న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైజాగ్ అంటే చాలా ఇష్టం: కోహ్లీ

India vs Westindies 2 Odi : Virat Kohli Shares A photo In Twitter
India vs West Indies: Virat Kohli mesmerised by Vizags beauty ahead of 2nd T20I

హైదరాబాద్: వైజాగ్ (విశాఖపట్నం) అద్భుతమైన ప్రదేశమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ నగరానికి రావడాన్ని తాను అమితంగా ఇష్టపడతానని తెలిపాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే కోసం ఇప్పటికే వైజాగ్ చేరుకున్న విరాట్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. వెస్టిండీస్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా విశాఖపట్నం వేదికగా బుధవారం (అక్టోబర్ 24)న రెండో వన్డేలో తలపడనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సోమవారమే విశాఖకు చేరుకుంది.

View this post on Instagram

What a stunning place. Love coming to vizag ✌️👍

A post shared by Virat Kohli (@virat.kohli) on

టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం

టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం

విశాఖ స్టేడియం టీమిండియాకు అచ్చొచ్చిన మైదానం కావడం విశేషం. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా విశాఖ అంటే ఎంతో ఇష్టం. తన తొలి సెంచరీని ఇదే మైదానంలో చేయడం విశేషం. ఈ నేపథ్యంలో రెండో వన్డే కోసం అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఎదురుచూస్తూ ఉన్నారు.

అవగాహన కల్పించేందుకు భూటాన్ వెళ్లిన సచిన్ దంపతులు

కుల్దీప్‌ పేరును చేర్చి కొత్త మార్పు

కుల్దీప్‌ పేరును చేర్చి కొత్త మార్పు

రెండో వన్డే కోసం 12 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. తొలి వన్డే ఆడిన జట్టుతో పాటుగా.. అదనంగా యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పేరును చేర్చి కొత్త మార్పును చేసింది. ముగ్గురు పేసర్లతో కోహ్లిసేన బరిలోకి దిగితే కుల్దీప్‌ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తుంది.

ఇషాంత్‌ కూడా నెట్స్‌లో చెమటోడ్చడం

విశాఖలో టీమిండియాతో కలిసి ఇషాంత్‌ శర్మ కూడా నెట్స్‌లో చెమటోడ్చడం మరో విశేషం. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు సందర్భంగా ఈ ఫాస్ట్‌ బౌలర్‌ గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. దీంతో లంబూ.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నట్లు బీసీసీఐ ట్విటర్‌ ద్వారా పేర్కొంది.

 టీమిండియా ఇదే జోరు కొనసాగించాలని

టీమిండియా ఇదే జోరు కొనసాగించాలని

గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో భారత్‌ అద్భుత విజయాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెరో సెంచరీతో చెలరేగిపోవడంతో.. వెస్టిండీస్‌ నిర్దేశించిన 323 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా 42.1 ఓవర్లలోనే చేధించింది. విశాఖ స్టేడియంలో టీమిండియా ఇదే జోరు కొనసాగించాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

1
44267
Story first published: Wednesday, October 24, 2018, 8:51 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X