న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేనే గనుక సెంచరీ చేస్తే.. కేఎల్ రాహుల్ బాల్కనీ నుంచి దూకేవాడు: ఇషాంత్ శర్మ

Ishant recalls KLs reaction after his maiden Test 50

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ పేసర్ ఇషాంత్ శర్మకు బంతితో పాటు బ్యాట్‌తో మెరిసే సత్తా ఉందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్యాట్స్‌మన్ చేతులెత్తేసిన వేళ.. క్రీజులో ఎక్కువ సేపు ఉంటూ సహచర బ్యాట్స్‌మన్‌కు మద్దతుగా నిలుస్తూ.. తన జిడ్డు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్షగా నిలవడం ఇషాంత్‌కు బాగా తెలుసు.

ఇలానే 2010లో ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 101 బంతులు ఎదుర్కొని 31 పరుగులతో చివరి వికెట్‌తో నెగ్గిన భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇషాంత్ బ్యాటింగ్ స్కిల్స్ గురించి తెలిసిన కోహ్లీ సేన కూడా అవసరమైనప్పుడల్లా అతని సేవలను ఉపయోగించుకుంది. ఇక గతేడాది వెస్టిండీస్ గడ్డపై జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఇషాంత్ తన ఫస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. కింగ్‌స్టన్ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు.

ఇషాంత్ చేతిలో చచ్చాంపో..

ఇషాంత్ చేతిలో చచ్చాంపో..

అయితే ఇటీవల బీసీసీఐ టీవీ నిర్వహించిన ఓపెన్‌ నెట్స్‌ విత్‌ మయాంక్‌ కార్యక్రమంలో ఇషాంత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. మయాంక్ అంగర్వాల్‌తో మాట్లాడుతూ.. తన హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ రియాక్షన్ ఎలా ఉందో గుర్తు చేసుకున్నాడు. ‘మయాంక్.. అందరి రియాక్షన్ మరిచిపో.. నేను హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కేఎల్ రాహుల్‌ ఫీలింగ్ ఏంటో మాత్రమే అడుగు.'అని ఇషాంత్.. మయాంక్‌ను సూచించాడు. దీనికి మాయాంక్ బదులిస్తూ..‘నువ్వు గనుక ఆ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే బాల్కనీ నుంచి దూకాలనుకున్నాం. కేఎల్ నీకిచ్చిన చాలెంజ్‌ను నువ్వు అధిగమించడంతో.. ఈ రోజు ఇషాంత్ భాయ్ చేతిలో చచ్చాంపో'అని రాహుల్ అన్నాడని ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ గుర్తు చేసుకున్నాడు.

ఊరి క్రికెట్ డీఆర్ఎస్ చూశారా? కడుపుబ్బా నువ్వుతారు..!

బ్రో..నువ్వు హాఫ్ సెంచరీ చేసావని తెలుసు..

బ్రో..నువ్వు హాఫ్ సెంచరీ చేసావని తెలుసు..

ఇక ఇషాంత్ మాట్లాడుతూ..‘ఆ మ్యాచ్ కేఎల్ 25-26 పరుగులు(చేసింది 13 మాత్రమే) చేశాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చి‘కొడుకా.. నువ్వు నాకన్నా ఎక్కువ పరుగులు చేస్తే.. నేను బౌలింగ్ చేస్తా.. నువ్వు బ్యాటింగ్ చేయ్ అని సవాల్ విసిరాడు. నేను హాఫ్ సెంచరీ చేయగానే.. నేను అతనికి కొన్ని బ్యాటింగ్ సూచనలు చేశాను. దీనికి అతను ‘ఆపండి బ్రో.. నువ్వు హాఫ్ సెంచరీ చేశావని తెలుసు. ఇప్పుడు నన్ను చంపుక తినకు'అంటూ నాకు దూరంగా వెళ్లిపోయాడని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

స్మిత్‌ను గేలిచేయడం..

స్మిత్‌ను గేలిచేయడం..

2017లో బెంగళూరులో ఆసీస్‌తో జరిగిన టెస్టులో స్మిత్‌ను తన ముఖ కవలికల ద్వారా ఇషాంత్ గేలి చేశాడు. ఇది క్రికెట్‌ అభిమానుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. స్మిత్‌ను పదే పదే ఇలా స్లెడ్జ్‌ చేస్తూ ఇషాంత్‌ శర్మ పైచేయి సాధించే యత్నం చేశాడు. లంబూ అలా గేలి చేయడం, కోహ్లీ పగలబడి నవ్వడం అప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. దీనిపై మయాంక్‌తో స్పందించిన ఇషాంత్.. అలా గేలి చేయడం తమ ప్రణాళికలో భాగమేనని తెలిపాడు.

‘అది మా ప్రణాళికలో భాగమే. స్మిత్‌ను క్రీజ్‌లో కుదురకోనీయకుండా చేయాలంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనేది ప్లాన్‌. అది ఓ హోరాహోరి మ్యాచ్. బ్యాట్స్‌మన్‌ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అందరూ ఏమి చేయాలని చూస్తారో.. నేను అదే చేశా. స్మిత్‌ చాలాసార్లు బౌలర్లను విసిగిస్తాడు. క్రీజ్‌లో కుదురుకుంటే పరుగులు చేసుకుంటూ పోతాడు. స్మిత్‌ను సాధ్యమైనంత త్వరగా ఔట్ చేస్తే అప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది. కేవలం అతని ఏకాగ్రతను దెబ్బతీసి అసౌకర్యానికి గురి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నా. ఇక విరాట్‌ కోహ్లికి దూకుడు ఎక్కువ. చాలా ఇష్టపడతాడు. ఇలా చేయొద్దని ఎప్పుడు చెప్పడు. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో అది చెయ్యమంటాడు. కానీ నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకోమని మాత్రమే చెబుతాడు' అని ఇషాంత్ చెప్పుకొచ్చాడు.

జహీర్ షూస్‌తో తొలి వన్డే ఆడా..

జహీర్ షూస్‌తో తొలి వన్డే ఆడా..

తన అరంగేట్ర వన్డే మ్యాచ్‌లో జహీర్ ఖాన్ షూస్ వేసుకుని బరిలోకి దిగానని ఇషాంత్ గుర్తు చేసుకున్నాడు. ‘మ్యాచ్ ముందు రోజు అందరూ ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఓ పక్కన నిలబడి ఉన్నా. నువ్వు ఎందుకు బౌలింగ్ చేయడం లేదని రాహుల్ ద్రవిడ్ నన్ను ప్రశ్నించాడు. నేను భయంతో నీళ్లు నములుతుంటే ఏంటి అని మళ్లీ అడిగాడు. రాహుల్ బాయ్ నా బ్యాగేజ్ ఇంకా రాలేదని బదులిచ్చా. అయితే ఏంటని ఎదురు ప్రశ్నవేశాడు. నేను నా బ్యాగ్ ప్లైట్ వాడికి ఇచ్చా అది నాకు ఇంకా అందలేదు. అలాగైతే రేపు మ్యాచ్ ఎలా ఆడతావని ద్రవిడ్ ప్రశ్నించాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చివరకు జహీర్ ఖాన్‌ను అడిగి షూస్ తీసుకొని తొలి వన్డే ఆడా'అని లంబూ చెప్పుకొచ్చాడు.

మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్‌ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Story first published: Monday, June 1, 2020, 16:10 [IST]
Other articles published on Jun 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X