న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే అతని బౌలింగ్ ఒకసారి ఆడాలనుకుంటున్నా: సచిన్ టెండూల్కర్

IPL 2020: Sachin Tendulkar says Maybe I can request Rashid Khan to bowl at me in the nets

ముంబై: అఫ్గానిస్థాన్ సెన్సేషన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని గూగ్లీ వేరియేషన్స్ అద్భుతమని కొనియాడాడు. రషీద్ వేసే బంతులను ఏమాత్రం అంచనా వేయలేమని ఈ భారత క్రికెట్ దిగ్గజం తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చాడు. అతన్ని ఎదుర్కొనే టెక్నిక్‌ను తెలుసుకునేందుకు ఒకసారి అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయాలనుందన్నాడు. కనీసం నెట్స్‌లోనైనా అతని బౌలింగ్ ఆడుతానని తెలిపాడు.

ఎప్పుడూ ఆ కోణంలోనే చూస్తా..

ఎప్పుడూ ఆ కోణంలోనే చూస్తా..

‘రషీద్ వరల్డ్ క్లాస్ బౌలర్. నేనెప్పుడు అతని బౌలింగ్ ఆడలేదు. కానీ అతని బౌలింగ్ చూశాను. అతని గురించి విన్నాను. రషీద్ వేసే మిస్టరీ గూగ్లీలను చాలా కొంత మంది మాత్రమే ఆడగలరు. అతను ఎలాంటి బంతులను వేయబోతున్నాడని ఏ మాత్రం ఊహించలేం. రషీద్ బౌలింగ్‌ను నేను ఆడలేదు కనుక. నేనెప్పుడూ ఇదే కోణంలో అతని బౌలింగ్‌ను పరిశీలిస్తుంటా.'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

అందుకే చెప్పలేకపోతున్నా..

అందుకే చెప్పలేకపోతున్నా..

అలాగే లెగ్ స్పిన్నర్స్ బౌలింగ్‌లో తాను ఎలా ఆడేవాడినో, వికెట్ ఎలా కాపాడుకునేవాడినో కూడా ఈ వీడియోలో మాస్టర్ వివరించాడు. అయితే తాను ఇప్పటి వరకు అఫ్గాన్ స్పిన్నర్ బౌలింగ్‌ను ఆడలేనందున అతన్ని ఎదుర్కునే టెక్నిక్‌ను చెప్పలేనన్నాడు. కాకపోతే అతని రనప్‌ను, చేతి కదలికలను గమనించాలని బ్యాట్స్‌మెన్‌కు సూచించాడు.

‘బౌలర్ల గ్రిప్‌ను చూడటం చాలా ముఖ్యం. చాలా సార్లు బౌలర్లు వారి గ్రిప్ కనబడకుండా దాచే ప్రయత్నం చేస్తారు. అయితే బంతిని రిలీజ్ చేయడాన్ని మాత్రం వారు దాచలేరు. ఎలా వేస్తున్నాడనేది సులువుగా తెలిసిపోతుంది. ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోతాయి. కొన్ని సార్లు టైమ్ తీసుకున్నా.. బౌలర్ల వేసే బంతులను పసిగట్టి ఆడవచ్చు.

నెట్స్‌లో బౌలింగ్ చేయమంటా..

నెట్స్‌లో బౌలింగ్ చేయమంటా..

నేను రషీద్ రనప్‌ను గమనించా. అతను బౌలింగ్ వేసేటప్పుడు అతని భుజ కదలికను కూడా పరిశీలించా. కాకపోతే అతని బౌలింగ్‌ను నేరుగా ఆడకపోవడం వల్ల ఈ విధంగా ఆడాలని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నా. ఎవరికైనా ఆడేవరకు ఈ విషయం తెలియదు. ఇది తెలుసుకోవడానికైనా నెట్స్‌లో నాకు బౌలింగ్ చేయమని అతన్ని రిక్వెస్ట్ చేస్తానేమో'అని సచిన్ చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో రషీద్ అద్భుత బౌలింగ్‌తో అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ అఫ్గాన్ బౌలర్ 17 వికెట్లతో వికెట్ టేకర్ జాబితాలో 6వ స్థానంలో ఉన్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (3/7) బెస్ట్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు.

DC vs MI: ఇ'స్మార్ట్‌' ఇషాన్ కిషన్.. ముంబై చేతిలో చిత్తయిన ఢిల్లీ!

Story first published: Saturday, October 31, 2020, 19:56 [IST]
Other articles published on Oct 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X