ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా ప్లేయర్ హర్షిత్ రాణా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు సౌతాఫ్రికాతో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో హర్షిత్ రాణా మోకాలికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే.

దాంతో చివరి నిమిషంలో నితీష్ రాణా.. టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫిబ్రవరి 9న ముంబైలో హర్షిత్ రాణా మోకాలికి సర్జరీ జరిగింది. ఈ సర్జరీ కారణంగా అతను కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరంగా ఉండాలని హర్షిత్ రాణా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినా.. హర్షిత్ రాణా స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయడంపై కేకేఆర్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

హర్షిత్ రాణా గైర్హాజరీ కేకేఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బనే. ఐపీఎల్ 2024 సీజన్‌లో కేకేఆర్ విజేతగా నిలవడంలో హర్షిత్ రాణా కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో అతను 19 వికెట్లు పడగొట్టి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు అతన్ని కేకేఆర్ రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోగా.. 13 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసాడు. ఇప్పటివరకైతే కేకేఆర్ హర్షిత్ రాణా ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేయలేదు. ఆకాశ్ దీప్, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగిలో ఒకర్ని ఎంచుకోనుంది.
'దురదృష్టవశాత్తు హర్షిత్ రాణా.. ఈ సీజన్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాశ్ దీప్‌లో ఒకరికి అతని స్థానంలో అవకాశం దక్కనుంది. రిప్లేస్‌మెంట్‌ను ఇంకా నిర్ణయించలేదు.'అని కేకేఆర్ వర్గాలు మీడియాకు తెలిపాయి. టీ20 ప్రపంచకప్ 2026లో గాయపడిన మతీష పతీరణ ఆడటంపై కూడా స్పష్టత లేదు. ముస్తాఫిజుర్ స్థానాన్ని కేకేఆర్ బ్లెస్సింగ్ ముజరబానితో భర్తీ చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ శుక్రవారం వెల్లడించింది.
