మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే అంటూ బోల్డ్ పిక్ షేర్ చేసిన షమీ వైఫ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!

కోల్‌కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్ మరో బోల్డ్‌పిక్‌తో వార్తల్లో నిలిచింది. రెండేళ్ల క్రితమే షమీపై సంచలన ఆరోపణలు చేసి అతనికి దూరంగా ఉంటున్న ఆమె.. ఈ మధ్య హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతుంది. ఇక ఈ తరహా ట్రోలింగ్ ఆమెకు కొత్తకాదు.
షమీతో తన వైవాహిక జీవితం సాఫిగా సాగుతున్న రోజుల్లో కూడా మతం పేరిట ఆమె తీవ్ర ట్రోలింగ్‌కు గురైంది. ఇక షమీతో విడిపోయిన అనంతరం తన మోడలింగ్ కెరీర్‌పై దృష్టి పెట్టిన హసీన్.. అందులో భాగంగా కొంత ఎక్స్‌పోజింగ్‌తో తన ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఇది నచ్చని షమీ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌కు ఏ మాత్రం బెదరని హసీన్ వారికి అదే తరహాలో బదులిస్తుంది. మరిన్నీ వీడియోలతో వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలను క్యాప్షన్‌గా పేర్కొంటుంది.

మీతో ఉన్నంత కాలం పతివ్రతను..
తాజాగా ఫ్యాన్స్, మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ ఆమె షేర్ చేసిన బోల్డ్ పిక్ తీవ్ర దుమారాన్ని రేపుతుంది. వారి సంసారా జీవితం సాఫిగా సాగిన నాటి ఆ ఫొటోలో మహ్మద్ షమీతో హసీన్ నగ్నంగా ఫోజిచ్చింది. దీనికి ‘నీతో ఉన్నంత కాలం నీ అభిమానులందరికీ నేను స్వచ్చమైన వ్యక్తిని. పతివ్రతను. కానీ మీతో విడిపోగానే అపవిత్రురాలిని అయిపోయాను. ఈ మొసలి కన్నీళ్లు కొన్నాళ్లే. మోడల్ హసీన్ జహాన్‌తో క్రికెటర్ మహమ్మద్ షమీ' అని క్యాప్షన్‌గా రాసుకొచ్చింది.

సన్నీలియోన్ మించిపోయావ్..
ఈ ఫొటోపై అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హాసిన్ జహాన్‌పై మండిపడుతున్నారు. రాయలేని పదాలతో బూతులు తిడుతున్నారు. ఒకప్పటి పోర్న్ స్టార్, బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌ను మించిపోయావని కామెంట్ చేస్తున్నారు. మతాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. షమీని వదిలేలా లేదని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘మతం, భర్తపై గౌరవంలేని నీవు వెంటనే అతనికి విడాకులు ఇవ్వాలి'అని డిమాండ్ చేస్తున్నారు.

షమీపై సంచలన ఆరోపణలు..
ఇక రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హసీన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

చచ్చిపోవాలనుకున్నా..
ఇటీవల రోహిత్‌తో ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని షమీ ఆవేదనకు గురైన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, ప్రతీ విషయం మీడియాలో సెన్సేషన్ కావడం, అదే సమయంలో తాను రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తీవ్రంగా మధనపడ్డానని ఈ స్టార్ పేసర్ వెల్లడించాడు. రోడ్డు ప్రమాదం కూడా ఐపీఎల్‌కు 10-12 రోజుల ముందే జరగడంతో తన కెరీర్ గందరగోళంలో పడిందన్నాడు. ఈ వరుస సమస్యలతో అల్లాడిన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. కానీ కుటుంబ సభ్యుల అండతో ఈ గండం నుంచి గట్టెక్కానని వ్యాఖ్యానించాడు. ఇక 2014లో హసీన్ జహాన్‌ను షమీ ప్రేమించి పెళ్లిచేసుకోగా.. వారికి ఓ పాప జన్మించింది. నాలుగేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది.
View this post on InstagramA post shared by hasin jahan (@hasinjahanofficial) on
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా