న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పఠాన్ బ్రదర్స్: తమ్ముడూ సూపర్ రా.. అన్నా నీకు తెలిసిందే కదా.. !!

Irfan Pathan and Yusuf Pathan involve in Twitter conversation after the former steer India Legends to win

ముంబై: టీమిండియా మాజీ ఆలౌరౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. అతని సోదరుడు, సీనియర్ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ల మధ్య ట్విటర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. తమ్ముడూ సూపర్ రా.. అని యూసఫ్ కొనియాడగా.. అన్నా నీకు తెలిసినోళ్ల నుంచి నేర్చుకున్నదే కదా.. అని ఇర్ఫాన్ బదులిచ్చాడు. ప్రస్తుత వీరి ట్వీట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

ఇంతకీ సంగేతంటంటే..

ఇంతకీ సంగేతంటంటే..

రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లెజండరీ క్రికెటర్లతో రోడ్డు సెఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ 2020ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియా లెజెండ్స్ తరఫున ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా శ్రీలంక లెజెండ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ ఇరగదీశాడు. ఆల్‌రౌండ్ షో‌తో అదరగొట్టాడు. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌‌తో ఓటమి అంచుకు చేరిన జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.

పుజారాను కాపాడిన ‘9 మీటర్ రూల్'.. ఆ నిబంధన మీకు తెలుసా?

పఠాన్ సూపర్ ఫిఫ్టీ..

పఠాన్ సూపర్ ఫిఫ్టీ..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఆ జట్టు దిల్షాన్(23), కపుగెడెరా(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత పేసర్ మునాఫ్ పటేల్(4/19) శ్రీలంక పతనాన్ని శాసించగా.. జహీర్ ఖాన్, పఠాన్, మన్‌ప్రీత్, సంజయ్ బంగర్ తలో వికెట్ తీశారు.

అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్.. ఇర్ఫాన్‌ పఠాన్‌ ( 31 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్‌లతో 57 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు చేసి 8 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన సచిన్ టెండూల్కర్(0), వీరేంద్ర సెహ్వాగ్(3) విఫలమయ్యారు. యువరాజ్ సింగ్(1) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. అద్భుతంగా ఆడిన ఇర్ఫాన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది.

సోదరా అదరగొట్టావ్: యూసఫ్ పఠాన్

ఈ అద్బుత ఇన్నింగ్స్‌నే కొనియాడుతూ యూసఫ్ పఠాన్ తన తమ్ముడిపై ట్విటర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించాడు. ‘తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా ఆడావు పఠాన్. నీ బ్యాటింగ్ చూడటం చాలా ఇష్టం. ముఖ్యంగా నీ బ్యాట్‌ నుంచి వచ్చే సిక్స్‌లు మరీ ఇష్టం. బంతితో కూడా అదరగొట్టావు. బ్రిలియంట్ ఆల్‌రౌండ్ షో'అని అభినందించే ఎమోజీలతో ట్వీట్ చేశాడు. దీనికి పఠాన్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. ‘మీకు తెలిసిన ఉత్తమమైన వాటి నుంచి నేర్చుకున్నా..లాలా'అంటూ బదులిచ్చాడు.

Story first published: Wednesday, March 11, 2020, 16:00 [IST]
Other articles published on Mar 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X