ఢిల్లీతో కోహ్లీ డీల్..
ఇక 153 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. శిఖర్ ధావన్, పృథ్వీషా వరుసగా బౌండరీలు బాదారు. షా త్వరగానే ఔటైనా.. క్రీజులోకి వచ్చిన రహనేతో ధావన్ ధాటిగా ఆడాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి ఆ జట్టు వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది. ఈ దూకుడుతో ఢిల్లీ 17 ఓవర్లలోపే మ్యాచ్ ముగిస్తుందా? అనిపించింది. కానీ ఆర్‌సీబీ స్పిన్నర్లు కట్టడి చేయడంతో మ్యాచ్ 19 ఓవర్ల వరకు వెళ్లింది. దాంతో ఆర్‌సీబీ సులువుగా క్వాలిఫై అయింది. అయితే అభిమానులు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఢిల్లీతో కోహ్లీ డీల్ చేసుకున్నాడని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయ్యర్ కృతజ్ఞతా..
అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో తనను ఎంపిక చేసినందుకు విరాట్ కోహ్లీకి ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ ఈ రకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌తో ఫన్నీ మీమ్స్, వీడియోలు పంచుకుంటున్నారు. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగకుండా ఆడాలని ముందే ఒప్పందం చేసుకున్నారని, అప్పుడు ఇద్దరం క్వాలిఫై కావచ్చనే నిర్ణయానికి వచ్చారని కామెంట్ చేస్తున్నారు.
ఓ కోహ్లీ అది క్యాచా?
ఇక ఆర్‌సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ తీయకపోవడంపై.. ఆఖరిలో క్యాచ్ వదలడంపై కూడా నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ కవర్స్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. అయితే ఆ దిశలోనే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ బంతిని అందుకోలేకపోయాడు. దాంతో చిర్రెత్తుకుపోయిన కోహ్లీ.. మైదానంలో చాహల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీన్ని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. అంత కష్టమైన క్యాచ్ చేజార్చితే మండిపడుతున్నావేందని ప్రశ్నిస్తున్నారు. అసలు అక్కడ చాహల్‌ను ఎందుకు పెట్టావని, హైట్ ఉన్న ఫీల్డర్లను పెడితే అయిపోవు కదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్కంఠగా ముగిసేది..
కొంచెం హైట్ ఉన్న ఫీల్డర్ అక్కడుంటే ఆ క్యాచ్ పట్టేవారు. అప్పుడు మ్యాచ్‌లో కొంచెం ఉత్కంఠ పెరిగేది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్ పడిక్కల్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్ రన్‌రేట్ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.


Click it and Unblock the Notifications

ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడానికి కష్టపడ్డాం: విరాట్ కోహ్లీ