Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కావ్య పాపనే కాదు.. ఇతర IPL ఫ్రాంచైజీల్లో కూడా పాక్ ఆటగాళ్లు!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌‌తో ఒప్పందం కుదుర్చుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ వేదికగా జరిగే హండ్రెడ్ లీగ్ కోసం జరిగిన వేలంలో అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు రూ.2.34 కోట్ల(1,90,000 పౌండ్ల) భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సన్‌రైజర్స్ యాజమాన్యంపై విమర్శలు గుప్పించారు. టీమ్ ఓనర్ కావ్య మారన్‌‌పై మండిపడుతున్నారు.

మరోవైపు తమ నిర్ణయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ హెడ్ కోచ్ డేనియల్ వెటోరి సమర్థించుకోవడం అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. అబ్రార్ అహ్మద్‌ను ఎంపిక చేయడం తమ వ్యూహాత్మక నిర్ణయమని.. ఇందులో ఎలాంటి వివాదాలకు తావులేదని వెటోరి స్పష్టం చేశాడు.

'అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా స్థానిక డొమెస్టిక్ ప్లేయర్లు అబ్రార్ శైలిని అంత తేలికగా అంచనా వేయలేరు. వేలంలో మాకు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ.. అతనే మా మొదటి ప్రాధాన్యత'అని వేటోరి పేర్కొన్నాడు.

Beyond Abrar Ahmed Full List of Pakistan Cricketers in Indian-Owned Global T20 Teams

ఇదే తొలిసారి కాదు..

అయితే పాకిస్థాన్ ఆటగాళ్లను భారత్‌కు చెందిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కాదు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో వివాదాస్పద బౌలింగ్ శైలితో తీవ్ర చర్చనీయాంశమై ఉస్మాన్ తారిక్‌ను కేకేఆర్‌కు చెందిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. షారుఖ్ ఖాన్, జుహి చావ్లా, జై మెహ్‌తా కేకేఆర్ యజమానులుగా ఉన్న సంగతి తెలిసిందే.

ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు కూడా వారిదే. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న మహమ్మద్ అమీర్ కూడా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మేజర్ క్రికెట్ లీగ్ 2025 కోసం పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సీటల్ ఓర్కాస్ కొనుగోలు చేసింది. ఐఎల్ టీ20 లీగ్‌లో కేకేఆర్‌కే చెందిన అబు దాబి జట్టు కూడా ఇమాద్ వసీం ఆడాడు.

సన్‌రైజర్స్‌ది 51 శాతం వాటానే..

ది హండ్రెడ్ లీగ్‌లో యార్క్‌షైర్ నుంచి సన్‌టీవీ 51 శాతం వాటను కొనుగోలు చేయగా.. 49 శాతం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తీసుకుంది. దాంతో నార్తెర్న్ సూపర్ ఛార్జెర్స్ జట్టు కాస్త సన్‌రైజర్స్ లీడ్స్‌గా మారిపోయింది. ది హండ్రెడ్ వేలంలో పాకిస్థాన్ నుంచి ఉస్మాన్ తారిక్, అబ్రార్ అహ్మద్ అమ్ముడవ్వగా.. షాదాబ్ ఖాన్, హ్యారీస్ రౌఫ్, సైమ్ అయూబ్‌లకు నిరాశే ఎదురైంది.

సన్‌రైజర్స్ లీడ్స్‌: నాథన్ ఎల్లిస్, మిచెల్ మార్ష్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, అబ్రార్ అహ్మద్, బెన్నీ హోవెల్, డానియల్ లారెన్స్, టామ్ లావ్స్, మాథ్యూ పాట్స్, టామ్ అల్సోప్, జాక్ క్రాలీ, ర్యాన్ రికెల్టన్, లియామ్ ప్యాటర్సన్-వైట్, ఎడ్ బర్నార్డ్, రీస్ టోప్లీ.

Story first published: Friday, March 13, 2026, 18:34 [IST]
Other articles published on Mar 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+