న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs MI: హైదరాబాద్ చేతిలో కోల్‌‘కథ’.. గెలిచి ప్లే ఆఫ్స్‌‌కు వెళ్తుందా?.. ఓడి దారిస్తుందా?

IPL 2020, SRH vs MI Preview: Sunrisers Hyderabad in do-or-die mode, win against Mumbai assures them playoff spot

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020‌ సీజన్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నీ లీగ్‌ దశ మ్యాచ్‌లకు నేటితో తెర పడనుంది. ముంబై ఇండియన్స్‌‌ అందరికంటే ముందే ఫ్లే ఆఫ్‌‌ బెర్తు దక్కించుకుంది. సోమవారం రాయల్ చాలెంజర్స్‌పై గెలుపుతో పాయింట్స్‌‌ టేబుల్‌‌లో సెకండ్‌‌ ప్లేస్‌‌తో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్వాలిఫయర్‌‌-1కు అర్హత సాధించింది. ఢిల్లీ చేతిలో ఓడిన ఆర్‌‌సీబీ కూడా మెరుగైన రన్‌‌రేట్‌‌తో థర్డ్‌‌ ప్లేస్‌‌తో ప్లే ఆఫ్స్‌‌కు క్వాలిఫై అయింది.

నాలుగో బెర్త్‌‌ కోసం సన్‌‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మంగళవారం జరిగే ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో టేబుల్‌‌ టాపర్‌‌ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. హైదరాబాద్ టైటిల్ గెలిచిన 2016 పరిస్థితులే ఈ సీజన్‌లో ఎదురవ్వడంతో.. ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశగా ఉన్నారు. మరీ వారి ఆశలను వార్నర్ సేన నిలబెడుతుందో లేదో చూడాలి.

గెలిస్తేనే ముందుకు..

గెలిస్తేనే ముందుకు..

ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీకి మెరుగైన రన్‌‌రేట్‌‌తో 12 పాయింట్లున్నాయి. కాబట్టి ముంబైపై గెలిస్తే వార్నర్‌‌సేన మూడో ప్లేస్‌‌కు ఎగబాకి ప్లే ఆఫ్స్‌‌కు అర్హత సాధిస్తుంది. అప్పుడు ఆర్‌‌సీబీ నాలుగో స్థానానికి రానుండగా.. కోల్‌‌కతా ఐదో ప్లేస్‌‌కు పడిపోయి టోర్నీ నుంచి ఎలిమినేట్‌‌ అవుతుంది. ఒకవేళ రైజర్స్‌‌ ఓడితే మాత్రం కోల్‌‌కతా తన నాలుగో ప్లేస్‌‌ను నిలబెట్టుకొని లాస్ట్‌‌ బెర్త్‌‌ దక్కించుకోనుంది.

అయితే, కేకేఆర్‌‌కు ఆ చాన్స్‌‌ ఇవ్వకూడదని హైదరాబాద్‌‌ భావిస్తోంది. గత రెండు మ్యాచ్‌‌ల్లో ఢిల్లీ, బెంగళూరును ఓడించి కాన్ఫిడెన్స్‌‌ పెంచుకున్న వార్నర్‌‌సేన అదే జోష్‌‌తో ముంబై పని పట్టాలని చూస్తోంది. అయితే ఇరు జట్ల మధ్య ఈ సీజన్ ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగులతో ఓటమి పాలైంది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.

ఉత్సాహంగా హైదరాబాద్..

ఉత్సాహంగా హైదరాబాద్..

అనేక ఇబ్బందుల తర్వాత చివరి దశలో రైజర్స్‌‌ టీమ్‌‌లో బ్యాలెన్స్‌‌ వచ్చింది. జానీ బెయిర్‌‌స్టోను పక్కనపెట్టాలన్న కీలక నిర్ణయం రైజర్స్‌‌ రాత మార్చిందని చెప్పొచ్చు. జానీ ప్లేస్‌‌లో ఓపెనర్‌‌గా వచ్చిన వృద్ధిమాన్‌‌ సాహా లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌ల్లో అదరగొట్టగా.. ఖాళీ అయిన ఫారినర్‌‌ కోటాలో ఆల్‌‌రౌండర్‌‌ జేసన్‌‌ హోల్డర్‌‌ రాకతో జట్టు బలం రెట్టింపైంది.

బెంగళూరుపై హోల్డర్‌‌, సందీప్‌‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు. వీరికితోడు లెఫ్టార్మ్‌‌ పేసర్‌‌ నటరాజన్‌‌, రషీద్‌‌ ఖాన్‌‌ కూడా సత్తా చాటడంతో హైదరాబాద్‌‌ ప్లే ఆఫ్స్​ రేసులో నిలిచింది. వార్నర్‌‌, పాండే కూడా ఫామ్‌‌లో ఉన్నారు. కాబట్టి మరోసారి ఆల్‌‌రౌండ్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేస్తే రైజర్స్‌‌ ముందంజ వేయగలదు.

పటిష్టంగా ముంబై..

పటిష్టంగా ముంబై..

గాయంతో కెప్టెన్‌‌ రోహిత్‌ శర్మ‌ దూరమైనా ముంబై ఇండియన్స్‌ ఓ రేంజ్‌‌లో విజృంభిస్తోంది. తాత్కలిక సారథి కీరన్‌ పొలార్డ్‌‌ ఆ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. రోహిత్ గైర్హాజరీతో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకున్న ఇషాన్ కిషాన్ ఇరగదీస్తున్నాడు. మరోవైపు డికాక్, సూర్యకుమార్ యాదవ్ టచ్‌లో ఉన్నారు.

గత మ్యాచ్‌ల్లో సౌరభ్ తివారీ విఫలమైనా.. అతను ఉన్నంత సేపు చెలరేగగలడు. పాండ్యా బ్రదర్స్, పొలార్డ్‌తో లోయరార్డర్ బలంగానే ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లతో కూడిన ఆ జట్టు బౌలింగ్‌కు తిరుగులేదు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. మరి, టేబుల్‌‌ టాపర్‌‌కు చెక్‌‌ పెట్టి సన్‌‌రైజర్స్‌‌ ప్లే ఆఫ్స్‌‌కు వస్తుందా? ఓడిపోయి కోల్‌‌కతాకు దారి వదులుతుందా? చూడాలి.

IPL 2020 Playoffs : DC, RCB Enter Playoffs, KKR-SRH Fate To Be Decided | Oneindia Telugu
తుది జట్లు

తుది జట్లు

జట్లు (అంచనా):

ముంబై: ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్/ క్రిస్ లిన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా/జయంత్ యాదవ్, కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్ నీల్, రాహుల్ చహర్, ట్రెంట్‌ బౌల్ట్/మెక్లీన్‌గన్, జస్ప్రీత్‌ బుమ్రా/ ధావల్ కులకర్ణి

హైదరాబాద్: డేవిడ్ వార్నర్, సాహా, మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్, సమద్, అభిషేక్ శర్మ, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షెబాజ్ నదీమ్/ ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టీ నటరాజన్.

DC vs RCB trolls: ఢిల్లీతో కోహ్లీ డీల్.. కృతజ్ఞతా భావం చాటుకున్న అయ్యర్.. నెట్టింట పేలుతున్న మీమ్స్!

Story first published: Tuesday, November 3, 2020, 9:34 [IST]
Other articles published on Nov 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X