వీరి వివాహం ఘనంగా జరగనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజయానంతరమే కుల్దీప్ యాదవ్ పెళ్లి వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. అతని కాబోయే సతీమణి గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.

వంశిక చద్దా ఎవరు?

వంశిక చద్దా, కుల్దీప్ యాదవ్ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ కాన్పూర్‌కు చెందినవారే. పాఠశాల స్థాయి నుంచి ఈ ఇద్దరి మధ్య స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్‌లో వంశిక కుటుంబం నివసిస్తుండగా.. కుల్దీప్ యాదవ్ కుటుంబం కాన్పూర్‌లోని లాల్ బంగ్లా ప్రాంతంలో ఉంటుంది. కాలక్రమేణా వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కుల్దీప్ యాదవ్‌కు మంచి గుర్తింపు లభించినప్పటికీ, వంశిక మాత్రం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా సాదాసీదా జీవితాన్నే గడుపుతున్నారు.

Who is Vanshika Chadha Meet the LIC Professional Set to Marry Cricketer Kuldeep Yadav

ఎల్‌ఐసీ ఉద్యోగి

వంశిక చద్దా.. భారత ప్రముఖ ఆర్థిక సంస్థ అయిన న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో పనిచేస్తున్నారు. ఈ సంస్థలో మేనేజర్ లేదా అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో ఆమె పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల సతీమణుల్లా కాకుండా.. వంశిక తనకంటూ ఒక ప్రత్యేకమైన వృత్తిని ఎంచుకున్నారు. ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో పాటు బహిరంగ వేడుకల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తారు.

కుల్దీప్ యాదవ్ క్రికెట్ విజయాల వల్ల నిరంతరం వార్తల్లో నిలుస్తుంటే.. వంశిక మాత్రం ప్రైవేట్ లైఫ్ గడపడానికే మొగ్గు చూపుతున్నారు. కుల్దీప్ క్రికెట్ కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో వంశిక ఎంతో మద్దతుగా నిలిచిందని వారి సన్నిహితులు చెబుతుంటారు. ఆమె వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉండటమే ఆమెపై ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచింది.

కుల్దీప్ వివాహ వేడుకల వివరాలు..

నేడు(శుక్రవారం) హల్దీ, మెహందీ వేడుకలు జరగనున్నాయి. శనివారం(మార్చి 14) ముస్సోరిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం జరగనుంది. పలువురు భారత క్రికెటర్లు ఈ వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. మార్చి 17న లక్నోలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు.

Story first published: Friday, March 13, 2026, 17:54 [IST]
Other articles published on Mar 13, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+